/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఒక్కరోజు ముందే కేటీఆర్‌ బర్త్‌డే! Yadagiri Goud
ఒక్కరోజు ముందే కేటీఆర్‌ బర్త్‌డే!

•పోటాపోటీగా బీఆర్‌ఎస్‌ నేతల ప్లెక్సీలు

మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు ఒక్కరోజు ముందే వచ్చిందన్న వాతావరణం నెలకొంది. సోమవారం కేటీ ఆర్‌ పుట్టినరోజు కాగా పోటీ పోటీగా బీఆర్‌ఎస్‌ నేతలు ఆయన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ చౌరస్తా వరకు మెట్రోఫిల్లర్లపై కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నేతలు

కర్నాటి విద్యాసాగర్‌, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మును గోడు నుంచి విద్యాసాగర్‌ టికెట్‌ను ఆశిస్తుండగా, ఉప్పల్‌ నుంచి పోటీ చేయాలని రామ్మోహన్‌ భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దగ్గర సైతం ఈ నేతల ప్లెక్సీలు కనిపించాయి....

నేడు కాంగ్రెస్ పీఏసీ సమావేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశ మవుతుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొంటారు.

రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే రాజకీయ వ్యవహారాలు, పార్టీ చేరికలు, యాత్రలు, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో, తదితర అంశాలపై చర్చలు జరుగు తాయని సమాచారం. కర్నాటకలో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ నేతల్లో మరింత జోష్ పెరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరి కలతో పార్టీ బలోపేతంగా మారింది.

పార్టీలో ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను విడతల వారీగా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపైన చర్చించేందుకు ఈ నెల 20న పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, జూపల్లి కృష్ణారావు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. పార్టీ నేతలంతా ఏకతాటిపైన ఉన్నారన్న సంకేతాన్ని కాంగ్రెస్‌ శ్రేణుల్లోకి పంపేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో.. నేతల మధ్య ఐక్యతపైనే ప్రధానంగా చర్చించారు.

ఇందులో భాగంగా బస్సుయాత్రను నిర్వహించడంతో పాటుగా తరచుగా పార్టీ ముఖ్య నాయకులు ఇలాంటి విందు సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీని, మేనిఫెస్టో కమిటీని వేసుకోవాలని, మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారంలోకి వెళ్లిపోవాలని అనుకున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ముఖ్యమైన అంశాలను ప్రచారంలో తరచూ ప్రస్తావించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది........

మణిపూర్ దారుణంపై ఐఏఎస్ స్మిత సబర్వాల్ స్పందన

మణిపూర్ లో మే 4న చోటుచేసుకున్న దారుణంపై యావత్ దేశం స్పందిస్తోంది. ఓ తెగకు చెందిన మహిళలను వివస్త్రలుగా మార్చి వీధుల్లో ఊరేగించడంపై జనం మండిపడుతున్నారు. పార్లమెంట్ కూడా రెండు రోజులుగా దద్దరిల్లుతోంది.

ఈ ఘటనపై తాజాగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ స్పందించారు. ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా మీడియా వెలుగులోకి తీసుకురావడంలేదేమని ప్రశ్నించారు.

చరిత్రలో ఎప్పుడు ఎలాంటి కలహాలు జరిగినా సరే అందులో మహిళలనే అవమానిస్తున్నారని స్మిత సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను నిస్సహాయ స్థితిలోకి నెట్టి దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

మణిపూర్ లో అమాయక మహిళలను వివస్త్రలుగా మార్చి వేల మంది ముందు నిలబెడితే దాదాపు 70 రోజుల తర్వాత కానీ బయటకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణం మన మూలాలను కదిలిస్తోందని, అక్కడి మీడియా ఏంచేస్తోందని ప్రశ్నించారు.

మణిపూర్ తగలబడిపోతుంటే, దారుణాలు జరుగుతుంటే ప్రపంచం దృష్టికి తీసుకురాకుండా ఏంచేస్తోందని మీడియాను నిలదీశారు. రాజ్యాంగపరంగా తమకున్న విశేష అధికారాలను ఉపయోగించి మణిపూర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలంటూ స్మిత సబర్వాల్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ను ట్యాగ్ చేస్తూ స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు. నైతికత లేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మిత సబర్వాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కఠిన శిక్షలు లేని ; చట్టాలెందుకు ❓️

మణిపూర్ లోని ఇద్దరు కుకి మహిళలపై జరిగిన దారుణ సంఘటన దేశంలోని స్త్రీలకు గల రక్షణ ఏపాటిదో స్పష్టం చేసింది. సంఘటనపై సుమోటాగా స్పందించిన సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటుగా వ్యాఖ్యానించడం అభినందనీయం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పా, మిగతా సమయంలో కోర్టులు కానీ, మీడియా కానీ పట్టించుకోకపోవడం శోచనీయం.

వాస్తవంగా ఆలోచిస్తే మహిళలపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం ఇలాంటి హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సంఘటన అనంతరం కూడా ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జరిగిన సంఘటనకు మత రాజకీయం పూసి, లబ్ది పొందాలనుకోవడం దురదృష్టకరం.

చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది నిజమే కావచ్చు కానీ ఇలాంటి సంఘటనల్లో బాధితుల కన్నా ఎక్కువగా రాజకీయ పార్టీలు లాభపడుతున్నాయి అని చెప్పొచ్చు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నంతకాలం మహిళలు, బాధితులు బలవుతూనే ఉన్నారు.

నిందితుల పైన ఎన్ని బలమైన చట్టాలు ప్రయోగించినా భారత చట్టాలలోని బలహీనతలు ఆధారంగా నిందితులు జైలు నుండే కాదు, కేసుల నుండి కూడా బయటపడుతూనే ఉన్నారు. ఇలాంటి కేసుల్లో అయితే విదేశాల్లో ఖచ్చితంగా మరణ శిక్షలు విధిస్తారు కానీ మనదేశంలో మాత్రం నిందితుల పక్షాన నీతి సూత్రాలు వల్లిస్తాం, వారిని దర్జాగా వదిలేస్తాం. అత్యాచారాల విషయాల్లో నిందితులను ఉరి తీయాలి అని వాదించే రాజకీయ నాయకులు ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న ఉదంతాలు దేశంలో ఎన్నో వున్నాయి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడే నాయకులు ఒక్క మన దేశంలో మాత్రమే కనిపిస్తారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు, దీర్ఘకాలిక విచారణ కారణంగా బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదు. నేరాన్ని నిరూపించి, నిందితులకు శిక్షలు వేయించడంలో పోలీసులు సైతం విఫలమవుతూనే వున్నారు.

పోలీసు, న్యాయవ్యవస్థల్లోని అవినీతి, లంచగొండితనం కూడా నేరస్తులకు శిక్షలు పడకుండా కాపాడుతోంది. ఈ దేశాన్ని దేవుడు కూడా రక్షించలేడని గతంలో సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. న్యాయవాదులు సైతం ఇలాంటి హత్యాచార ఘటనల్లో నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకోవడం మానేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మహిళలపై నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా శిక్షలు పడితేనే ఇలాంటి హత్యాచారాలు పునరావృతం కావు. నేరస్థులపై శిక్షలు పడని ఎన్ని చట్టాలు ప్రయోగించినా ప్రయోజనం లేదు....

రెండు రాష్ట్రాల మధ్య ఉప్పొంగి పారుతున్న పెన్ గంగా

ఆదిలాబాద్ :జులై 23

ఐదు రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. వరద నీరు భారీగా వచ్చిన చేరుతుండటంతో నదుల ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.

జైనథ్‌ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది.

ఫలితంగా తెలంగాణ-- మహారాష్ట్ర సరిహద్దులోని 44 వ నంబరు జాతీయ రహ దారిపై వాహనాల రాక పోకలు నిలిపివేశారు.

వరద ఉద్ధృతి కారణంగా తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాక పోకలు బంద్ అయ్యాయి.

వరద ప్రవాహం తగ్గిన తర్వాత రాక పోకలు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. ప్రవాహ ఉద్ధృతిని అధి కారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి డొలారా వంతెన వద్ద పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే వాహ నాలను జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు...

TS High Court: నేడు తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

నేడు తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది.

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

Bhadrachalam | భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి..

రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది..

భద్రాచలం: రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.

ఉదయం 6 గంటలకు వరద (Floods) ప్రవాహం 43.3 అడుగులకు చేరింది. దీంతో గోదావరి పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇక ఎగువన వర్షాలతో గోదావరి ఉపనది అయిన పెన్‌గంగ (Penganaga) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వరద ఉధృతి పెరగడంతో ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా జైనాథ్‌ మడలం డొలారా వద్ద నది ఉగ్రరూపం దాల్చింది.

50 అడుగుల ఎత్తు ప్రవహిస్తుండటంతో నీరు వంతెన పైనుంచి వెళ్తున్నాయి. దీంతో 44వ నంబర్‌ జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర-తెలంగాణ (Maharashtra-Telangana) మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనాలను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు..

మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఆరో నిందితుడి అరెస్ట్

•ఉద్రిక్తతలు చెలరేగకుండా రాష్ట్రవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసుల ప్రయత్నం

ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ముఖ్యమంత్రి

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి మణిపూర్ పోలీసులు ఆరో నిందితుడిని అరెస్ట్ చేశారు. 'శనివారం మరో నిందితుడు అరెస్టయ్యాడు. ఐదుగురు ప్రధాన నిందితులు, ఒక జువెనైల్‌తో సహా మొత్తం ఆరుగురు అరెస్టయ్యారు' అని మణిపూర్ పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు.

మరోవైపు, ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా మణిపూర్ పోలీసులు, కేంద్రబలగాలతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహించి మిగతా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మే 4న ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన గుంపుకు చెందిన అరెస్టైన నలుగురు నిందితులను 11 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చారు.

ప్రతిపక్షం పార్లమెంటు ఉభయ సభలలో ఈ అంశాన్ని లేవనెత్తింది. మణిపూర్ ఉదంతంపై ఉభయసభలు వరుసగా రెండో రోజు వాయిదా వేయవలసి వచ్చింది.

పెద్ద ఎత్తున తరలి వెళ్లిన మహిళలు ఈ కేసులో ప్రధాన నిందితుడి ఇంటిని తగులబెట్టినట్లు శుక్రవారం స్థానిక మీడియా పేర్కొంది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడం, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన నిందితులను చట్టపరంగా శిక్షించడం తమ ముందు ఉన్న కర్తవ్యమని ప్రభుత్వం చెబుతోంది.

దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని మణిపూర్ సీఎం అన్నారు. వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, మన సమాజంలో మహిళలందరినీ తల్లులు, సోదరీమణులుగా చూస్తామని, అలాంటి భూమిలో ఈ ఘటన దారుణమని, అందుకే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు: హైకోర్టు

పెళ్లి పేరిట తనను మోసం చేశాడంటూ ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు

కేసు కొట్టేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు

పరస్పర అంగీకారంతో దగ్గరై ఆ తరువాత పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం కాదని వ్యాఖ్య

భాగస్వాములతో భేదాభిప్రాయలు వచ్చినప్పుడు ఈ చట్టాన్ని ఆయుధంగా వాడుతున్నారని కామెంట్

అత్యాచార నిరోధక చట్టాన్ని మహిళలు దుర్వినియోగ పరుస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వాములతో భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై అతడి మాజీ ప్రేయసి దాఖలు చేసిన అత్యాచారం కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి శరద్ కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు వేశారు. 2005 నుంచి వారు రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి జాబ్ వచ్చినా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు.

ఆ తరువాత అతడు మరో మహిళను వివాహం చేసుకోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. అయితే, అతడికి పెళ్లయ్యాక కూడా వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో జూన్ 30న ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, మహిళ దాఖలు చేసిన అత్యాచార కేసును కోర్టు కొట్టేసింది.

‘‘అతడికి పెళ్లయిన తరువాత కూడా పిటిషనర్ తమ బంధాన్ని కొనసాగించారు. అంటే..ఆమె అతడితో బంధానికి అంగీకరించినట్టే’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అతడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది తమ బంధం తొలినాళ్లలోనే నిగ్గుతేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరయ్యాక పెళ్లికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి:జులై 23

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిట లాడు తోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 31 కంపార్టు మెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

స్వామి వారి సర్వ దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 84,430 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.45 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 38,662 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు......