వలిగొండ : నాగారం గ్రామంలో ప్రత్యేకత సంచరించుకుంటున్న... మొహర్రం వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో మొహరం వేడుకలు  ప్రత్యేకత సంచరించుకుంటుంది.ప్రత్యేకంగా మొహరం పండుగ చివరి రోజు మొహరం పండుగ రోజు మూడు గ్రామాల పీర్ల బంధాలు తెలియజేస్తాయి. నాగారం గ్రామంలో వెలిసిన వలి భాషకు నెమలి కాల్వ లాల్ సాబ్తమ్ముడు.అందుకు ప్రతి సంవత్సరంఅన్నను కలవడానికి నెమలి కాల్వ లాల్ సబ్ మొహరం రోజు నాగారం వచ్చి కలుస్తాడు. అదేవిధంగా గొల్నే పల్లి వలి భాష నాగారం వలి భాషకు అన్న. అన్నను కలవడానికి ప్రతి మొహరం రోజు నాగారం నుండి గొల్నేపల్లి కి వెల్లి కలుస్తాడు. సాయంత్రం తమ్ముడు వచ్చి అన్నను పలకరిస్తేనే అన్న లేస్తాడు, ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం.

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: TJU జిల్లా అధ్యక్షులు ఎండి షానుర్ బాబా

యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల కోసం 'తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్ బాబా ఆధ్వర్యంలో డాక్టర్.సుమంత్ కంటి హాస్పిటల్ సహకారంతో ఈ నెల 21న ఆదివారం రోజున నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షానూర్ మాట్లాడుతూ జిల్లా లొ పనిచేస్తున్న జర్నలిస్టులకు ఏదైనా కంటి సమస్యలు ఉన్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నిర్వహించిన అనంతరం డాక్టర్ సూచన మేరకు కంటి అద్దాలు,మందులు ఉచితంగా ఇవ్వబడునని, సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1 గంటల వరకు, విజయ్ భార్గవ్ హాస్పటల్ పక్కన, మీనా నగర్, భువనగిరిలొ ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు . ఈ కార్యక్రమంలో టీజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రషీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టి కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి: మూసి ప్రక్షాళన ,కృష్ణ గోదావరి జలాల సాధనకై ఈనెల 20 న చర్చా గోష్టి: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భువనగిరి,పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు మండలాలకు రైతాంగానికి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న మూసీని ప్రక్షాళన చేసి ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరి జలాలను అందించాలని ఈనెల 20వ తేదీన సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగు చర్చా గోష్టిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవహిస్తు పరివాహక ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్న మూసీ నదికి నమామిగంగా తరహాలో బడ్జెట్ కేటాయించి మూసీ నీటిని శుద్ధి చేసి రైతాంగానికి సాగునీరు అందించే ప్రయత్నం చేయడంలో పాలకులు విఫలం అయ్యారు అని వారు అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు ద్వారా గోదావరి, కృష్ణా జలాలను జిల్లాకు అందించాలని, మూసి శుద్దీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని వారు కోరారు. మూసీ జల కాలుష్యంతో ఇప్పటికే ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అంతుచిక్కని రోగాలతో ప్రజల ఆరోగ్యాలు పాడు అవుతున్నాయని పాలకుల పుణ్యమా అని ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్న మూసీ మాత్రం, మూసి కింద జీవనం సాగిస్తున్న బ్రతుకుచిత్రం మాత్రం మారడం లేదని వారు అన్నారు. ఎన్నికల సమయంలో బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు అని వారు అన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న సుందరయ్య భవనంలో మూసీ ప్రక్షాళన - కృష్ణా గోదావరి జలాల సాధన అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహిస్తున్నామని ఈ చర్చ గోస్టికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా కిసాన్ సంఘం జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు పాల్గొంటారని అదేవిధంగా మూసి పరివాహక ప్రాంత రైతాంగం, మేధావులు, ప్రజాప్రతినిధులు పాల్గొని చర్చ గోస్టిని జయప్రదం చేయాలని వారు అన్నారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటి సభ్యులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, నాయకులు ముత్యాలు, లావుడ్య రాజు, రాంబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22, 23 గ్రామపంచాయతీ కార్యాలయం ముందు 29న తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలను జయప్రదం చేయండి. సిపిఎం

భువనగిరి మండలం లోని గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22, 23 తేదీలలో గ్రామపంచాయతీ కార్యాలయాల ముందు, 29వ తేదీన మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. బుధవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరు మల్లేశం అధ్యక్షతన జరుగగా సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అనేక గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. సిపిఎం పోరుబాటలో భాగంగా ఈనెల ఒకటి నుంచి గ్రామాలను పర్యటిస్తే గ్రామాలలో నేటికీ రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్తు, లింకు రోడ్లు, కాలువల పైన బ్రిడ్జిల నిర్మాణం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాలలో సర్పంచుల పరిపాలన లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన అభివృద్ధి కుంటుపడిందని చాలా గ్రామాలలో చెత్త పేరుకుపోయి దోమలు ప్రజలను కుట్టడంతో అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. నేటికీ అనేకమంది పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేక అవస్థలు పడుతున్నారని వారందరికీ ప్రభుత్వము తక్షణం ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. ఇంకా పెన్షన్స్ రేషన్ కార్డులు లేనివారు కూడా అనేకమంది ఉన్నారని వారందరికీ వెంటనే ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాలలో పెద్దపెద్ద కాలువల పైన బ్రిడ్జి నిర్మాణం చేయవలసి ఉన్నదని, కొన్ని గ్రామాలలో విద్యుత్తు సమస్య ఉన్నాయని, మరికొన్ని గ్రామాలలో భూముల సమస్యలు కూడా ఉన్నాయని వీటి పరిష్కారం కోసమే పంచాయతీ కార్యాలయాల ముందు, తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నర్సింహ కోరినారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యురాలు కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, మోటే ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ: నాతాళ్ల గూడెం లో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో కొద్దిరోజుల కిందట ఉద్దగిరి ఎల్లయ్య మరణించడం జరిగింది వారి కుటుంబానికి భరోసాగా నిలవడానికి నిమ్మల ఎల్లయ్య గౌడ్ జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు నిమ్మల శోభన్ గౌడ్ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఉద్దగిరి భాస్కర్ ,నిమ్మల నరేష్ గౌడ్, మస్కు పెద్ద నరసింహ, మస్కు బుచ్చయ్య, మస్కు ముత్యాలు, బాలకృష్ణ గౌడ్, కొరబోయిన రాజయ్య తదితరులు పాల్గొన్నారు
అరూరు లో అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఎస్సై డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్స్ రేగంటి నిరంజన్ , ఎస్. శ్రీనివాస్ లు సోమవారం రాత్రి పది గంటలకి బ్లూ కొల్ట్స్ డ్యూటీ నిర్వహిస్తున్నారు .మధ్య రాత్రి 12 గంటల ఐదు నిమిషాలకి వలిగొండ మండలంలోని అరూరు మెయిన్ రోడ్ పై గల ఆర్చి వరకు వెళ్లారు. ఆర్చి కి దాదాపు 200 మీటర్ల దూరంలో మూడు బైకుల ను రోడ్డుకు అడ్డంగా పెట్టి, ఐదుగురు వ్యక్తులు గుమిగూడి ఉన్నారనీ అని పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని మీరు ఇంకా మధ్య రాత్రి వరకు ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పడంతో అసభ్యకరంగా ప్రవర్తించి మొరటు గా వాదించారు. మేము ఇక్కడే ఉంటాం. మీరెవరు మాకు చెప్పడానికి అని పరుష పదజాలంతో దూషించారు. డ్యూటీకి భంగం కలిగించారు .ఒక వ్యక్తి పోలీసు యూనిఫామ్ షర్ట్ ని చింపాడు . నిరంజన్ అనే కానిస్టేబుల్ ని ఇద్దరు వ్యక్తులు చేతులు వెనుకకు పెట్టి, గట్టిగా పట్టుకోవడం తో, ముగ్గురు వ్యక్తులు కాళ్లతో తన్నారు అని పోలీసులు తెలిపారు .వెంటనే మరొక కానిస్టేబుల్ శ్రీనివాస్ అడ్డుకోగా అతని పక్కకి నెట్టేశారు. వెంటనే కానిస్టేబుల్ శ్రీనివాస్ స్టేషన్ కి సమాచారం అందించడంతో పోలీసులు పెట్రోల్ మొబైల్ వాహనంలో సంఘటన చేరుకుని, ఐదుగురు వ్యక్తులని స్టేషన్ కి తరలించారు. నిందితులు కొప్పుల మచ్చ గిరి, నార్కట్ పల్లి నవీన్, కళ్లెం వీరస్వామి, ఎండి షబీల్ ,వీర్ల పల్లి శేఖర్ గా గుర్తించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి మంగళవారం  రిమాండ్ కొరకు కోర్టు ముందు హాజరు పరిచామని వలిగొండ ఎస్సై డి మహేందర్  తెలిపారు.
వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి , 24 గంటల వైద్య సేవలు అందించాలి: సిపిఎం డిమాండ్

వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నిటిని భర్తీ చేయాలని 24 గంటల వైద్య సేవలు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు సిపిఎం పోరుబాటలో భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ మండల కేంద్రమైన వలిగొండ పట్టణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు అవసరం ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని ఖాళీగా ఉన్న రెండు డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆసుపత్రిలో మూడు మొదటి ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు ఖాళీగా ఉన్న నైట్ వాచ్మెన్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని స్వీపర్లు కేవలం ఒక్కరే ఉన్నారని నూతనంగా నిర్మించిన భవనంలో అదనంగా మరొక స్వీపర్ అవసరం ఉందని అదేవిధంగా మేల్ సూపర్వైజర్ ఖాళీగా ఉందని వెంటనే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నిత్యం వందలాది మంది ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని నూతనంగా నిర్మించిన భవనంలో ప్రభుత్వం వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ముఖ్యంగా జనరేటర్ సౌకర్యం లేదని,వేటింగ్ చైర్స్ లేకపోవడం వల్ల వైద్యం కోసం వచ్చే మహిళలు,వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వెంటనే వెయిటింగ్ చైర్స్ లను ఏర్పాటు చేయాలని కోరారు వర్షంతో కురుస్తున్న పాత హాస్పటల్ భవనాన్ని వెంటనే తొలగించి అదనంగా ఆ స్థలంలో నూతన హాస్పిటల్ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ సర్వే కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం,సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,సిపిఎం నాయకులు రాధారపు మల్లేశం,వేముల లక్ష్మయ్య,దేశపాక యాదయ్య, పోలేపాక గణేష్,స్థానికులు ఎదురుగట్ల యాదగిరి, పోలేపాక శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో మౌలిక సమస్యల పరిష్కారం కొరకు SFI మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ వలిగొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల సంక్షేమ వసతి గృహంలో ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్ట్ భర్తీ చేయాలన్నారు అదేవిధంగా విద్యార్థుల పట్ల పర్యవేక్షణ లోపంగా వ్యవహరిస్తున్న ఎస్ ఓ ను సస్పెండ్ చేయాలన్నారు అదేవిధంగా హాస్టల్లో మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలన్నారు హాస్టల్లో విద్యార్థులకు వాటర్ సరిగ్గా లేక కరెంటు సౌకర్యం సరిగ్గా లేక బాత్రూంలో డోర్లు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు అనారోగ్య పరిస్థితి ఎదురవుతే చెప్పడానికి బాధ్యులు వార్డెన్ లేక ఇబ్బందులు పడతా ఉంటే ఉన్న బాధ్యులు ఎస్ఓ గారు పర్యవేక్షణ చేసి విద్యార్థుల బాగోదులు తెలుసుకోవాల్సిన వారు హాస్టల్ కి రాకుండా సమస్యలు తెలుసుకోకుండా తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరించడం జరుగుతుంది ఈ సరైన పద్ధతి కాదు వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారుఈసమస్యలన్నీ ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోగా కలెక్టర్ గారు స్పందించి ఈ సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ ఉదయ్ కిరణ్ మండల నాయకులు వేములకొండ వంశీ నరేందర్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి : భువనగిరి లో వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వనమహోత్సవం లో భాగంగా మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనగిరి ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు పోతంశెట్టివెంకటేశ్వర్లు కౌన్సిలర్ పంగ రెక్క స్వామిఅన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ ఆధ్వర్యంలో వనమహోత్సవం, జరిపినరు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమహోత్సవాన్ని జీవిత పండుగగా భావిస్తారు. వన మహోత్సవాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న నినాదం మాతృభూమిని రక్షించడమే. అందుకే దీన్ని వన మహోత్సవం అంటారు. ప్రముఖ నాయకులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఈ పండుగ గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అంతేకాకుండా, స్థానికులు మరియు అటవీ శాఖ వంటి వివిధ ప్రఖ్యాత ఏజెన్సీల మద్దతుతో విభిన్న జాతులకు చెందిన వేలాది మొక్కలు నాటబడ్డాయి. మన భూమికి చెట్లను పెంచడం ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ప్రజలు ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటిల్లో మొక్కలు నాటారు.అంతేకాక, సామాజిక మాధ్యమాలను కూడా మరింత అవగాహన కల్పించేందుకు ఉపయోగిస్తున్నారు. మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణిత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఇంటింటి మొక్కలు పంపిణీ చేసి, వాటి సంరక్షించే విధంగా ప్రజలకు తెలియజేయాలని, మొక్కల పెంపకంతో మానవ మనుగడ సాగుతుందని, భవిష్యత్‌ తరాలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతవరణం అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వార్డ్ ఆఫీసర్ శపరోద్దీ న్ వార్డ్ ప్రజలు , మహిళా సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: గోపరాజుపల్లి లో అమ్మ మాట అంగన్వాడి బాట

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని వెలువర్తి ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణిశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల వయసున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించి, వారికి ఆహ్లాదకర వాతావరణంలో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంగన్వాడి కేంద్రంలో చేర్పించి వారి ఆరోగ్యం ,విద్యపై దృష్టి సారించాలని కోరారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపరాజుపల్లి అంగన్వాడీ టీచర్ సలిగంజి మణెమ్మ, చిత్తాపురం అంగన్వాడి టీచర్ ఆర్ మంజుల , ముద్దాపురం అంగన్వాడి టీచర్ పి సునిత, ఆశా వర్కర్లు కవిత, నీరజ ఆయా దేవేంద్ర , గర్భవతులు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.