/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్ Yadagiri Goud
Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ప్రమాదానికి గుర్తింది. హెచ్‌ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది..

నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్‌ అయిన కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ప్రమాదానికి గురైంది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది..

రన్ వేపై నీరు నిలవడంతో.. ఆ నీటిలో అలాగే ముందుకు వెళ్లింది. అప్పటికే విమానం నోస్ గేర్ సరిగా లేకపోవడంతో విమానం ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. హాల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు..

మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై బుధవారం కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ సంస్థ ప్లాట్స్ పేరుతో డబ్బులు కట్టించుకుని ఎగ్గొట్టింది. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకటనలు చూసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

సాయి సూర్య డెవలపర్‌ సంస్థ అధినేత సతీష్ చంద్ర గుప్తాపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 30 మంది బాధితులు సాయి సూర్య డెవలపర్స్‌పై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు సాయి సూర్య డెవలపర్స్‌పై సెక్షన్‌ 406, 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు...

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నది.

మరో 103 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు అనుమతి మంజూరైందని తెలిపింది.

సీసీ కెమెరాలు లేక కొన్ని పీఎస్‌లలో ప్రజల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ అందిన లేఖను

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సుమోటో పిల్‌గా స్వీకరించి మంగళవారం విచారణ జరుపగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదన వినిపించారు. సదరు పిల్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది....

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల మీద మండిపడ్డ బీఆర్‌ఎస్‌.. రెండోరోజూ నిరసనలు

వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు.

రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రేవంత్ రెడ్డి‌, కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన నిరసనల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన

ఉలిక్కి పడ్డ ఇంటర్ బోర్డు

ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గడం ఇంటర్‌ బోర్డులో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ తగ్గుదలకు కారణాలపై అధికారులు దృష్టిసారించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి అడ్మిషన్లు తగ్గడంతో వాటిని మళ్లీ ఏవిధంగా పెంచాలనే అంశంపై చర్చించారు. ఈ ఏడాది ‘ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు సగమే’ అంటూ మంగళవారం ఈ అంశంపై బోర్డు ఉన్నతాధికారులు చర్చించారు. కాలేజీలు ప్రారంభమై ఇప్పటికే 40 రోజులు గడుస్తోంది. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి బోధన ప్రారంభంకాలేదు.

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ఇంకా మొదలే కాలేదు. సబ్జెక్టులను బోధించడానికి ఉద్దేశించిన సుమారు 2 వేల మంది గెస్ట్‌ లెక్చరర్లను ఇంకా నియమించలేదు. కాలేజీల్లో అడ్మిషన్లను పెంచడానికి అధికారులు, కాలేజీ సిబ్బంది కూడా ఈ ఏడాది పెద్దగా ప్రయత్నం చేయలేదు. దీంతో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య పడిపోయింది. ఈ అంశంపై ఈ మధ్య రెగ్యులరైజ్‌ అయిన కాంట్రాక్టు లెక్చరర్లు కూడా స్పందించారు. ఇంటర్‌ విద్య సంఘం నాయకుడు సయ్యద్‌ జజీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అడ్మిషన్లు తగ్గిపోవడానికి కాంట్రాక్టు లెక్చరర్ల ప్రయత్న లోపం కారణం కాదన్నారు. రాష్ట్రంలో వందలాది గురుకులాలు, మైనార్టీ కళాశాలలు, కస్తూర్బా కళాశాలలు, మోడల్‌ స్కూళ్లు వచ్చాయని.. వీటిలో భోజనం, హాస్టల్‌ వసతితోపాటు అన్ని సౌకర్యాలతో అడ్మిషన్లు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇలాంటి సదుపాయాలు లేవని, ఆడ పిల్లలను దూర ప్రాంతానికి పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. విద్యార్థిణుల జాగ్రత్త కోసం హాస్టల్‌ ఉన్న కాలేజీలనే ఎంచుకుంటున్నారన్నారు. అడ్మిషన్ల సమయంలోనే సప్లమెంటరీ పరీక్షలు, తదనంతరం పేపర్‌ మూల్యాంకన బాధ్యతల్లో ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు 15 రోజులు పాల్గొన్నారని, ఈ సమయంలోనే కొన్ని ప్రేవేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో అడ్మిషన్లను నమోదు చేసుకున్నట్టు చెప్పారు. అడ్మిషన్లు పెంచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అడ్మిషన్లకు ఇంకా గడువున్నందున సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో హాస్టల్‌ వసతి లేదా మధ్నాహ్న భోజనం, ఉచిత బస్‌పా్‌సలాంటి సౌకర్యాలు కల్పించాలని పలు సందర్భాల్లో తాము ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వం కొన్ని మెరుగైన చర్యలు తీసుకుంటే అడ్మిషన్లు లక్ష దాటడంతోపాటు ప్రైవేట్‌ కార్పొరేట్‌ కళాశాలల మాదిరిగా అభివృద్ధి చేసి చూపుతామని ఆయన వెల్లడించారు....

ట్విట్టర్లో మంటలు పుట్టిస్తున్న కేటీఆర్

కేసీఅర్ నినాదం… ” మూడు పంటలు” …

కాంగ్రెస్ విధానం… ” మూడు గంటలు” …

BJP విధానం “మతం పేరిట మంటలు”

” మూడు పంటలు ” కావాలా..

” మూడు గంటలు “* కావాలా..

“ మతం పేరిట మంటలు” కావాలా…

తెలంగాణ రైతు… తేల్చుకోవాల్సిన.. తరుణం ఇది..!! అంటూ బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్ చేసిన ట్విట్ ఇప్పుడు మంట‌లు పుట్టిస్తున్నది.. బిజెపి,కాంగ్రెస్ ల‌ను టార్గెట్ చే స్తూ చేసిన ట్విట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా దూసుకుపోతున్న‌ది..

ఇక కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిన్నకారు రైతులు అంటే చిన్న చూపు అని.. సన్నకారు రైతు అంటే సవతి ప్రేమ అని కెటిఆర్ అన్నారు. నాడు ఏడు గంటల కరెంట్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్‌.. నేడు ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు.

మూడు గంటలతో మూడెకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలని ఎద్దేవా చేశారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగమవుతుందని అన్నారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్‌ కావాలా? మూడు గంటల కరెంట్‌ చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు

ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన కూచారం గిరిజన యువకులు

మెదక్ జిల్లా:జులై 11

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జైత్రం తండాకు చెందిన గిరిజన యువకులు మంగళవారం పెద్ద సంఖ్యలో రాష్ట్ర బీజేపీ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.

కూచారం గ్రామానికి చెందిన మెదక్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది గిరిజన యువకులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, జిల్లాలోని పలువురు నాయకుల ద్వారా ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లి పార్టీలో చేరారు.

బీజేపీ పార్టీలో చేరిన గిరిజన యువకులు విజయ్ నాయక్, కిషన్ నాయక్, నరేందర్ నాయక్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గిరిజన యువకులు మాట్లాడుతూ.. కూచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తమ గిరిజన తండాను అభివృద్ధి చేయడంలో మండల బీఆర్ఎస్ నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గిరిజన యువకులు వాపోయారు...

తెలంగాణలో రెండో నగరంగా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ జిల్లా :జులై 11

కరీంనగర్ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని 18వ డివిజన్ లోని రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో మంగళవారం రూ.1.90 కోట్ల పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగర పాలక సంస్థలో విలీనమైన డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రేకుర్తి 18, 19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ప్రారంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధగుని మాధవి కృష్ణ గౌడ్, ఏదుల్ల రాజశేఖర్ కార్పొరేటర్లు, వి.రాజేందర్ రావు, భూమాగౌడ్, జంగిలి సాగర్, దీండిగాల మహేష్, గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, బీఆర్ఎస నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్ డివిజన్ వాసులు, తదితరులు పాల్గొన్నారు......

లాయర్ వామన్రావు దంపతుల హత్య కేసు.. ఇద్దరు నిందితులకు బెయిల్‌

హైదరాబాద్ :జులై 11

తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో ఇవాళ కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు.. ఏ-3 ఉదారి లక్ష్మణ్ ఏ-5 అక్కపాక కుమార్‌లకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్లపై జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ సుందరేష్‌ ధర్మాసనం విచారణ చేపట్టగా.. తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు నిందితుల తరఫు లాయర్లు తెలిపారు. స్థానిక కోర్టులో విచారణ జరుగుతున్నట్లు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ట్రయల్‌ కోర్టు నిబంధనల మేరకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది.

2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరి వస్తుండగా.. కల్వచర్ల వద్దకు చేరుకోగానే వారిని దుండగులు అడ్డుకున్నారు. దాదాపుగా 20 నుంచి 30 నిముషాలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. ప్రజల మధ్యే దారుణంగా నరికి చంపిన విషయం పెద్దపెల్లి జిల్లాలో సంచలనం సృష్టించింది...

గ్యాస్ లీకేజీతో చెలరేగిన మంటలు.. ఏడుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్ :జులై 11

గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగడంతో ఏడుగురికి తీవ్రగాయాలైన ఘటన హైద‌రాబాద్ లోని దోమ‌ల‌గూడ‌లో మంగళవారం చోటుచేసుకుంది. రోజ్ కాల‌నీలో ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావ‌డంతో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.

దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధ‌మైంది. ఇంట్లో ఉన్న ఏడుగురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు అందించిన స‌మాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపు చేశారు.

ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో పద్మ (55), ఆమె కూతురు ధనలక్ష్మి (30) ధనలక్ష్మి పిల్లలు అభినవ్ (8), శరణ్య (6), విహార్ (3), పద్మ చెల్లెలు నాగులు గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. భారీ ఆస్తి న‌ష్టం జ‌రిగింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు...