Mane Praveen

May 28 2024, 19:57

NLG: పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి: సిఐటియు
పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేసి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన నిర్ణయించాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కార్మికులను విస్మరించిందని అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఏర్పడి కూడా ఆరు నెలలు గడుస్తున్నా కార్మికులను పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు స్పెషల్ గ్రాంట్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు నాంపల్లి శంకర్, ఉపాధ్యక్షులు వెంకటాచారి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 28 2024, 00:24

NLG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
నాంపల్లి మండలంలో సోమవారం  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 75% పోలింగ్ జరగడం ఆశ్చర్యకరమని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం, బాధ్యతలో పనిచేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, శీలం జగన్మోహన్ రెడ్డి, రేవల్లి గోపాల్ రెడ్డి, బట్టు జగన్, ఈదశేఖర్, పానుగంటి వెంకటయ్య, కామిశెట్టి చత్రపతి, కోరే శివ, మేకల రమేష్ ముదిరాజ్, కొండలు ముదిరాజ్, కోరే యాదయ్య గుండాల అంజయ్య, బొల్లంపల్లి దేవత్ పల్లి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 27 2024, 20:37

NLG: పోలింగ్ సరళిని పర్యవేక్షించిన బిజెపి మునుగోడు నియోజకవర్గం కోఆర్డినేటర్
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, మునుగోడు నియోజకవర్గం బిజెపి కోఆర్డినేటర్ కళ్లెం బాల్ రెడ్డి, ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలను మరియు మూడు మున్సిపాలిటీ లను సందర్శించారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ స్టేషన్ లలో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షకీల్ మీర్జా, తదితరులు ఉన్నారు.

Mane Praveen

May 26 2024, 21:53

నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: సిపిఎం నాయకులు ధనుంజయ గౌడ్

చండూరు మండలం నేర్మట గ్రామంలో ఇవాళ గాలి దుమారం, ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో గ్రామాన్ని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. గాలి దుమారానికి, ఈదురు గాలులతో వర్షం పడటంతో  నారపాక రాములు, జంగులు,ఈరగట్ల నరసింహ ఇంటి పై కప్పు రేకులు ఎగిసి పడ్డాయని, తక్షణమే ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీరి కుటుంబాలకుప్రభుత్వం ఆర్థిక సాయం అందించి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నేర్మట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నారపాక రాములు వీరి ఇంట్లో నాలుగు క్వింటాల బియ్యం పూర్తిగా తడిసినవి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి వెంకన్న, రాములు, దానయ్య,శంకరయ్య, జంగయ్య,లింగాలు,నాగరాజు, నరసింహతదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 26 2024, 21:25

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నకిరేకల్ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ 1997-99 బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అధ్యాపకులను విద్యార్థులు శాలువాలు, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు గూడూరు సుధాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, జానయ్య, భరణి కుమార్, శ్రీనివాస్, రాములు, కృష్ణ, పద్మాచారి, శ్రీనివాసాచారి, పూర్వ విద్యార్థులు డా. అక్కెనపల్లి సుధాకర్ జియాలజిస్ట్, నాగార్జున, మల్లికార్జున్, కిషోర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 25 2024, 22:16

నక్సల్ బరి పోరాటానికి 57 ఏళ్ళు
భారతదేశ పీడిత ప్రజలకు విప్లవ పోరాట మార్గాన్ని చూపిన నక్సల్ బరి పోరాటానికి 57 ఏళ్ళు నిండిన సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ పై ఎర్రజెండా ను ఎగరవేశారు.

ఈ సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడుతూ.. 1967లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లాలో సిలుగురి ప్రాంతంలో సంతాల్ రైతులు తమకు భూమి కావాలని పోరాటాన్ని కొనసాగిస్తే నాడు ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఆ పోరాటంపై కాల్పులు జరిపి 11 మందిని బలిగొన్నదని అన్నారు. ఆ పోరాటమే ఈ దేశ విముక్తి కి విప్లవ పంథాను చూపిందన్నారు. భూమి, బుక్తి కోసం సాగిన నక్సల్ బరి పోరాటం అందించిన స్ఫూర్తితో దేశంలో హింస, అణిచివేత, పీడనలకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆ ప్రేరణతో  అనేకమంది యువకులు, విద్యార్థులు, మేధావులు విప్లవ పోరాటలలోకి వచ్చారని, శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం కూడా కొనసాగిందని అన్నారు. నాడు జరిగిన నక్సల్ బరి పోరాటం పార్లమెంటరీ పందాకు, విప్లవ పందాకు మధ్య విభజన రేఖను  గీసిందని, ఆ రైతాంగ ఉద్యమంపై జ్యోతిబసు ప్రభుత్వం చేసిన దుర్మార్గమే సిపిఎం లోని అగ్ర శ్రేణి కార్యకర్తలు, నాయకులు విప్లవ మార్గంలో ప్రయాణించారని అన్నారు. నక్సల్ బరి పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, PYL జిల్లా కార్యదర్శి బివి చారి, రావుల వీరేశ్, జానపాటి శంకర్, దాసరి నర్సింహా, అయోధ్య,బాలాజీ, పవన్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

May 25 2024, 15:54

TG: వరంగల్ జిల్లాలో రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య
వరంగల్ జిల్లా: రైలు కింద పడి యువతి మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం సారధి నగర్ కు చెందిన ఐలపోగు సుష్మ (17) అనే యువతి, వరంగల్ కాశిబుగ్గ కు చెందిన చెన్నకేశవ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏడు మోరీ ల వద్ద నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన యువతి స్పాట్ లోనే మృతి చెందగా..మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలిం చారు. తీవ్ర గాయాల పాలై న యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు మీద ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారు వచ్చిన తర్వాత ఏ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పూర్తి వివరాలు తెలియజేస్తామని ఐ.ఓ ఎం.మల్లయ్య, ఎస్ఐ, ఆర్పీ, వరంగల్ రైల్వే పోలీసులు  తెలిపారు.

Mane Praveen

May 24 2024, 16:04

అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
గుర్రంపోడు మండలం, కొప్పోల్ గ్రామంలోని బస్టాండ్ లో గత 3 నెలలుగా మతిస్థిమితం లేని వ్యక్తికి మూడు నెలల పాటు స్థానికులు భోజనం అందించారు.గుర్రంపోడు పోలిస్ సిబ్బంది, కొప్పోల్ గ్రామ యువత సహకారంతో అన్నపూర్ణ సేవాసమితి వారికి సమాచారం అందించగా, తక్షణమే స్పందించిన అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాజు, సభ్యుడు రాము  మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని స్థానిక పోలీస్, గ్రామ యూత్ ఆధ్వర్యంలో సూర్యాపేట లోని ఆశ్రమం కు తరలించారు. నూకల జైపాల్ రెడ్డి  మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిని అంబులెన్స్ లో తీసుకెళ్ళుటకు పెట్రోల్ కి సహకారం అందించారు. ఈ సందర్భంగా పోలీసులు సమాజ సేవ చేస్తున్న గ్రామ యూత్ ని, అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించారు.

Mane Praveen

May 23 2024, 18:06

TG: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, చర్ల మండలం డిప్యూటీ తహశీల్దారు భరణిబాబు ఈరోజు ఎసిబికి చిక్కారు. భరణిబాబు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. పాసుపుస్తకం ఇచ్చేందుకు రైతును డిటి భరణిబాబు లంచం అడగడంతో సదరు వ్యక్తి ఎసిబి ని ఆశ్రయించాడు. దీంతో వలపన్ని డిప్యూటీ తహశీల్దారును ఎసిబి అధికారులు పట్టుకున్నారు.