చర్ల: అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి..
అర్హులైన వారందరికీ పెన్షన్స్ ఇవ్వాలనీ చర్ల ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ గారికి న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది
అర్హులైన వారందరికీ పెన్షన్స్ ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ ఇంకా చర్ల మండలంలో 50%శాతం పెన్షన్స్ రావలసిన వాళ్ళు ఉన్నారని అధికారులు
సర్వేచేసి పెన్షన్ల్ ఇవ్వాలని కోరారు గత పరిపాలనలో ఎన్నిసార్లు వికలాంగుల పెన్షన్లు ఆసరా పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు అప్లై చేసుకున్నా పెన్షన్ లు రాలేదని అనేక కారణాలతో తిరస్కరించారని ఈ ప్రభుత్వంలోనైనా అర్హులైన వారికి పెన్షన్ల సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నాం ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .
పెన్షన్ల్ కోసం అనేకసార్లు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోయింది. పెన్షన్ వస్తే వారికి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అనుకున్నము. దానితో వారి జీవనంలో ఎంతో కొంత మార్పు వస్తుందని వారు తెలియజేశారు. అర్హులైన వారికి పెన్షన్ వచ్చేలా సర్వేచేసి పత్రాలు పరిశీలించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చదరన్ క్యాంపులో కెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకున్న ఫలితం లేకుండా పోయింది పెండింగ్లో ఉన్న పెన్షన్ ఇప్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నాం. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ గారికి కు ఇవ్వటం జరిగింది వారు మాట్లాడుతూ సానుకూలంగా స్పందిస్తూ పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్ మండల నాయకులు చిరిగిడి నరేష్ మండల నాయకులు కణితి భాను ప్రకాష్ ఇరప సమ్మక్క బియ్యం లక్ష్మి అక్కల దేవి వెంకటేశ్వర్లు స్వరూప మనోజ్ గంగుల వెంకటి జయమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,091 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,246 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు
అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.
Dec 12 2023, 10:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.0k