నలంద డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకలు భారతదేశపు గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

నలంద డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకలు:

భారతదేశపు గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీ కే.బి. చౌదరి, ప్రిన్సిపాల్ శ్రీ కే రమణ కుమార్, శ్రీ కే. నరేంద్ర చౌదరి మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కళాశాలలో పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు, క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, మరియు షటిల్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులందరికీ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులందరూ కేవలము పాఠాలను అభ్యసించడమే కాకుండా తమ భవిష్యత్తుకు సంబంధించి క్రీడలు మరియు ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొంటే వారికి మానసిక వికాసంతో పాటు వివిధ రంగాలలో పోటీపడి ఉద్యోగాలు సంపాదించుకోవడం చాలా సులభం అవుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు. విద్యార్ధినీ విధ్యార్ధులు ఈ కార్యక్రమములో ఎంతో ఉత్సాహం గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.