దేశం నుదిటిన మణిపూర్ నెత్తుటి తిలకం?
మణిపూర్‌లోని కాంగ్‌కోక్వీ జిల్లా బిఫైనోమ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు బహిర్గతమైన తర్వాత కూడా కేంద్రం దీన్ని ఓ సాదా సీదా చర్యగానే పేర్కొంది. పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు ప్రధా ని పేర్కొనడం మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ అనుసూయ ఉ యికే దీనిపై తీవ్రంగానే విరు చుకుపడ్డారు. నిందితుల్ని వెంటనే అదు పులోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
వాస్తవానికి గతరెండు మాసాల్లో మణిపూర్ జాతుల ఘర్ష ణతో అట్టుడుకి పోతోంది. మెజార్టీ వర్గమైన మైతీని గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ఈ ఏడాది మే 3న ఒక్కసారిగా జాతుల మధ్య ఘర్షణ తలెత్తింది. హిందువులైన మెజార్టీ మైతీయిలకు గిరిజనులైన మైనార్టీ కుకి, నాగ, మరికొన్ని జాతులకు మధ్య బీకర ఘర్షణలు చెలరేగాయి. గిరిజనులకు చెందిన చర్చిల్ని మైతీయిలు కూల్చేశారు. వారి గ్రామాల్ని దగ్ధం చేశారు. కొందరు మైతీయులైతే భద్రతా బలగాల వద్దనున్న ఆయు ధాల్ని దొంగిలించి మారణహోమానికి పాల్పడ్డారు.
హైకోర్టు సూచించిన ఒక రోజు తర్వాత బిఫైనోమ్ గ్రామంపై మైతేయిలు దాడి చేశారు.
గ్రామంలోని ఇళ్ళన్నింటిని తగుల బెట్టారు. భయంతో పారిపోతున్న కుకీల్ని పట్టుకుని కొట్టి చంపేశారు. ఈ మారణకాండకు భయపడ్డ ఓ కుటుంబం అడవిలోకి పారిపో వడంతో పోలీసులు వారిని రక్షించి స్టేషన్‌కు తీసుకెళ్తుం డగా తిరిగి మైతీలు దాడి చేశారు. 20, 40, 50ఏళ్ళున్న ముగ్గురు మహి ళల్ని తమ వెంట తీసుకెళ్ళారు. వీరిలో ఇద్దర్ని నగ్నంగా మార్చారు. హైవేపై ఊరే గించారు. అనంతరం 20ఏళ్ళ యువ తిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఎదురుగానే ఆమె తండ్రితో పాటు సోదరుడ్ని చంపేశారు.
ఈ సంఘటనల్ని కేవలం జాతుల మధ్య ఘర్షణగానే చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కేంద్రం కూ డా దీనికి వంత పాడింది. పైగా దాడుల వెనుక విదేశీ హస్త ముందంటూ నమ్మించే ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్, చైనా ల నుంచొచ్చిన ఉగ్రవాదులే మైతీల ముసుగులో ఈ దారు ణాలకు ఒడిగట్టినట్లు ఇంత కాలం ప్రపంచాన్ని నమ్మించింది. గత రెండు మాసాలుగా జరుగుతున్న దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం 140మంది చనిపోయారు. 50వేల మంది ఇళ్ళు కోల్పోయారు. వందలకొద్దీ చర్చిలు నేలమట్ట మయ్యాయి.
వేల సంఖ్యలో ఇళ్ళు దగ్ధమై పోయాయి. అయినా ఈ చిన్ని రాష్ట్రంలోని వివాదాలపై కేంద్రం చిన్న చూపే చూసింది. కనీసం అదనపు బలగాల్ని మోహరించి జాతుల మధ్య ఘర్షణల్ని అణిచేసే ప్రయత్నం చేయలేదు. ఇది పరోక్షంగా ఇక్కడ మెజార్టీ మైతీ వర్గాల మద్దతు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రాకులాడుతున్నాయన్న అంశాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలే బీజేపీయేతర పార్టీల పాలనలో గల రాష్ట్రా ల్లో జరిగుంటే ఎప్పుడో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసుండేది. గవర్నర్ పాలన విధించుండేది. సైన్యాన్ని బరిలో దింపుండేది. ఘర్షణల్ని కఠినంగా అణిచేసుండేది. కానీ బీజేపీకి మణిపూర్‌లో మైతీ తెగల ఓట్లు అవసరం. ఈ కారణంగానే కేంద్రం ఈ విషయంలో మీన మేషాలు లెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు మద్దతుగా నిల్చిందన్న విమర్శల్ని ఎదుర్కొంటోంది.....
Jul 22 2023, 13:34