/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz YBD: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన నిందితుడు Mane Praveen
YBD: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసిన నిందితుడు


యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదాద్రి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల తో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మోసం.. వివరాలకు వెళితే...

యాదాద్రి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన వినయ్ కృష్ణ రెడ్డి పేరిట ఆర్డర్ కాపీలను తయారుచేసిన ఆలేటి నవీన్.

నకిలీ ఆర్డర్ కాపీలను కొంతమందికి ఇచ్చిన మోసగాడు.

మోట కొండూరు మండలం వర్టూర్ గ్రామానికి చెందిన నిందితుడు ఆలేటి నవీన్.

తండ్రి ఆలేటి స్వామి వృత్తి రీత్యా అడ్డగుడూర్ ఎంపిడివో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు కొనసాగిస్తున్నాడు.

నిందితుడు పదిమంది భాదితుల నుండి దాదాపు 15 లక్షల నుండి 20లక్షలు వరకు వసూలు చేశాడు.

కలెక్టర్ ఆఫీసులలో అసిస్టెంట్ ఉద్యోగం, విద్యా శాఖలో మూడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన నిందితుడు నవీన్.

గతంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన టీ.వినయ్ కృష్ణ రెడ్డి మరియు గతంలో పనిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని.. సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్ కాపీని సైతం బాధితులకు ఇచ్చాడు.

తీరా అవి నకిలీవని తెలియడంతో బాధితులు లబోదిబోమంటూ భువనగిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

బాధితుడు పుల్లెల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్న పోలీసులు.

TS: ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం: సజ్జనార్

తెలంగాణలోని కొన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లతో ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎం.డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కు మంచి స్పందన వస్తోంది.ఈ పథకాన్ని మహిళలు,బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు.

కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకు రావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్‌లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపుకార్డు లలో ఏదో ఒకటి ఒరిజినల్ చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నట్లు తెలిపారు.

జిరాక్స్ కాపీలు, స్మార్ట్ ఫోన్ల లో ఐడీలు చూపిస్తే ఉచిత ప్రయా ణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటో లు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటో లు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

TS: కెసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు అసెంబ్లీ సమావేశంలో గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాలేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో తొమ్మిదేళ్లుగా సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే ఉందని, అయినా తెలంగాణకు ఏం చేయలేదని మండిపడ్డారు. కెసిఆర్, కేటీఆర్ లను ఉద్దేశిస్తూ.. మీరు వచ్చాక శివుడి తలపై ఉన్న గంగను భూమి మీదకు తెచ్చి కాళేశ్వరానికి పారించారా? అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.

TS: ఫలించిన వివేక్ వెంకటస్వామి కృషి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఎన్నికలు అయిపోయిన 15 రోజుల్లోనే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సింగరేణిలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ లను నెరవేర్చడం జరిగింది.

TS: ఆర్టీసీ బస్సుల్లో ఒకే రోజులో 51.74 లక్షల మంది ప్రయాణం

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆర్టీసీ బస్సులు మునుపటి లాగా జనంతో కిక్కిరిసిపోతున్నాయి.

ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లలో సీట్లు దొరకని వారు నిలుచుని మరీ ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.

మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 51.74 లక్షల మంది ప్రయాణాలు చేశారు. 

వీరిలో 30.16 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం.

సైదాపూర్: ఓటు నమోదు పై బిఎల్వోలకు శిక్షణ

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండల పరిధిలోని ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తదితర విషయాలపై బుదవారం బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్ లకు శిక్షణ కార్యక్రమం మండలం తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ దూలం మంజుల మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని అధికరణ 324, 325, 326 ప్రకారము ఎన్నికల సంఘ నియమావళిని అనుసరించి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని,అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. 

స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్-2) ఏర్పాటు చేసి బిఎల్ఓ లకు మాస్టర్ ట్రైనర్ల చే శిక్షణ ఇవ్వడం జరిగిందని, ప్రతి బిఎల్ఓ తమ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఫామ్ 6,7,8 లకు సంబంధించిన ఓటర్ల నమోదు పై అవగాహన ఏర్పరచుకొని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని ఓటర్ల జాబితాను నమోదు చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మల్లేశం, సీనియర్ అసిస్టెంట్ మమ్మద్ నదీం, ఆర్ ఐ శరత్, జూనియర్ అసిస్టెంట్ రాజు, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది విక్రమ్ రెడ్డి, రవి రాజు, రాధిక, సూపర్వైజర్లు, బిఎల్ఓ లు పాల్గొన్నారు.

TS: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి, నేడు యాదాద్రి జిల్లా పోచంపల్లి లో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లి లో ఫేమస్ అయిన చేనేత పరిశ్రమ గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందని.. తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందని కొనియాడారు. 

పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం.. యూఎన్ఏ భూదాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమన్నారు. చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదని కొనియాడారు. ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతు దొరుకుతుందని, చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలని, చేనేత రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

NLG: పుల్లెంల గ్రామంలో "వికసిత్ భారత్ సంకల్ప యాత్ర" కార్యక్రమం

నల్లగొండ జిల్లా:

చండూర్ మండలం పుల్లెంల  గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన "వికసిత్ భారత్ సంకల్ప యాత్ర" కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది . ఈ సందర్బంగా అధికారులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి గ్రామస్థులకు తెలియజేసి, ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉన్నచో సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

NLG: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కంచి మధు, కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

TS: తెలంగాణ అప్పులు రూ. 6,71,757 కోట్లు...

శ్వేత పత్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రస్తుతం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 72,658 కోట్లు ఉండగా, పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగినట్లు శ్వేత పత్రం ద్వారా తెలిపింది. రెవిన్యూ రాబడి ద్వారా రుణాల చెల్లింపు భారం 34 శాతం, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కొరకు 35 శాతం కేటాయించినట్లు పేర్కొంది.