TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

అమరావతి: తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది..

1 గాజువాక-పల్లా శ్రీనివాసరావు

2. మాడుగుల- పైల ప్రసాద్

3. రంపచోడవరం - మిర్యాల శిరీష

4. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు

5. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

6. దెందులూరు-చింతమనేని ప్రభాకర్

7. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజ్జీర్

8. గిద్దలూర్-అశోక్ రెడ్డి

9. పెద్దకూరప్రాడు-భాష్యం ప్రవీణ్

10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి

11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

12. కొవ్వూరు-ముప్పిడి వెంకటేశ్వరరావు

13. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు

14. కోవూర్- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

15. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

16. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి

17. ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి

18. నందికొట్కూర్- గిత్త జయసూర్య

19. కదిరి-కందికోట యశోదా దేవి

20. మాడుగుల-ఫైలా ప్రసాద్

21. కందుకూర్ - ఇటూరి నాగేశ్వరరావు

22. మదనపల్లి-షాజహాన్ భాషా

23. గాజువాక- పల్లాశ్రీనివాసరావు.

Gold Smuggling: రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు..

ఈ క్రమంలో రూ.40.08 కోట్ల విలువైన 61.08 కిలోల విదేశీ బంగారం, రూ.13 లక్షల నగదు, 17 కార్లు, 30 మొబైల్స్, 21 ఇంటర్నెట్ డాంగిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నాయి. అదే సమయంలో 12 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌ఐ పాట్నా, ముజఫర్‌పూర్, గోరఖ్‌పూర్, అస్సాం యూనిట్లు పాల్గొన్నాయి..

వాస్తవానికి గౌహతిలోని నివాస సముదాయం నుంచి బంగారం స్మగ్లింగ్ సిండికేట్(syndicate smuggling) నిర్వహిస్తున్నట్లు DRIకి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అస్సాం యూనిట్ ఏజెన్సీ పలు చోట్ల సోదాలు చేయగా 22.74 కిలోల బరువున్న 137 బంగారు బిస్కెట్లు, రూ.13 లక్షల నగదు లభించాయి. అలాగే 21 వాహనాల తాళాలు, 30 మొబైల్ ఫోన్లు, 25 ఇంటర్నెట్ డాంగిల్స్ స్వాధీనం చేసుకోగా, ఆ ఇంట్లో ఆరుగురిని అరెస్టు చేశారు..

Simultaneous polls: 'జమిలి ఎన్నికల'పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

దిల్లీ: 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు' పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది..

ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను ప్రథమ పౌరురాలికి అందజేశారు.

దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం..

ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు.. 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది.ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది..

Lok Sabha Election 2024: నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Polls2024) షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఒకటి రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ప్రకటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి..

నేడో, రెపో షెడ్యూల్ ప్రకటించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రకటన తేదీల్లో మార్పు ఏమైనా ఉన్నా ఈ వారంలో షెడ్యూల్ విడుదల కావడం ఖాయమంటూ రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెలువడనుంది..

జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం బృందం పరిశీలన అనంతరం నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని, అయితే ఎన్నికల సంఘం బుధవారం జమ్ముకాశ్మీర్‌లో పర్యటించడంతో ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి అని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం బృందం బుధవారం అక్కడ పర్యటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. భద్రతా పరిస్థితిని సమీక్షించిన అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా? లేక వేర్వేరుగా నిర్వహించాలా? అనే దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు..

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా విడుదల

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది.

లక్కీడిప్‌ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 21వ తేదీ ఉదయం పదింటికి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు పై సేవల వర్చువల్‌ సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

జూన్‌ 19 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఉదయం పదింటికి టికెట్లను అందుబాటులో ఉంచుతారు.

ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు.

25వ తేదీ ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం

సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం గాంధీభవన్‌లో దీప్‌దాస్ మున్షీ అధ్యక్షతన 13 పార్లమెంట్ నియోజక వర్గాల అభ్యర్థిత్వాలపై అభిప్రాయ సేకరణ జరిపారు.

అనంతరం దీప్‌దాస్ మున్షీ సారథ్యంలో ఎఐసిసి నేతలు సీఎం రేవంత్ నివాసంలో బుధవారం రాత్రి సమావేశ మయ్యారు.

ఈ సమావేశంలో అభిప్రా య సేకరణకు సంబంధిం చిన అంశాలపై దీప్‌దాస్‌ మున్షీ, సిఎం రేవంత్‌ల మధ్య చర్చలు నిర్వహించి నట్లు తెలుస్తోంది.

ఈ చర్చలలో భాగంగా సీఎం రేవంత్ సైతం తన అభిప్రాయాలను వెల్లడించి నట్లు సమాచారం. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం అంత ఉండకపోవచ్చన్న చర్చ చోటు చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఒకట్రెండు చోట్ల కొత్తవారికి అవకాశమిచ్చినా అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం సైతం వ్యక్త మైనట్లు సమాచారం. అయితే అభిప్రాయ సేకరణ సందర్భంగా కొత్తవారికి అభ్యర్థిత్వాలు కట్టబెట్టే తీరుపై పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మైన సంగతి విదితమే.

మిగతా 13 లోక్‌సభ నియోజకవర్గాల అభ్య ర్థులను ఫైనలైజ్ చేసేందుకు సిఎం రేవంత్ ఢిల్లీ బాట పడుతున్నారు.

నేటితో ముగియనున్న గ్రూప్ 1 పరీక్ష దరఖాస్తు గడువు

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, నేటీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది.

అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్‌ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల అప్లికేషన్స్ వచ్చాయి.

పరీక్షకు 7 రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లు అందు బాటులోకి వస్తాయి...

ఇక సర్కారు బడుల్ల్లో జిల్లా కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు!

ప్రైవేట్‌ స్కూళ్లకు 9 గంటల కే అంటే 9లోపు.. 10 గంటలకే అంటే 10 గంటలకే టీచర్లు వస్తారు. అదే సర్కా రు బడులకు 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకొచ్చేవాళ్లున్నారు

స్కూళ్లో ముగ్గురు టీచర్లుం టే వచ్చేది ఇద్దరే. ఇక షిప్టులు, వంతులు పెట్టుకొని ఒకరు స్కూళుకెళ్లి, మరొక రు డుమ్మాకొడుతున్న పరిస్థితులున్నాయి. కానీ జీతాలు మాత్రం పూర్తిగా తీసుకొంటారు.

ఇది ప్రైవేట్‌కు..సర్కారు బడులకున్న తేడా.ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అన్నింటిపై నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించం. ఫేషియ ల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను ఎఫ్‌ఆర్‌ఎస్‌ పటిష్టంగా అమలుచేయాలి.

అన్నిశాఖలు, కార్యాలయా ల్లో ఈ హాజరు అమలవు తుంది. సీఎం, సీఎస్‌ సహా ఐఏఎస్‌ అధికారులంతా ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరును నమోదుచేయాలి. ఇటీవలే విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి అధికా రులతో అన్న మాటలివి.

అధికార వర్గాల కథనం ప్రకారం విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం ఇలా వ్యాఖ్యానిం చడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. సర్కారు బడులను గాడినపెట్టే పనిలో నిమగ్నమైంది

కలెక్టర్ల చేత ఆకస్మిక తనిఖీలు

సర్కారు బడులను గాడిలో పెట్టడంలో భాగంగా జిల్లా కలెక్టర్ల చేత ఆకస్మిక తని ఖీలు చేయించాలని ప్రభు త్వం నిర్ణయించింది. వారంలో రెండు చొప్పున బడులను తనిఖీచేసేలా త్వరలోనే ఆదేశాలివ్వను న్నది.

ఈ ఆకస్మిక తనిఖీ పూర్త యిన తర్వాత కలెక్టర్లు పూర్తిస్థాయి నివేదికను రూపొందించి అటు విద్యాశాఖకు..ఇటు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సర్కారు బడులపై ప్రజల్లో సదాభి ప్రాయంలేదని, ఇందుకు టీచర్లు ఓ కారణమని ప్రభుత్వం గుర్తించింది.

గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్లు విధులకు గైర్హాజరవుతు న్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆకస్మిక తనిఖీల ద్వారా బడులను బలోపేతం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వమున్నది.

కాగా, వచ్చే జూన్‌లోపు 'మన ఊరు -మన బడి' కార్యక్రమంలో చేపట్టిన స్కూళ్లే కాకుండా అన్ని స్కూళ్లలో సరిపడ నీటి వసతి, టాయిలెట్లు, తాగునీరు, బెంచీలు వంటి సౌకర్యాలను కల్పించాలని విద్యాశాఖ యోచిస్తున్నది

గతంలో వ్యతిరేకించిన సంఘాలు

పాఠశాల్లో టీచర్ల హాజరును పర్యవేక్షించేందుకు అమలు చేసిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను హాజరు విధానాన్ని గతంలో పలు ఉపాధ్యాయ సంఘా లు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. టీచర్లపై పెత్తన మేంటని ప్రశ్నించాయి.

ఈ విధానంపై టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేప థ్యంలో విద్యాశాఖ వెనక్కితగ్గింది. దీంతో అరకొరగానే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలవుతున్నది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల తో పూర్తిస్థాయిలో ఎఫ్‌ఆర్‌ ఎస్‌ అమలుకు విద్యాశాఖ సమాయత్త మవుతున్నది

బిజెపి 72 మందితో రెండో జాబితా

లోక్ సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగు రికి ఇందులో చోటు దక్కింది.

మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్య ర్థిగా రఘునందన్‌ రావుకు అవకాశం ఇచ్చింది. ఆదిలా బాద్‌ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్‌ పోటీ చేయను న్నారు.

మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌, నల్లగొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు.

ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో తొమ్మిది రెండో జాబితాలో ఆరు స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది బీజేపీ. ఇప్పటి వరకు 15 లోక్‌సభ స్థానాలకు అభ్య ర్థులను ప్రకటించించగా.. వరంగల్‌, ఖమ్మం స్థానాల ను పెండింగ్‌లో ఉంచింది.

ఎమ్మెల్సీ కవితకు నో ఛాన్స్? కొత్తవారికి అవకాశం

జహీరాబాద్ మరియు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిం చారు.

జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్ , నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నారు.

గతంలో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడినా కవితకు ఈసారి టికెట్ నిరాకరించారు.కాగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది.

వారిలో ముగ్గురు సిట్టింగ్ సభ్యులు మాలోతు కవిత, నామా నాగశ్వరరావు, మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నా రు. మిగిలిన ఆరు గురి లో ఐదుగురు తొలి సారి లోక్ సభకుపోటీ చేయను న్నారు..