/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మ‌ణిపూర్ ఘటనపై ద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంట్ Yadagiri Goud
మ‌ణిపూర్ ఘటనపై ద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంట్

న్యూఢిల్లీ :జులై 21

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది.

ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో లోక్ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. తిరిగి లోక్ సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతిచకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉంటే.. తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను బర్తరఫ్ చేసి ఉండేవారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

పార్లమెంట్ వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా మణిపూర్ సీఎంను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు....

పార్టీలో పని చేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

జగిత్యాల జిల్లా :జులై 21

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలే పార్టీకి కీలకంగా పనిచేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన దాదాపు 60 మంది కాంగ్రెస్ బీజేపీ పార్టీ లకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మంత్రి మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన వారు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలలో చర్చ జరుపాలని సూచించారు...

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సెకండ్ PRC..?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది.

ఇందులో భాగంగా ఉద్యోగుల నుంచి ఇటీవల వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. త్వరలోనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కావాలనుకుంటున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ పీఆర్సీని 2018 జూలైలో ఏర్పాటు చేశారు. అది ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుని 30% ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఆ కమిషన్ గడువు ఈ ఏడాది జూన్ చివరితో ముగిసింది.

దీంతో కొత్త పీఆర్సీ జూలై 1వ తేదీ నుంచి కొత్తగా అమల్లోకి రావాల్సి ఉన్నది.

గడువు సమీపిస్తున్నా కొత్త పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం నెలకొన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నది.

షెడ్యూలు ప్రకారం జూలై నుంచే కొత్త పీఆర్సీ రావాల్సి ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్‌ మైలేజ్ పొందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల చివరిలోగానే ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడి అవసరాన్ని బట్టి ఆ తర్వాత ఐఆర్ ఇంటెరిమ్ రిలీఫ్ పైనా ప్రకటన చేసే అవకాశం ఉంది....

Kavitha: అర్వింద్‌.. 24 గంటల సమయం ఇస్తున్నా: ఎమ్మెల్సీ కవిత సవాల్

హైదరాబాద్‌: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Arvind)కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సవాల్‌ విసిరారు..

నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు..

''ఎంపీగా ఉన్నప్పుడు 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే స్పైస్‌ బోర్డు తెచ్చినా.. అర్వింద్‌ తెచ్చానని చెబుతున్నారు.

ఇప్పుడు నా భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నేను, నాన్న, అన్న, రాజకీయాల్లో ఉన్నాం అని సహించాం. నా భర్త పేరు వాడటం సరైన పద్ధతి కాదు'' అని కవిత అన్నారు..

SB NEWS

వరద బాధితులకు అందుబాటులో ఉండండి.. నేతలకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డిపిలుపు

వరదల సమయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వరద బాధితులకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ టీపీసీసీ అధ్యక్షులు శుక్రవారం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని అన్నారు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయని ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు.

ఇళ్లలోకి నీరు చేరి, వరదలతో ముంపునకు గురై ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు.

వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వెంటవెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు...

నిజామాబాద్ జిల్లాలో ఐ టి హబ్ ను ఏర్పాటు చేయడం విశేషం.. : ఎమ్మెల్సీ కవిత

గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ టాస్క్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఈ జాబ్‌ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎమ్మెల్సీ గణేశ్‌ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌ జిల్లాలో ఐటీ హబ్‌ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు. విదేశీ కంపెనీలు రావడానికి సహకరించిన మహేశ్‌ బిగాలకు ధన్యవాదాలు తెలిపారు.

ఐటీ హబ్‌ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. యువత తమ నైపుణ్యాలతో ఐటీ హబ్‌ స్పేస్‌ను వాడుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

నిజామాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి ఐటీ హబ్‌ కేంద్ర బిందువు అవుతుందని తెలిపారు. ఇది మొదటి దశ మాత్రమే అని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్‌ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్‌ పార్క్, ఆటో పార్క్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిజామాబాద్‌ ఐటీ హబ్‌ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.......

ఉగ్రరూపం.. దాల్చిన భద్రాద్రి గోదారి భయాందోళనలో ప్రజలు

భద్రాచలం:జులై 21

భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉపనదులు పొంగి వరద నీరు భారీగా వచ్చి గోదావరిలో చేరుతుంది.

దీంతో గురువారం ఉదయం 6 గంటలకు 38.50 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం 3.19 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. రాత్రి 8 గంటలకు 44.10 అడుగులకు పెరిగిన గోదావరి శుక్రవారం నాటికి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరుకుంది. రామాలయం అన్నదాన సత్రంతో పాటు విస్తా కాంప్లెక్స్, రామాలయం పడమర మెట్లు వద్దకు బారీగా వరద నీరు వచ్చి చేరింది.

క్రమంగా పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం భద్రాచలంలోని వరద ముంపు ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరి ఉధృతి పెరిగినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

అత్యవసర సేవలకు కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని చెప్పారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గోదావరి వరద ఉధృతి పరిశీలించి ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భద్రాద్రి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.....

Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంను ఆశ్రయించారు రాహుల్ గాంధీ..

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు..

SB NEWS

SB NEWS

SB NEWS

భద్రాచలం చేరుకున్న పువ్వాడ

భద్రాచలం:జులై 21

వరదల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐటీసీ గెస్ట్ హౌస్ లో మంత్రి పువ్వాడను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ పోప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ వినీత్, ఏఎస్పీ అరితోష్ పంకజ్ తదితరులున్నారు.

మరికాసేపట్లో గోదావరి కరకట్టపై వరద ఉధృతిని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేగ కాంతారావుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

కాగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఆదేశాలు ఇచ్చారు.

దీంతో ఇవాళ 11గంటల నుండి వరద ఉదృతి తగ్గే వరకు భద్రాచలంలోనే ఉండి మంత్రి పువ్వాడ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు...

సరూర్‌నగర్‌ చెరువు గేట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం

సరూర్‌నగర్ చెరువులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. సరూర్ నగర్ చెరువులో గేట్లు ఎత్తివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అంతకు ముందే గేట్ల వద్ద ఉన్న చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు. గేట్లు ఎత్తివేసిన తరువాత పైపులలో వరద నీరు వెళ్ళేటప్పుడు చెత్త అడ్డంకిగా లేకుండా సిబ్బంది తొలగిస్తోంది.

ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ డీఈ పవన్ కుమార్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతం నుంచి సరూర్‌నగర్ చెరువులో నీరు ఎక్కువగా వచ్చి చేరుతోందన్నారు.

గేట్లు ఎత్తివేతవేయడానికి ముందు చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. మొత్తం ఏడు గేట్లలో నాలుగు గేట్లను తెరువనున్నట్లు చెప్పారు. జిల్లాలగూడ, మీర్‌ పేట్, భైరామల్‌గూడ చెరువులతో పాటు పలు కాలనీలో నుంచి నీరు చెరువులోకి వచ్చి చేరుతున్నాయన్నారు.

దీంతో ముందు జాగ్రత్తగా మూడు గేట్లను ఎత్తామన్నారు. ఇక్కడి నుంచి మూసిలోకి నీరు వెళ్తుందని చెప్పారు.

రాత్రి చెరువుపై భాగంలో ఉన్న కాలనీలలో నీరు భారీగా వచ్చిచేరిందని పవన్ కుమార్ తెలిపారు...