చర్ల:తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత
తుఫాను తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలనీ , సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ చర్ల . డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది:
గత నాలుగు రోజులుగా కురుస్తున్న మీచాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,కౌలుదారులకి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ చర్ల డిప్యూటీ తాసిల్దార్ భరణి బాబు గారికి రైతులతో వినతి పత్రం సమర్పించడం జరిగింది అనంతరం సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ
ఈ తుఫాను వలన రాత్రింబవళ్లు కష్టపడి, అధిక వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెట్టిన పంటలు తుఫానుతో నేలమట్టం కావడంతో రైతులందరూ కన్నీటి పర్వతంలో మునుతున్నారనీ ."దేశానికీ రైతే రాజని, రైతే వెన్నుముక" అని ప్రగల్బాల్ పలికే ప్రభుత్వాలు ఇప్పటివరకు కనీసం వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే కూడా చేయలేదని వారన్నారు.మీ చాంగ్ తుఫాను వలన పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న కూరగాయల పంటలు వేలాది ఎకరాలు నేలమట్టం అయ్యాయని, పనికిరాకుండా అయిపోయాయని రైతు చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని అన్నారు.మరోపక్క వేల రూపాయలు పెట్టి పంట పొలాలను కౌలుకు తీసుకుంటే ఈ తుఫాను కారణంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వారన్నారు.కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని,పంట నష్టపోయిన రైతుకు ఎకరంకు వరి మొక్కజొన్నకు 25000,
పత్తికి 30,000 మిర్చికి 50,000 నష్టపరిహారంగా చెల్లించాలని, కూరగాయలకు ఏకరంకు 10,000 తక్షణమే అధికారులతో సర్వేలు చేయించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నూతన ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ . ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు సిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ సమ్మక్క కురుసం సమ్మక్క కనకమ్మ సపక నాగలక్ష్మి జ్యోతి రవణ తదితరులు పాల్గొన్నారు.



తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,091 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,246 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు
అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.
మార్నింగ్ ముచ్చట్లు..
Dec 12 2023, 09:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.4k