/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. Yadagiri Goud
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం..

న్యూఢిల్లీ..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభంకాబోతున్నాయి. ఆగస్ట్ 11 వరకు మొత్తం 17 పని దినాల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి..

ఈ సమావేశాల్లో మొత్తం 31 బిల్లులను ప్రవేశపెడుతున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

మరోవైపు ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగబోతున్నాయి. మణిపూర్ లో చెలరేగిన హింసపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయబోతున్నాయి.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, ఢిల్లీ ఆర్డినెన్స్, ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) వంటి కీలక బిల్లులు చర్చకు రానున్నాయి.

తొలి రోజు నుంచే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. పార్టమెంట్ సెషన్స్ కు ముందు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో బీఏసీ సమావేశం జరగనుంది..

మబ్బే మసకేసిందిలే

ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో రెండు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది.ముఖ్యంగా హైదరాబాద్ మహానగరమైతె రెండు రోజులుగా ముసురు కమ్మేసింది. కాగా గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.

దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దీనికి తోడు తీవ్ర చలిగాలుల వీస్తుండటంతో నగర వాసులు బయటకు రావడానికే జంకుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, కామారెడ్డి, పెద్దపల్లి భూపాలపల్లి లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజలను కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు....

11 పార్టీలే మిగిలాయ్‌.. ఏ గ్రూపులోనూ చేరని ఎంపీలు 91 మంది..

•వైకాపా, తెదేపా, భారాస, బిజూ జనతాదళ్‌ తటస్థంఎన్డీయే, ఇండియాల్లో 65 పార్టీలు

దిల్లీ: దేశంలో రాజకీయ పునరేకీరణలో భాగంగా ఎన్డీయే, ఇండియా కూటముల్లో పార్టీలు భారీగా చేరాయి..

ఈ రెండు కూటముల్లో ప్రస్తుతం 65 పార్టీలున్నాయి. అయితే 91 మంది ఎంపీలున్న 11 పార్టీలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాయి. ఇందులో ఏపీలోని వైకాపా, తెదేపా, తెలంగాణలోని భారాస, ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ ప్రధానమైనవి. ఈ 3 రాష్ట్రాల్లో 63 ఎంపీ సీట్లున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలున్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది..

ఏ కూటమిలోనూ లేని పార్టీలు

వైకాపా, భారాస, బిజూ జనతాదళ్‌, బీఎస్పీ, మజ్లిస్‌, తెదేపా, శిరోమణి ఆకాలీదళ్‌, ఏఐయూడీఎఫ్‌, జనతాదళ్‌ (ఎస్‌), ఆర్‌ఎల్‌పీ, శిరోమణి అకాలీదళ్‌ (మాన్‌).

వైకాపా, బిజూ జనతాదళ్‌ తరచూ పార్లమెంటులో భాజపాకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి.

తెలంగాణలోని భారాస ఈ ఏడాది మొదట్లో భాజపాకు వ్యతిరేక కూటమి కట్టాలని ప్రయత్నించింది. కానీ ప్రస్తుతం రెండు కూటములకూ దూరంగానే ఉంది.

రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆరోపిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యతిరేక గళమెత్తాలని తమ ఎంపీలకు ఆయన సూచించారు.తమను అంటరాని పార్టీగా చూస్తున్నారని ఆరోపిస్తూ మజ్లిస్‌ అధినేత ఒవైసీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. ఈ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటకల్లో ప్రభావం చూసే అవకాశముంది..

కేటీఆర్‌ పుట్టిన రోజున ట్రై క్రీడా పోటీలు

రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా క్రీడాప్రాధి కారిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రై రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీల్లో నాలుగు బహుమతులు, శాలువ, జ్ఞాపికలతో సత్కరించడంతో పాటుగా ప్రశంస సర్టీఫికెట్లు బహుకరించనున్నారు. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ పోటీల్లో సుమారు 5 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు సమాచారం.

ఇటీవల క్రీడా ప్రాధికారిక సంస్థ నిర్వహించిన సీఎం కప్‌ పోటీలతో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు క్రీడాకారుల్లో ఉత్సాహం రావడంతో కేటీఆర్‌ పుట్టిన రోజు క్రీడల పండుగగా ట్రై పోటీలు నిర్హపించేందుకు శాట్స్‌ సిద్ధమైంది.

ఈ పోటీల్లో సైక్లింగ్‌ కు ట్యాంక్‌ బండ్‌, నక్లస్‌ రోడ్డు వేదికకాగా, మహిళల మల్లయుద్ధానికి కోట్ల విజయ భాస్కర్‌ స్టేడియం, స్కేటింగ్‌ కు ఇందిరా పార్కు స్కేటింగ్‌ ట్రాక్‌ వేదిక కానుంది.

ఈ నెల 24న ఉదయం నుంచి ఈ పోటీలను నిర్వహించనున్న నేపధ్యంలో పర్యవేక్షకులకు తగిన సూచనలను క్రీడాప్రాధికారిక సంస్థ చేస్తోంది....

జనసేన బిజెపి పొత్తు ఉంటుందా❓️

•ఢిల్లీలో జనసేనాని వరుస భేటీలు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవార మిక్కడ బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఆయన నార్త్‌ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో షాను కలుసుకున్నారు.

ఇద్దరూ 25 నిమిషాలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహారంపై మంతనాలు సాగించినట్లు తెలిసింది.

మంగళవారం ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే వచ్చిన పవన్‌.. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి అన్ని శక్తులు ఏకం కావాలన్నదే తమ లక్ష్యమని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పొత్తులు, జగన్‌ ప్రభుత్వం తీరుపై అమిత్‌ షాతో ఆయన చర్చించినట్లు సమాచారం. నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్న భవిష్యత్‌ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పవన్‌ ఆ తర్వాత ఆశాభావం వ్యక్తం చేశారు.

పవన్‌ను కలిశానని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై అభిపాయ్రాలను పంచుకున్నామని షా ట్విటర్‌లో తెలిపారు. బుధవారం ఉదయం పవన్‌.. బీజేపీ ఏపీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఇంట్లో అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, జనసేనతో పొత్తులపై చర్చించినట్లు మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు...

సాయిచంద్‌ భార్య రజినీకి కీలక బాధ్యతలు.. కేటీఆర్‌, మంత్రులు హాజరు..

హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్‌ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు..

సాయిచంద్‌ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరవుతారు.

SB NEWS

SB NEWS

తిరుమలలో భక్తుల రద్దీ.. కొనసాగుతుంది

తిరుపతి :జులై 20

తిరుమలలో నేడు గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అయితే ముందే బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కాస్త త్వరగా అవుతోంది.

బుధవారం 74,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32688 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు....

INDIA: 'ఇండియా' కూటమి తొలి భేటీకి ముహూర్తం ఖరారు

దిల్లీ: కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (INDIA- ఇండియా) అనే పేరును ప్రకటించాయి..

ఈ క్రమంలో ఇండియా కూటమి తొలి సమావేశం గురువారం జరగనుందని తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఛాంబర్‌లో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశం కానున్నారు.

గురువారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు.

ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై సమన్వయంతో వ్యవహరించాలని రెండు రోజులపాటు బెంగళూరులో జరిగిన భేటీలో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో మరోసారి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. 26 పార్టీల ఇండియా కూటమికి లోక్‌సభలో 150 మంది సభ్యులు ఉండగా, ఎన్డీయేకు 330 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఈ విడత పార్లమెంటు సమావేశాలు ఆసక్తిగా కొనసాగే అవకాశముంది..

అధికారుల‌తో కెటిఆర్ స‌మీక్ష‌

ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కే. తారక రామారావు పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు నానక్రామ్ గూడా లోని హెచ్ జిసిఎల్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జిహెచ్ఎంసి, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రానున్న రెండు మూడు రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.

ఇప్పటికే జిహెచ్ఎంసి వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్నట్లు జిహెచ్ఎంసి అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ఈ మేరకు నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు.

జిహెచ్ఎంసి చేపట్టిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా అధికారులు వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల వలన ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ నగర పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఈ సమీక్ష సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుందని అయితే దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వలన నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతున్నదని, ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తక్షణ, స్వల్పకాలిక పారిశుధ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కి వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, ఆ దిశగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు....

Purandeswari: త్వరలో పవన్‌కల్యాణ్‌తో భేటీ: పురందేశ్వరి

అమరావతి: ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలోనూ లేవని భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎద్దేవా చేశారు.

ఆర్థిక వ్యవహారాల్లో ఏపీని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

త్వరలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)తో భేటీ అవుతానని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.

క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలో తాను జోన్ల వారీగా పర్యటించి నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు..

''ఏపీలోని ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం రూ.7.14లక్షల కోట్ల మేర అప్పు చేసింది. అనధికార అప్పులే రూ.4లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి'' అని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు..