తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 10 2024, 09:29

IMD's orange flash flood warnings for Himachal Pradesh other states

The India Meteorological Department (IMD) has issued an ‘orange’ alert for Himachal Pradesh and other states as heavy rain continued northern India through the first two weeks of August. Earlier this week, the IMD predicted that heavy to extremely heavy rainfall would continue in parts of Himachal Pradesh till August 12

The weather agency issued the orange alert owing to heavy downpour in Himachal Pradesh, Uttarakhand, East Uttar Pradesh, East Madhya Pradesh, Meghalaya, Manipur, Mizoram, Nagaland and Tripura.

In its forecast, the IMD said heavy isolated rainfall will continue to lash Himachal Pradesh, Uttarakhand, and parts of Rajasthan till August 12, while moderate rainfall is expected to lash Jammu and Kashmir, Haryana, Punjab and Chandigarh on August 10The weather agency said heavy to extremely heavy rain will continue in Himachal Pradesh till Saturday, along with lightening and thunderstorms. An orange alert will remain in place in the state till August 12, and a yellow warning has been issued till August 15

The IMD also alerted of a low to moderate risk of flash floods in isolated areas of Mandi, Bilaspur, Solan, Sirmaur, Shimla, and Kullu districts through Saturday, news agency PTI reported.

The agency further sounded a warning of potential landslides in some regions, along with possible damage to plantations, crops, vulnerable structures, and kutcha houses due to waterlogging and strong winds in low lying areas in the state.

Earlier, on August 7, the IMD reported significant rainfall across the state, with Joginder Nagar in Mandi district experiencing the highest at 110 MM in 24 hours. The incessant downpour has affected daily life, making it challenging for residents and visitors alike. The cloudburst and flash floods that occurred on August 1 have affected the districts of Kullu, Mandi and Shimla.

Meanwhile, a yellow alert has been issued in Delhi for the next two days, with a forecast of moderate to heavy rainfall in the national capital till August 11. The weather office forecasted cloudy skies and moderate rains in Delhi NCR for Saturday, reported PTI

Heavy rainfall lashed parts of Delhi and NCR on Friday, leading to heavy waterlogging and traffic congestion in the evening. The Met office issued an 'orange' warning to "be prepared" after earlier putting the city in the 'green' zone for no warning or alert.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 10 2024, 09:27

హైదరాబాద్‌లో అమెజాన్‌ సత్వర సహాయ హబ్‌

అమెజాన్‌ ఇండియా.. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినట్టయితే బాధితులకు 72 గంటల్లోగా సహాయక సామగ్రి అందించేందుకు దేశంలో నాలుగు హబ్‌లు ఏర్పాటు చేసింది.

అమెజాన్‌ ఇండియా.. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినట్టయితే బాధితులకు 72 గంటల్లోగా సహాయక సామగ్రి అందించేందుకు దేశంలో నాలుగు హబ్‌లు ఏర్పాటు చేసింది.

అవి థానే, ఫరీదాబాద్‌, హైదరాబాద్‌, పుర్బా బర్ధమాన్‌ నగరాల్లో ఉన్నాయి.

ఈ కేంద్రాలు బాధితులకు సత్వర సహాయ సామగ్రిని తరలించగలుగుతాయని అమెజాన్‌ తెలిపింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 10 2024, 09:26

సుంకిశాల నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తారు, ప్రభుత్వానికి నష్టం లేదు - మంత్రి ఉత్తమ్

సుంకిశాల ప్రాజెక్టును రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. జరిగిన సంఘటన చిన్నదనే అని… నష్టం కూడా తక్కువే అని చెప్పారు. ఈ నష్టాన్ని పూర్తిగా కాంట్రాక్టరే భరిస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలోని సుంకిశాల ప్రాజెక్టు ను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు . హైదరాబాద్ మహానగరానికి తాగునీటిన అందించే సుంకిశాల ప్రాజెక్టు పంప్ హౌస్ లో రిటైనింగ్ వాల్ కూలిపోయి సంపులోకి భారీ ఎత్తున కృష్ణా జలాలు చేరిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఇప్పటికే అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇంజనీరింగ్ అధికారులను వాకబు చేశారు.

నాగార్జున సాగర్ వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కూలిపోయిన సుంకిశాల సైడ్ వాల్ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ " గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా. కృష్ణానదిపై ప్రాజెక్టుల పనులు జరగలేదు. సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో నాటి సీఎం కేసీఆర్, నాటి మంత్రి కేటీఆర్ కే తెలియాలి. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదు. కేటీఆర్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రాజకీయ విమర్శలు చేయడం సరికాదు. గత ప్రభుత్వ హయాంలోనే సుంకిశాల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి , పనులు చేపించింది కూడా గత ప్రభుత్వమే. నేటి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. జరిగిన నష్టాన్ని మొత్తం కాంట్రాక్టర్ భరించి , ప్రాజెక్టు ని పూర్తి చేయాలి. అనవసరమైన రాజకీయ విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదు.." అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ముందు నుంచీ అయన వ్యతిరేకంగానే ఉన్నారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జరిగిన సంఘటన చిన్నది.. నష్టం కూడా తక్కువే అని అన్నారు. నష్టం కాంట్రాక్టర్ భరిస్తారని చెప్పారు. “ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు.. నిర్మాణంలో లేదు. నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు ఆలస్యం అవుతుంది” అని తెలిపారు.

గత ప్రభుత్వం ఎస్.ఎల్.బి.సి పూర్తి చేయలేదు. ఎస్.ఎల్.బి.సి. ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకం సైతం పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే జరిగాయి. సోషల్ మీడియా ద్వారానే సుంకిశాల ప్రమాదం ప్రభుత్వానికి తెలిసింది. ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించింది. హైదారాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు విచారణ చేస్తున్నారు.సీఎం వచ్చిన తరువాత చర్చించి చర్యలు తీసుకుంటాము . బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. అవునన్నా కాదన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసింది" అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి , రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేస్తుందన్న ఆయన… నష్టం అంతా నిర్మాణ సంస్థ భరిస్తుందని చెప్పారు. “ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలి” అని పేర్కొన్నారు.

గడిచిన రెండు రోజులుగా సుంకిశాల ప్రాజెక్టు సంఘటనపై రాజకీయ దుమారం నడుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ కూడా తమ బృందం సుంకిశాలను సందర్శిస్తుందని ప్రకటించారు. ఈ లోగా రాష్ట్ర మంత్రులు, జిల్లాకే చెందిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సుంకిశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు ఇంకా పోటెత్తుతూనే ఉంది. ఎగువలోని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇన్ ఫ్లో తగ్గలేదు . ఇప్పటికే సాగర్ జలాశయం దాదాపు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఎగువ కృష్ణా నుంచి వస్తున్న నీటినంతా దిగువకు సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు.

సాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న టెల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వదిలేస్తున్నారు. అంతేకాకుండా సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా కూడా జలాలను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కు ఉన్న ప్రధాన జల విద్యుత్ కేంద్రంతో పాటు, కుడి, ఎడమ కాల్వలపై ఉన్న కేంద్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 08 2024, 19:13

బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలి : VHP

పొరుగున ఉన్న బంగ్లాదేశ్ హింస, అరాచకాలతో అట్టుడుకుతోందని విశ్వ హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారిందని, బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, జాతీయ అధికార ప్రతినిధి శశిధర్, తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి విలేకరులతో మాట్లాడారు.

బంగ్లాదేశ్ ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టిన తరువాత, అరాచకవాద శక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నాయని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, అస్తవ్యస్తమైన ఈ పరిస్థితిలో అతివాద జిహాదీ శక్తులు అక్కడి మైనారిటీ వర్గమైన హిందూ సమాజంపై పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, మతపరమైన స్థలాలు, వ్యాపార సంస్థలు, హిందూ మైనారిటీల ఇళ్లు దెబ్బతిన్నాయని విశ్వహిందూ పరిషత్ నేతలు చెప్పారు. బంగ్లాదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఈ దారుణమైన చర్య జరుగుతున్నట్లు వివరించారు.

చివరకు హిందూ శ్మశాన వాటికలను కూడా జిహాది శక్తులు ధ్వంసం చేశాయన్నారు. ఆలయాలు భారీగా దెబ్బతిన్నాయని, బంగ్లాదేశ్‌లో వారి హింస, భీభత్సానికి గురికాని ఏ జిల్లా కూడా మిగిలలేదన్నారు. భారత్ నుంచి విడిపోయిన సమయంలో బంగ్లాదేశ్‌లో 32% ఉన్న హిందువులు.. ఇప్పుడు 8% కంటే తక్కువగా ఉన్నారనీ, వారు కూడా నిరంతరం జిహాదీ మూఖల దౌర్జన్యాలకు గురవుతూనే ఉన్నారని తీవ్ర ఆవేదన చెందారు.

బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు భద్రత కరువైందని, మానవ హక్కులు హరించి వేస్తున్నారన్నారు. అయినా వీటి గురించి లౌకికవాద శక్తులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల రక్షణ కోసం సభ్య సమాజం స్పందించాలన్నారు.

 బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ కోసం భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. ఈ క్లిష్ట పరిస్థితిని సద్వినియోగం చేసుకుని, జిహాదీలు సరిహద్దు దాటి భారత్ లో చొరబడేందుకు పెద్దఎత్తున ప్రయత్నం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయంలో భారత భద్రతా దళాలు సరిహద్దులో కట్టుదిట్టమైన నిఘా పెంచి, ఎలాంటి ఆక్రమణలకు అనుమతించకుండా చర్యలు చేపట్టాలన్నారు.

బంగ్లాదేశ్‌లో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 20:07

కండక్టర్‌ సస్పెండ్‌.. జనగామ డిపో ముందు ఆర్టీసీ సిబ్బంది ధర్నా

హన్మకొండ జిల్లా జనగామ ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్లు ఆందోళనకు దిగారు. అకారణంగా కండెక్టర్‌ శంకర్‌ను సస్పెండ్‌ చేశారంటూ విధులను బహిష్కరించారు.

కండక్టర్ల నిరసనలతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి.

జనగామ బస్సులోకి ఓ గర్భిణి బస్సు ఎక్కింది. అప్పటికే బస్సు నిండిపోయి ఉండటంతో గర్భిణికి సీటు ఇవ్వాలని ఓ మహిళా ప్రయాణికురాలిని కండక్టర్‌ శంకర్‌ కోరాడు. కానీ అందుకు ఆ మహిళా ప్రయాణికురాలు నిరాకరించింది.

దీంతో కండక్టర్‌కు, మహిళా ప్రయాణికురాలికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మహిళా ప్రయాణికురాలు మధ్యలోనే దిగిపోయింది.

మధ్యలోనే బస్సు దిగిన ఆ ప్రయాణికురాలు వెంటనే ఆర్టీసీ అధికారులకు ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ఫిర్యాదు చేసింది. దీనిపై జనగామ డిపో మేనేజర్‌ స్వాతి స్పందించారు.

ఎలాంటి విచారణ జరిపించకుండా సదరు కండక్టర్‌ను విధుల నుంచి తొలగించినట్లు మెమో జారీ చేశారు. దీనిని నిరసిస్తూ డిపో కండక్టర్లు ఆందోళకు దిగారు.

కండక్టర్‌ శంకర్‌, అతని కుటుంబసభ్యులతో కలిసి జనగామ డిపో ముందు ఆర్టీసీ సిబ్బంది ధర్నాకు దిగారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 20:02

వినేష్ ఫొగాట్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది.

వినేష్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ ఆడాల్సి ఉంది, అయితే మ్యాచ్‌కు ముందు బరువును పరిశీలించినప్పుడు,ఆమె అధిక బరువుతో ఉన్నట్లు తేలింది.

ఆ తర్వాత ఆమెను అనర్హురాలిగాగా ప్రకటించారు. ఆమె దాదాపు 100 గ్రాముల బరువుతో ఉన్నట్లు చెబుతున్నారు.

అటువంటి పరిస్థితిలో,రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత ఆమెని ఎందుకు అనర్హులుగా ప్రకటించారో మీకే అర్థమవుతుంది.

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అనేది ప్రధాన రెజ్లింగ్ సమాఖ్య. దాని నిబంధనల ప్రకారం, రెజ్లర్‌లను రెండుసార్లు తూకం వేయాలి. ఒకసారి పోటీకి ముందు, అనంతరం ఫైనల్ మ్యాచ్ ముందు రెండోసారి.

ఒక మల్లయోధుడు పోటీకి లేదా ఫైనల్స్‌కు ముందు తన బరువు తరగతిని చేరుకోకపోతే లేదా కొలతకు అందుబాటులో లేకుంటే, అతను అనర్హుడవుతాడు.

వినేష్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది.

అనర్హులుగా ప్రకటించడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి? 

UWW నియమాల ప్రకారం, అనర్హత వేటు వేస్తే రెజ్లర్ తదుపరి పోటీలలో పాల్గొనలేకపోవడం, మునుపటి అన్ని మ్యాచ్‌ల ఫలితాలు శూన్యమే.

వారు ఎటువంటి పతకం పొందలేరు . ఆ బరువు విభాగంలో పట్టికలో చివరి స్థానంలో నిలుస్తారు.

ఇలాంటి పరిస్థితిలో ఫైనల్స్‌కు చేరినా వినేష్ చివరి స్థానంతో భారత్‌కు తిరిగి వస్తుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 19:51

జగన్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికిల్‌, జామర్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సెక్యూరిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

జగన్‌కు భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తన భద్రతకు ముప్పు ఉందని, సెక్యూరిటీ తగ్గించేశారని, రిపేర్‌కు వచ్చిన వెహికిల్‌ను కేటాయించారని హైకోర్టులో జగన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్‌ సెక్యూరిటీపై విచారణ జరిపిన హైకోర్టు.. మరో బుల్లెట్ ప్రూఫ్‌ వెహికిల్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో జగన్‌కు మరొక బుల్లెట్ ప్రూఫ్‌ వెహికిల్‌ కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక దాడులు జరుగుతాయని అనుమానం ఉన్న చోట జగన్‌ పర్యటించే సమయంలో జామర్‌ కూడా కేటాయిస్తామని కోర్టుకు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

మాజీ సీఎంలకు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేనప్పటికీ.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

తనకు ఉన్న సెక్యూరిటీని యథావిథిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భద్రత సిబ్బందిని తగ్గించారని, ఇల్లు, ఆఫీసు దగ్గర సెక్యూరిటీని పూర్తిగా తొలగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు జగన్.

తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌ కూడా ప్రయాణానికి అనుకూలంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఏసీ పని చేయడం లేదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. దీంతో ఓ పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు జగన్.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 19:46

వినేష్ ఫొగాట్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి?

వినేష్ ఫొగాట్‌పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది.

వినేష్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ ఆడాల్సి ఉంది, అయితే మ్యాచ్‌కు ముందు బరువును పరిశీలించినప్పుడు,ఆమె అధిక బరువుతో ఉన్నట్లు తేలింది.

ఆ తర్వాత ఆమెను అనర్హురాలిగాగా ప్రకటించారు. ఆమె దాదాపు 100 గ్రాముల బరువుతో ఉన్నట్లు చెబుతున్నారు.

అటువంటి పరిస్థితిలో,రెజ్లింగ్‌లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ తర్వాత ఆమెని ఎందుకు అనర్హులుగా ప్రకటించారో మీకే అర్థమవుతుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 19:44

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ విభాగం

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

బుధవారం నుంచి గురువారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట

మహబూబాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి

నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 07 2024, 14:41

బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికొస్తే సహించేది లేదు...చాడ కిషన్ రెడ్డి

 రేవంత్ మెప్పు పొందేందుకే కోమటిరెడ్డి వింత చేష్టలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది

విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

నల్లగొండలో బిఆర్ఎస్ ఆఫీసును కూల్చేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పదేపదే అనే మాటలను ఇక ఆపాలని పార్టీ ఆఫీసు జోలికి వస్తే సహించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హెచ్చరించారు.

ఆయన బుధవారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని

పార్టీ ఆఫీసు కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదు అనే విషయాన్ని కోమటిరెడ్డి గ్రహించాలన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకపోతే మీరు కూడా భూమి ప్రభుత్వం నుంచి కేటాయించుకొని నిర్మించుకోండి కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద పడి కూల్చేస్తాం అనే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మేము చంద్రబాబు రేవంత్ రెడ్డి ల తొత్తులం కాదు.

అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం . టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ . మా జోలికొచ్చిన, మా ఉద్యమకారుల జోలికి వచ్చిన, మా పార్టీ ఆఫీస్ జోలికి వచ్చిన, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు .

30 ఏళ్లు మీరు రాజకీయంలో ఉండి నల్లగొండలో కనీసం పార్టీ ఆఫీసు నిర్మించుకోలేదని ..కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ తాబేదారులుగా తిరగాలని ఆలోచనతోనే పార్టీ ఆఫీసు నిర్మించకుండా ఉన్నారన్నారు.. రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బిఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారని మీరు ఏందో నల్లగొండ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. ఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో భూమి ఇస్తే అక్కడ ఆఫీసు నిర్మాణం చేశామని

కానీ రాష్ట్రంలో మీరు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద పడ్డారు అని ప్రశ్నించారు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తుందని రానున్న రోజుల్లో ప్రజల నుంచి మీకు బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.. వ్యక్తిగత కుట్రలు ద్వేషాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. 6 గ్యారంటీలతోపాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనించాలి తప్ప టిఆర్ఎస్ పార్టీపై ఏడవడం సరికాదన్నారు.. పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ ఆఫీసు జోలికి వెళ్లకుండా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లిన విషయం దృష్టిలో ఉంచుకోవాలని గుర్తు చేశారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు సగం మంది రైతులకు కూడా చేయని మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.. టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు ఆపి ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని అది వీడి పార్టీ ఆఫీసును కూల్చాలని టిఆర్ఎస్ పార్టీ వాళ్లపై విమర్శలు చేయాలని ఆలోచిస్తే మాత్రం ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కనగల్ పిఎసిఎస్ చైర్మన్ తోటి శ్రీనివాస్ ఎస్కే లతీఫ్ పోలే వెంకటాద్రి కర్నాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.