/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz TPCC: తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ.. 29 మంది కీలక నేతలకు చోటు.. Yadagiri Goud
TPCC: తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ.. 29 మంది కీలక నేతలకు చోటు..

హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయే శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది..

రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్న 2023 రాష్ట్ర ఎన్నికల కమిటీలో 26 మంది సభ్యులు, మరో ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులను అధిష్ఠానం నియమించింది. మొత్తం 29మంది కీలక నేతలకు ఈ కమిటీలో చోటు లభించింది..

వీరిలో ఎన్నికల కమిటీ సభ్యులుగా రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, బొమ్మ ముఖేష్‌గౌడ్‌, గీతారెడ్డి,

అజహరుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, చల్లా వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రేణుకా చౌదరి, బాలరాం నాయక్, మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రేంసాగర్ రావు, సునితా రావు ముదిరాజ్ సభ్యులుగా ఉన్నారు.

పీసీసీ ఎన్నికల కమిటీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు..

చంద్రయాన్-3.. నాలుగో కక్ష్య పెంపు విజయవంతం..

చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన 'చంద్రయాన్-3' వ్యోమనౌక.. లక్ష్యం దిశగా సాగిపోతోంది. ఇప్పటివరకు మూడో కక్ష్యలో భూమిచుట్టూ చక్కర్లు కొట్టిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన నాలుగో కక్ష్య పెంపును అంతరిక్ష పరిశోధన సంస్థ గురువారం విజయవంతంగా నిర్వహించింది..

బెంగళూరులోని 'ఇస్ట్రాక్' కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. చంద్రయాన్-3కి సంబంధించిన అయిదో, చివరి కక్ష్యను పెంచేందుకు జులై 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చేపడతామని ప్రకటించింది.

నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. ఈ సందర్భంగా చంద్రయాన్-3ని జాబిల్లికి మరింత చేరువ చేస్తూ..

భారత్ ఈ వేడుక చేసుకుంటోంది' అని ట్విటర్ వేదికగా ఇస్రో పేర్కొంది.

జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు.

ఇప్పటివరకు దశలవారీగా నాలుగుసార్లు పెంచి.. చంద్రయాన్-3 జాబిల్లికి చేరువచేస్తున్నారు. అయిదో కక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది..

Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యలు.. పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదుకు ఆదేశం..

అమరావతి: వారాహి యాత్రలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

జులై 9న ఏలూరు సభలో పవన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంత మంది మాత్రమే ట్రేస్‌ అయ్యారు..

మిగతా వారు ఏమయ్యారో తెలియదని వ్యాఖ్యానించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై సీసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌పై పరువు నష్టం కేసులు పెట్టాలని

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందజేశారు..

జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఓటరు సర్వే

● రేపటి నుంచి ఇంటింటికీ రానున్న బీఎల్‌వోలు

● 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూడడం.

● 2024 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండనున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించాలి.

సర్వేలో పరిశీలించే అంశాలు

● ఓటరు జాబితాలో డబుల్‌ ఎంట్రీలు..నకిలీ ఓట్ల గుర్తింపు

● చనిపోయిన వారి ఓట్ల తొలగింపు

● వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తించడం

● డోర్‌నంబర్లు లేకుండా ఉన్న, ఒకే డోర్‌ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలన

● సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల వివరాలను సరిచేయడం.

● దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కుని అక్కడ జాబితాలో ఉంచడం.

● ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్‌కు సిఫార్సు చేయడం.

● పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు, చేర్పులు తప్పుఒప్పులు సరిచేయడం.

● ఓటర్ల అభ్యర్థన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం.

సమగ్ర ఓటరు సర్వే షెడ్యూల్‌

● ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటికీ బూత్‌ లెవల్‌ అధికారుల సర్వే

● గుర్తింపు కార్డులు, జాబితాల్లోని తప్పుల సవరణ

● స్పష్టత లేని ఫొటోలు తొలగించి, మంచి ఫోటోల ఏర్పాటు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారికి పంపించడం.

● కొత్తగా ఓటు హక్కు పొందని వారుంటే వారు ఓటు హక్కు పొందవచ్చు.

● నియోజకవర్గం మారినా, ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా, తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఉంది.

మేడం ఆలస్యంగా లేచారా ❓️రఘునందన్ రావు సెటైర్లు

గ్రేటర్‌లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అయితే పాఠశాలలు ప్రారంభమయ్యాక ఆలస్యంగా సెలవులు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సెటైరికల్ కామెంట్లు చేశారు.

ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎమ్మెల్యే.. ‘‘పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్రలేచి విద్యాలయాలకు సెలవులు అంటూ ప్రకటించిన మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు.

మరోవైపు విద్యాశాఖ మంత్రి సెలవు ప్రకటించక ముందే ఉదయం పాఠశాలలు ప్రారంభమైపోయాయి. అనేక మంది విద్యార్థులు పాఠశాలలకు కూడా వెళ్లిపోయారు. సెలవులపై మంత్రి ఆలస్యంగా ప్రకటన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్న పరిస్థితి. మేడం ఆలస్యంగా లేచారా అంటూ మండి పడుతున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ తల్లిదండ్రులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు......

మరో 48గంటలు వర్షాలు.. సహాయక బృందాలు సిద్ధం.. : సీఎస్‌ శాంతికుమారి

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 48గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అన్నిశాఖ అధికారులతో పాటు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

వరంగల్‌, ములుగు, కొత్తగూడెంలో ఎన్‌డీఆర్‌ఎప్‌ బృందాలు సిద్ధంగా ఉంచమన్నారు. హైదరాబాద్‌లోనూ 40 మంది సిబ్బందితో బృందం సిద్ధంగా ఉందన్నారు.

గేట్రర్‌ 426 హైదరాబాద్‌లో మాన్‌ సూర్‌ ఎమర్జెన్సీ బృందాలు సిద్ధంగా ఉన్నాయని.. అలాగే 157 స్టాటిక్‌ టీమ్‌లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

నీటి నిల్వ ఉండే 339 ప్రాంతాల వద్ద ప్రత్యేక సిబ్బందిని మోహరించామని, ఇప్పటి వరకు చెరువులు, కుంటలకు ఎలాంటి జరుగలేదని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అన్ని మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేపట్టాలన్నారు....

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : జులై 20

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఎటువంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి.

ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాయి. అనంతరం మణిపూర్‌పై చర్చ జరపాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

సభ ప్రారంభమైన అనంతరం సభ్యులు మళ్లీ ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.

మణిపూర్‌ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు..

మైనార్టీలకు త్వరలో లక్ష రూపాయల స్కీమ్.. : మంత్రి హరీష్ రావు

మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉందని, త్వరలో స్కీమ్ అమలవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.

గురువారం జల విహార్‌లో మైనార్టీ నేతల సమావేశం నిర్వహించారు. పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రి మహమూద్ అలీతో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మైనార్టీలను సీఎం ఎంతో గౌరవిస్తారని రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారని తెలిపారు.

హిందువులకు కల్యాణ లక్ష్మి తెచ్చినట్టు మైనార్టీల కోసం షాదీ ముబారక్ తెచ్చారని, సీఎం మైనార్టీలకు త్వరలోనే శుభవార్త చెప్పనున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని మండిపడ్డారు.

దేశంలో ఇప్పటికీ ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారని ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.2200 కోట్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు...

పోలీస్ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలి..క‌మిష‌న‌ర్ శ్వేత పిలుపు

సిద్దిపేట జిల్లా :జులై 20

జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు.

పోలీస్ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండేలా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వాగుల, చెరులు, నిండుకుండలా నిండి ప్రవహిస్తున్నాయి మరియు ప్రాజెక్టుల దగ్గరికి ఎవరు వెళ్ళవదనీ ప్రజలకు సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను గురువారం సమావేశపరిచి సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆమె కోరారు..

జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, రోడ్స్ టాపర్స్ , తాడు మరే ఇతర పరికరాలు అడ్డంపెట్టి సంబంధిత గ్రామల సర్పంచులకు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల సర్పంచులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు సిబ్బంది హెడ్క్వార్టర్ వదిలి వెళ్లవద్దని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు...

కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్ట్

బాట సింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ఎయిర్‌ పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు.

బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించేందుకు కేంద్రమంత్రి అక్కడకు పయనమయ్యారు. అయితే కేంద్రమంత్రి అయిన కిషన్‌రెడ్డిని అడ్డుకుంటారా?లేదా? అన్న అనుమానాలను పటా పంచలు చేస్తూ.. ఎయిర్‌ పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కేంద్రమంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు.

దీంతో పోలీసులతో కిషన్ రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి.. కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమంటున్నారు. చివరకు బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది...