నల్లగొండ:డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు స్వాధీన పరచాలి:సిపిఎం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు స్వాధీన పరచాలి-------- సిపిఎం
అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించి డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబల్ బెడ్రూమ్ ఇల్లు స్వాధీన పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 2017లో 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా గత ప్రభుత్వం వదిలి వేసిందని అన్నారు. నిర్మాణం పూర్తయిన మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ స్వాధీనపరచలేదని అన్నారు. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తిచేసి డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే స్వాధీన పరచాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో వేలాదిమంది ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న పేదలను గుర్తించి ప్రభుత్వం కొనుగోలు చేసి మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఇంటి స్థలం ఇస్తూ పేదలందరికీ ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
*సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, మైల యాదయ్య మధుసూదన్ రెడ్డి, అరుణ, లింగమ్మ, మారగొని నగేష్, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




హైదరాబాద్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ.. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ.. హాజరైన దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది
నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విద్యార్థి దశ నుంచి ఆఫీసర్లుగా మారబోతున్నారు మీపై బాధ్యత పెరిగింది.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. దేశగౌరవం, దేశ భద్రత మీపై ఉంటుంది- రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
నాగబాబు ఆధ్వర్యంలో జనసేన నేతలతో నియోజకవర్గాలతో సమీక్ష సమావేశం రెండో రోజు కొనసాగుతుంది. నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నేతలతో సమావేశం.. పాల్గొన్న జనసేన పార్టీ నేతలు అజయ్ కుమార్, మనక్రాంత్ రెడ్డిలు
PFI కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు.. తెలంగాణకు చెందిన అబ్దుల్ సలీం, అబ్దుల్ అహ్మద్.. ఏపీకి చెందిన షేక్ అహ్మద్ కోసం గాలిస్తున్న అధికారులు.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన ఐదుగురు.. తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తుల కోసం ఎన్ఐఏ గాలింపు..
హైదరాబాద్: ధర్నా చౌక్‌ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం.. ధర్నా చౌక్‌ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ధర్నా చౌక్‌లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం.. ధర్నా చౌక్‌లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదు.. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా ధర్నాలు చేపట్టవచ్చు. -సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి..
హైదరాబాద్: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్.. హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధాగుప్త.. ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి.శ్రీజ.. రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి.. జనగామ అడిషన్ కలెక్టర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్.. మహబూబాబాద్ అదనపు కలెక్టర్‌గా లెనిన్ వత్సల్ టోప్పో.. మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్.. వనపర్తి అదనపు కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్.. జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్‌గా పి.కధీరవన్ నియామకం.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్‌తో కాల్చుకున్న నరేశ్.. మృతులు ఆకుల నరేష్, భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ.. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన
Dec 18 2023, 08:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.2k