/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలా వద్దా ❓️ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ..! Yadagiri Goud
మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలా వద్దా ❓️ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ..!

భారీ వర్షాలనేపథ్యంలో రేపు,ఎల్లుండి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.సెలవుల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరోవైపు.. తెలంగాణ సీఎంవో సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి హరీష్ రావులను ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు ట్వీట్లు చేస్తున్నారు. అయితే.. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ గంట గంటకూ పెరుగుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే మూడ్రోజులు గురు, శుక్ర, శనివారాలు వరుసగా సెలవులు ఇవ్వగా.. ఇప్పుడు మళ్లీ సెలవులు పొడిగించాలా..? వద్దా..? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే.. రాత్రి పదిలోపు సెలవులపై విద్యాశాఖ నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.

అయితే రేపు, ఎల్లుండి దాదాపు సెలవులు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచేస్తున్నాయి.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కాసింత వర్షం తగ్గింది కానీ.. వరద మాత్రం అలానే ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, రోడ్ల మీదనే చెట్లు కూలిపోవడం, కొన్ని గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్కూళ్లకు వెళ్లడానికి విద్యార్థులు ఇంకెంత ఇబ్బంది పడతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. సోమవారం స్కూల్స్ ఉన్నా మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించాలని.. ఆ రెండ్రోజులు భారీగా వర్షాలు ఉండే చాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఈ డిమాండ్లు వినడం, సోషల్ మీడియాలో చూశాక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి...

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

కొమురవెల్లి :జులై 23

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయనికి భక్తుల తాకిడి నెలకొంది.

ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్లి దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కుల రూపంలో కేషఖండన, అభిషేకం, నిత్య కల్యాణం, గంగరేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నరు. భక్తుల రద్దీ సాధారణంగా ఉందని ఆలయ ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్ గిస భిక్షపతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగ శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుడి మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజరులు, ఆలయ సిబ్బంది సార్ల విజయ్ కుమార్, నర్సింహులు, మాధవి, తదితరులు భక్తులకు సేవలందించారు.....

Chandrayaan-3: 25న మళ్లీ చంద్రయాన్‌-3 కక్ష్య దూరం పెంపు..

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ నుంచి ఈనెల 14న ప్రయోగించిన చంద్రయాన్‌-3 మిషన్‌కు ఈనెల 25న అయిదోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు.‌.

బెంగళూరులోని ఇ్రస్టాక్‌ కేంద్రం శాస్త్రవేత్తలు 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ ఆపరేషన్‌ చేపట్టనున్నారు.

భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్‌తో చంద్రయాన్‌-3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడ్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తుంది.

ఆగస్ట్‌ 1 నాటికి చంద్రయాన్‌-3 లూనార్‌ ఆర్బిట్‌ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్క డ నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరి్రభమిస్తూ ఆగస్ట్‌ 23న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో

ప్రపొల్షన్‌ మాడ్యూల్‌ ల్యాండర్‌ను విడిచి పెడుతుంది. అదే రోజు సాయంత్రం ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది..

Pawan kalyan: బైజూస్‌ కాంట్రాక్టుపై పవన్‌ ప్రశ్నల వర్షం.. రూ.750 కోట్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

అమరావతి: నష్టాల్లో ఉన్న బైజూస్‌ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్‌ వేదికగా నిన్న ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మరికొన్ని ప్రశ్నలు సంధించారు.

'' రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేసిన ట్యాబ్‌ల కోసం దాదాపు రూ.580 కోట్లు ఖర్చు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది.

బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌ కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్‌ లోడ్‌ చేసి ఇస్తామని అంగీకరించారు. వచ్చే ఏడాది మళ్లీ ప్రభుత్వం రూ.580 కోట్లు ఖర్చు చేసి ట్యాబ్‌లు కొననుందా? అని జనసేనాని ట్వీట్‌ చేశారు..

ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన ప్రశ్నలివే..

• బైజూస్‌ కంటెంట్‌ కోసం వచ్చే ఏడాది నుంచి ఖర్చు ఎవరు భరిస్తారు? కంపెనీ వారు ప్రతి ఏడాది ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది. 8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్‌ వారు కంటెంట్‌ లోడ్‌ చేసిన ట్యాబ్‌లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ, బైజూస్‌ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుంచి ఏటా ఉచితంగా కంటెంట్‌ ఇస్తామని చెప్పలేదు.

• ఒక వేళ కంపెనీవారు ఖర్చు భరించలేకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో రూ.750 కోట్లు బైజూస్‌ కంటెంట్‌ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

• ఎనిమిదో తరగతి నుంచి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్‌ ఖర్చు ఎవరు భరిస్తారు?

• బైజూస్‌ సంస్థ ఏ మాధ్యమంలో, ఏ సిలబస్‌ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్‌ రూపొందిస్తున్నారు?అని పవన్‌ కల్యాణ్ ట్విటర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు..

చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన వేముల గోపీనాథ్

శాలిగౌరారం: శాలిగౌరారం మండల వాసి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు వేముల గోపీనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘట్కేసర్ పరిధిలోని పి పి ఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన వేడుకలకు వేముల గోపీనాథ్ హాజరై చామల కిరణ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శాలిగౌరారం మండల వాసి టిపిసిసి ఉపాధ్యక్షులుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం అభినందనీయమని,భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని పార్టీలకు అతీతంగా జన్మదినాన్ని పురస్కరించుకుని మర్యాదపూర్వకంగా కలిసినట్లు వేముల గోపీనాథ్ వెల్లడించారు..

SB NEWS

మైనారిటీలకూ రూ. లక్ష ఆర్థిక సహాయం.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. మైనారిటీల అభివృద్ధి , సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం పునరుద్ఘాటించారు.

విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని అన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు..

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

•సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక అనారోగ్యానికి గురవుతున్న విద్యార్థులు

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్_

బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న పెంచినటువంటి మెస్ చార్జీలు స్వాగతిస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచితే విద్యార్థులు ఇంకా సంతోషపడే వారిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.

సంక్షేమ వసతి గృహాలలో వసతులు సరిగా లేక విద్యార్థులు ఎందరో అనారోగ్య గురవుతున్నారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని ఖాళీ అయిన వార్డెన్ పోస్ట్ లనే తక్షణమే భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్ధులకు నోటు పుస్తకాలు, యూని ఫామ్ బెడ్ షీట్ , ఇవ్వకుంటే విద్యార్ధులు ఎలా చదువుకుంటారనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టిం చుకోవడ లేదు విద్యార్ధులకు కొత్త మెనూ ప్రకారం ఆహారాన్ని అందించవలసిన వార్డెన్లు పాత మెనూనే పాటిస్తునారు. వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.

విద్యా ర్ధుల సంఖ్య తగ్గట్టు బాత్రూమ్స్ నిర్మించాలి. విద్యార్థులకు త్రాగునీరు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలి జిల్లా కలెక్టర్, స్థానిక ఎం.ఎల్.ఎ సంక్షేమ వసతి గృహాలు అన్నింటిని సందర్శించి వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని విద్యార్ధుల సమస్యలన్నింటిని పరిష్కరించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేని యెడల బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ్ నరేష్ గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజు యాదవ్ ,శేఖర్ యాదవ్, సతీష్ ,రాములు ,మహేష్ , రవి ,రమేష్ ,శంకర్ ,మల్లికార్జున్ ,యాదగిరి ,మల్లేష్ ,లక్ష్మణ్, పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Zaheerabad: హెల్మెట్‌ ధరించి టమాటాల చోరీ

జహీరాబాద్: దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటడంతో దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో టమాటా ట్రేలను దొంగ ఎత్తుకెళ్లాడు..

ముఖం గుర్తించకుండా హెల్మెట్‌, జాకెట్‌ ధరించిన దొంగ.. ₹6,500 విలువైన మూడు ట్రేలను దొంగిలించాడు.

కమిషన్‌ ఏజెంట్ దుకాణం నుంచి రైతు తీసుకొచ్చి నిల్వ ఉంచిన మూడు టమాటా ట్రేలను దుండగుడు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు

సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై కమిషన్‌ ఏజెంట్‌, బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

నీ గర్భంలో నాకు ప్రాణం పోసింది ఇందుకేనా❓️

పల్నాడు జిల్లా:జులై 23

తల్లిపొత్తిళ్లలో సేద తీరాల్సిన పసికందు ఆర్టీసీ బస్టాండ్ బాత్ రూమ్‌లో ప్రత్యక్షమైంది. ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తల్లి మాతృత్వపు మమకారాన్ని సైతం కాదనుకుంది. అంతే పురిట్లో పుట్టిన బిడ్డను ఆర్టీసీ బాత్ రూమ్‌ లో వదిలి వెళ్లిపోయింది.

అయితే టాయిలెట్ కోసం వచ్చిన ప్రయాణికులు చిన్నారిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని పసికందును రక్షించారు.

ఈ అమానుష ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. కన్నపేగు బంధాన్ని పొత్తిళ్లలోనే తుంచేసుకున్న దారుణ ఘటన వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్‌లో వెలుగులోకి వచ్చింది.

నవ మాసాలు కడుపులో మోసి బిడ్డను కన్న ఓ తల్లి వినుకొండ బస్టాండ్‌లోని ఆర్టీసీ టాయి లెట్‌లో వదిలేసి వెళ్లిపోయింది. అయితే టాయిలెట్‌లో పసిగుడ్డు ఏడుపును ప్రయాణికులు గుర్తించారు. టాయిలెట్‌లో చిన్నారిని చూసి చలించి పోయిన వారు ఆర్టీసీ సిబ్బంది తోపాటు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే చిన్నారి ప్రాణాలతో ఉండటాన్ని గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పసి కందును ఆర్టీసీ బస్టాండ్‌లో వదిలివెళ్లిన వాళ్లు ఎవరో తెలుసుకునే పనిలోపడ్డారు. తల్లిదండ్రులే ఈ బిడ్డను వదిలిపెట్టారా? లేక వేరొకరి చిన్నారిని ఎత్తుకొచ్చి ఇక్కడ వదిలేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు...

దోమలను నివారించాలంటే ఇంటి పరిసరాలను శుభ్రం చేయండి . మంత్రి హరీష్ రావు*

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న ఉదయం 10 గంటలకు .. దోమల నివారణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

కోకాపేటలోని తన నివాసంలో 10 నిమిషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీరును స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షా కాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు.

వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు....