/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Pawan Kalyan: ఆర్భాటాలు కాదు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించండి: పవన్‌ కల్యాణ్.. Yadagiri Goud
Pawan Kalyan: ఆర్భాటాలు కాదు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించండి: పవన్‌ కల్యాణ్..

అమరావతి: బైజూస్‌ను చూపించి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బైజూస్‌ ద్వారా ఏదో సాధించామని ప్రభుత్వం చెబుతోందన్నారు..

ఆర్భాటాలు కాదు.. ముందు పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలని పవన్‌ సూచించారు. ''మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఊసే లేదు. ఉపాధ్యాయుల భర్తీ చేపట్టలేదు.

వారికి శిక్షణ ఇవ్వడం లేదు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కు మాత్రం రూ.కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. టెండర్‌ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి?

టెండర్ల ప్రక్రియలో ప్రమాణాలను ప్రభుత్వం పాటించిందా? ఆ కంపెనీలను ఎవరు పరిశీలించారు?వాటికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచారా? టెండరు, కంపెనీ ఎంపిక అంశాలపై ప్రభుత్వం స్పందించాలి'' అని పవన్ కల్యాణ్‌ డిమాండ్ చేశారు..

Viveka Murder Case: అందుకే లేఖ దాచిపెట్టమని చెప్పా: సీబీఐకి సునీత భర్త వాంగ్మూలం

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి..

ఇప్పటికే పలువురు కీలక సాక్షులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు రాగా.. తాజాగా సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వివరాలు వెల్లడయ్యాయి.

వైఎస్‌ రాజారెడ్డి హత్య తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని వివేకా హత్య స్థలిలో లభించిన లేఖను తాను వచ్చే వరకు దాచిపెట్టమని చెప్పానని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఉదయం 6.30గంటలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి ఘటనా స్థలిలో లేఖ ఉందని చెప్పారని రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. లేఖలో ఏముందని అడగ్గా.. డ్రైవర్‌ ప్రసాద్‌ బాధ్యుడిగా ఉందని కృష్ణారెడ్డి చెప్పారన్నారు. రాజారెడ్డి హత్య సమయంలో జరిగిన పరిణామాలతో పాటు ప్రసాద్‌కు ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని.. తాను వచ్చి వ్యక్తిగతంగా పోలీసులకు ఇస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు..

వివేకా పేరిట ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? అని సీబీఐ అడగ్గా.. కొన్ని తెలుసని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. హత్యకు ముందు రోజు రాత్రి కడప ఎంపీగా తాను పోటీ చేయనున్నట్టు జమ్మలమడుగులో వివేకా చెప్పినట్టు తెలిసిందని రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా అవినాష్‌కు మద్దతివ్వాలని ప్రభావతమ్మను వివేకా కోరినట్టు తెలిసిందన్నారు.

హత్యకు ముందు రోజు మార్చి 13న శివశంకర్‌రెడ్డి గూగుల్‌ టేకవుట్‌ లొకేషన్‌ను సీబీఐ చూపించగా.. అది వివేకా ఇంటిదేనని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి గుర్తించారు. సాధారణంగా శివశంకర్‌రెడ్డి తమ ఇంట్లోకి ఎప్పుడూ రాడని చెప్పారు. ఆరోజున ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి పులివెందులకు ఎప్పుడొస్తున్నారని ఆరా తీశారని, తాము కడపలో ఉన్నామని చెప్పినట్టు నర్రెడ్డి వివరించారు. రాజశేఖర్‌రెడ్డిని సాక్షిగా పేర్కొంటూ ఆయన వాంగ్మూలాన్ని గత నెల 30న అనుబంధ ఛార్జిషీట్‌తో పాటు కోర్టుకు సీబీఐ సమర్పించింది..

NIA: భారీ కుట్రకు ప్రణాళిక.. అందుకే ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్‌ అరెస్టు: ఎన్‌ఐఏ

ఒంగోలు: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

శిరీషను అరెస్టు చేసినట్టు ఎన్‌ఏఏ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేశామని తెలిపింది.

దుడ్డు ప్రభాకర్‌, శిరీష మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని పేర్కొంది. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకున్నట్టు గుర్తించామని ఎన్‌ఐఏ తెలిపింది.

2019లో జరిగిన తిరియా ఎన్‌కౌంటర్లో వీరిద్దరూ పాల్గొన్నారని, మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని ఎన్‌ఏఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

''జులై 28న సమావేశం ఏర్పాటు చేసుకొని భారీ కుట్ర పన్నేందుకు మావోయిస్టు కేడర్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. వీరు రాసిన లేఖలు, సాహిత్య పుస్తకాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం'' అని ఎన్‌ఐఏ వివరించింది..

ఈ నెల 24 న హిమాన్షు కొత్త సాంగ్

బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త‌నయుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షు మ‌రో కొత్త సాంగ్‌తో అల‌రించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని హిమాన్షు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నా కొత్త పాటను జులై 24వ తేదీన విడుద‌ల చేస్తున్నాను.

ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం నాకు చాలా సంతోషంగా ఉంద‌ని హిమాన్షు పేర్కొన్నారు. ఈ సాంగ్‌ను చూసి మీరంద‌రూ ఆనందిస్తార‌ని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. హిమాన్షు సాంగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్‌ లాసన్ పాడిన గోల్డెన్‌ అవర్‌’ సాంగ్‌ను క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షు రావు గ‌తంలో అద్భుతంగా ఆల‌పించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఇంగ్లీష్‌ సాంగ్‌ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘం అని నెటిజ‌న్లు కొనియాడిన సంగ‌తి తెలిసిందే. అచ్చం జాకబ్‌ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్‌ సాంగ్‌ పాడాడ‌ని ప్ర‌శంసించారు. 24న విడుద‌ల కాబోయే సాంగ్ కూడా ఆ మాదిరిగానే ప్ర‌శంస‌లు అందుకోవాల‌ని నెటిజ‌న్లు ఆశిస్తున్నారు.........

'జగనన్న సురక్ష'లో అధికారుల నిర్బంధం.. అప్పటివరకూ వదిలేదిలేదంటున్న గ్రామస్థులు

కొత్తపల్లి: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన అధికారులను స్థానికులు నిర్బంధించారు. తమ సమస్యలను పరిష్కరించిన తరువాతే సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు..

మూడేళ్ల కిందట గ్రామంలో అర్హులైన 600 మంది లబ్ధిదారులకు.. ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించారు. ఆ భూముల్లో స్థలాల విభజన చేయకుండా, సౌకర్యాలు కల్పించకుండా.. లబ్ధిదారులకు స్థల వివరాలు లేని ఖాళీ పట్టాలు అందజేశారు..

అప్పటినుంచి లబ్ధిదారులు తమ స్థలాలు ఎక్కడ అని పలుమార్లు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.

దీంతో స్థలాల్లో ఇంటి నిర్మాణం గురించి తేల్చే వరకు ఎవరూ బయటకు వెళ్లేది లేదంటూ స్థానికులు అధికారులను నిర్బంధించారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొరబాబుకు అత్యధిక మెజారిటీ ఇచ్చినా తమ గ్రామంపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపితే గానీ, వదిలేది లేదని హెచ్చరించారు..

ప్రేమించడం లేదని యువతి పై బీర్ బాటిల్‌ తో దాడి

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కురిచేడు మండలం అలవలపాడులో యువకుడు వీరనారాయణాచారి ఉన్మాదిగా మారాడు. ప్రేమించలేదన్న కోపంతో యువతిపై బీర్ బాటిల్‌తో శుక్రవారం రాత్రి దాడి చేశాడు.

యువతికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.

అయితే అలవలపాడుకు చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన వీరనారాయణాచారి ప్రేమించమని చాలా రోజులుగా వెంటపడుతున్నాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు.

దీంతో కోపం పెంచుకున్న యువకుడు మద్యం సేవించి ఆ మత్తులో బీర్ బాటిల్‌లో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి దాడులకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని చెప్పారు. ఎవరైనా యువకులు వేధిస్తున్నట్లైతే యువతులు తమను సంప్రదించాలన్నారు. వెంటనే యాక్షన్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వారి ప్రవర్తన పట్ల దృష్టి సారించాలని పోలీసులు సూచించారు....

మణిపూర్‌ లో ఏం జరగనట్టు వ్యవహరిస్తున్న ప్రధాని

80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. శనివారం ఆమె గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..

మణిపూర్‌లో ఏం జరగనట్టు ప్రధాని తీరు..

హైదరాబాద్: 80 రోజులుగా మణిపూర్ అట్టుడుకుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు.

శనివారం ఆమె గాంధీభవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఎం జరగనట్టు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని, బీజేపీ ఆదివాసీ తెగల మీద చిచ్చుపెట్టిందని విమర్శించారు. అ

క్కడి ముఖ్యమంత్రి ఇది ఒక్క సంఘటనే కదా.. వందల సంఘటనలు జరుగుతాయని చెప్పడంతో బీజేపీ ఏంటనేది తెలుస్తోందన్నారు. మణిపూర్ గవర్నర్ మే 3న జరిగిన సంఘటన వీడియో బయటకు రావడంపై బావోద్వేగానికి గురవుతున్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి ఈషాన్య రాష్ట్రాల మరణాహోమం కనబడడం లేదా? అని పాల్వాయి స్రవంతి ప్రశ్నించారు. బీజేపీ మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కవితక్క లిక్కర్ స్కామ్‌ పై తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారని, మణిపూర్ ఘటనపై ఈ మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. రాజస్థాన్‌లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే 24 గంటల్లో పట్టుకున్నారని.. వారు ఏబీవీపీకి సంబందించిన వారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలని పాల్వాయి స్రవంతి అన్నారు...

గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

•బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల అధ్వర్యంలో గత 17 రోజులుగా

గ్రామ పంచాయతీ కార్మికులు, కారోబార్లు మరియు బిల్లు కలెక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో శనివారం బిసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పాల్గొని సంఘీభావం తెలిపిన అనంతరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల, కారోబార్ల మరియు బిల్ కలెక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరంతరం గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, గ్రామ శ్రేయస్సుకు పాటుపడే గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వహించకుండా, సత్వరమే వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జి.ఓ. నెంబర్ 51 సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి బిల్ కలెక్టర్ కారొబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని ఆయన కోరారు. 11వ పి ఆర్.సి లో నిర్ణయించిన విధంగా బేసిక్ సాలరీ 19000 రూపాయలు చెల్లించాలని కోరారు.

అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్రమాదభీమా వర్తింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా తక్షణమే ఈఎస్ఐ పీఎఫ్ వర్తింపజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మణిపూర్ లో జరిగినటువంటి అమానవీయ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం

•యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నజీర్

ఈ రోజు నల్గొండ పట్టణంలోని పత్రిక విలేకరుల సమక్షంలో నల్గొండ యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల కూడా ఇలాంటి సంఘటన ఎక్కడ జరగ లేదు,

భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా ఇలాంటి సంఘటనలు మనం ఎక్కడ కూడా చవి చూడ లేదు, భారతదేశంలో మనం స్త్రీలని ఇలా చూడడం చాలా బాధాకరమైన విషయమని,

భరత మాత అని పిలుచుకునే మన దేశం లో స్త్రీలకు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు అని తెలియజేశారు. దేశ ప్రజల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పలు యుద్ధాలలో దేశం కోసం తన వంతు కృషి చేసిన, దేశానికి రక్షణగా ఉన్న తన భార్యని కాపాడుకోలేక పోతున్నాడని ఒక సైనికుడు మనోవేదనకు గురవుతున్నారనీ,

ఎన్ని చట్టాలు వచ్చినా ఎందుకు పూర్తి స్థాయి లో అమలు కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు, మరియు ఇలాంటి సంఘటనలు మరల దేశం లో చోటు చేసుకోవద్దంటే కటినమైన చట్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని,

ఈ సంఘటనను యునైటెడ్ ముస్లిం మైనార్టి రైట్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జావిద్ అలి, జనరల్ సెక్రెటరీ షేక్ సద్దాం హుస్సేన్, అబ్దుల్ మాజిద్, ఖరామత్ అలీ ఖాన్, జీశాన్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టుయింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడులు చేపట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.

మాదాపూర్ మెగాహిల్స్‌లోని ఓ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఓ విటుడ్ని అరెస్ట్ చేశారు. విశాఖ, రాజమండ్రి, కూకట్ పల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను నరక కూపం నుంచి రక్షించారు....

SB NEWS

SB NEWS