హైదరాబాద్లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టుయింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడులు చేపట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.
మాదాపూర్ మెగాహిల్స్‌లోని ఓ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఓ విటుడ్ని అరెస్ట్ చేశారు. విశాఖ, రాజమండ్రి, కూకట్ పల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను నరక కూపం నుంచి రక్షించారు....
SB NEWS
SB NEWS
Jul 22 2023, 14:38