భువనగిరి: మూసి ప్రక్షాళన ,కృష్ణ గోదావరి జలాల సాధనకై ఈనెల 20 న చర్చా గోష్టి: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భువనగిరి,పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు మండలాలకు రైతాంగానికి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న మూసీని ప్రక్షాళన చేసి ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరి జలాలను అందించాలని ఈనెల 20వ తేదీన సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగు చర్చా గోష్టిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవహిస్తు పరివాహక ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్న మూసీ నదికి నమామిగంగా తరహాలో బడ్జెట్ కేటాయించి మూసీ నీటిని శుద్ధి చేసి రైతాంగానికి సాగునీరు అందించే ప్రయత్నం చేయడంలో పాలకులు విఫలం అయ్యారు అని వారు అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు ద్వారా గోదావరి, కృష్ణా జలాలను జిల్లాకు అందించాలని, మూసి శుద్దీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని వారు కోరారు. మూసీ జల కాలుష్యంతో ఇప్పటికే ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అంతుచిక్కని రోగాలతో ప్రజల ఆరోగ్యాలు పాడు అవుతున్నాయని పాలకుల పుణ్యమా అని ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్న మూసీ మాత్రం, మూసి కింద జీవనం సాగిస్తున్న బ్రతుకుచిత్రం మాత్రం మారడం లేదని వారు అన్నారు. ఎన్నికల సమయంలో బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు అని వారు అన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న సుందరయ్య భవనంలో మూసీ ప్రక్షాళన - కృష్ణా గోదావరి జలాల సాధన అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహిస్తున్నామని ఈ చర్చ గోస్టికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కిసాన్ సంఘం జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు పాల్గొంటారని అదేవిధంగా మూసి పరివాహక ప్రాంత రైతాంగం, మేధావులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చర్చ గోస్టిని జయప్రదం చేయాలని వారు అన్నారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటి సభ్యులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, నాయకులు ముత్యాలు, లావుడ్య రాజు, రాంబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.
Jul 18 2024, 16:59