సమాజంలోని సంఘటనలతో నీలం నాటకం , సమాజానికి మంచి సందేశం: యువ రచయిత దర్శకుడు నీలం నరేష్
"నీలం" నాటకం ప్రతిభ ని ఎవరు అడ్డుకోలేరని అంటున్నాడు యవ రచయిత, దర్శకుడు, నీలం నరేష్_ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు నీలం థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో " నీలం " నాటకం నందమూరి తారక రామారావు ఆడిటోరియం, నాంపల్లి లో అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా" మామిడి హరికృష్ణ, ఆత్మీయ అతిథులు రచయిత నటుడు డా" మల్లేష్ బాలస్ట్, నటుడు దర్శకుడు ధనరాజ్,మరియు రచయిత దర్శకుడు నటుడు అజయ్ మంకెనపల్లి, కార్యక్రమంలో పాల్గొన్నారు, నాటకం అద్భుతంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని నాటకాలు వేయాలని, నీలం నాటకం సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారని మల్లేష్ బలస్ట్ అన్నారు, అజయ్ మంకే నపల్లి మాట్లాడుతూ ఈ నాటకాలు నటించినటువంటి నటినట్లు అందరికీ అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని మంచి నాటకాలు చేయాలని అలాగే కళాకారులని బాగా పాత్రలో జీవించి నటించరు అని అభినందించారు, నీలం నాటకం డైరెక్టర్ మాట్లాడుతూ ఈ నాటకం సమాజంలో జరుగుతున్నటువంటి, కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని రాయడం జరిగిందని అన్నారు ఈ నాటకంలో నటించినటువంటి నటి,నటుల అందరికీ అభినందనలు తెలిపారు.
మా నాటకానికి సహకరించిన డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు అలాగే రానున్న రోజుల్లో మిగతా హరివిల్లు లో రంగులను ప్రదర్శిస్తామని, అన్నారు.
Jul 17 2024, 18:13