ఎమ్మెల్సీ కవితకు నో ఛాన్స్? కొత్తవారికి అవకాశం

జహీరాబాద్ మరియు నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిం చారు.

జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్ కుమార్ , నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నారు.

గతంలో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడినా కవితకు ఈసారి టికెట్ నిరాకరించారు.కాగా, ఇప్పటి వరకు తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది.

వారిలో ముగ్గురు సిట్టింగ్ సభ్యులు మాలోతు కవిత, నామా నాగశ్వరరావు, మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నా రు. మిగిలిన ఆరు గురి లో ఐదుగురు తొలి సారి లోక్ సభకుపోటీ చేయను న్నారు..

Election Commissioners: ఈసీల నియామకాలపై వివాదం వేళ.. 15న సుప్రీం అత్యవసర విచారణ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల (Election Commissioners) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి..

ఈ పిటిషన్ల అత్యవసర విచారణ చేపట్టాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తాజాగా అభ్యర్థించింది. ఇందుకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవారం (మార్చి 15న) విచారణ జరుపుతామని వెల్లడించింది..

కేంద్ర ఎన్నికల సంఘం (EC)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు..

ఏంటీ కొత్త చట్టం..?

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీ నియామకాలు చేపట్టాలని 2023 మార్చిలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి గతేడాది డిసెంబరులో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం.. ఈసీల నియామక బాధ్యతలను సెర్చ్‌, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది. దీన్ని సవాల్‌ చేస్తూనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి..

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించాలి : సీఎం రేవంత్

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహిం చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

గత ఏడాది జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈసారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు.

పరీక్ష పూర్తయ్యేంత వరకు అవసరమైతే జామర్లు ఏర్పాటు చేసి, ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ చేయించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బంది, విద్యార్థులు ఎవరికీ ఫోన్లు అందుబా టులో లేకుండా చూడను న్నారు.

పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్లకుం డా, మాస్ కాపీయింగ్ జర గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.

ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తర గతి పరీక్షలు జరగను న్నాయి.

హర్యానా సీఎం రాజీనామా?

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు.

గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.ఈరోజు మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జేజేపీ, బీజేపీ కూటమిలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

కాసేపట్లో బీజేఎల్పీ సమావేశంలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు...

ఆస్ట్రేలియాలో మహిళ హత్య? ఇండియాకు తెచ్చేందుకు యత్నాలు

ఆస్ట్రేలియలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్వేత (36) మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేం దుకు కేంద్ర హోంశాఖ యత్నాలు చేస్తోంది.

ఇటీవల హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేతను ఆమె భర్త అశోక్ రాజ్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హత్య చేసి చెత్త కుండీలో పడేసిన విషయం తెలిసిందే.

కాగా రాచకొండ పోలీసు లను కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. త్వరలోనే డెడ్ బాడీని నేడో, రేపో హైదరా బాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు

ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది.

ఈ సభ వేదికగానే... మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.. ఇక ఈ రోజు కరీంగనగర్ వేదికగా ఎన్నికల శంఖరావం పూరిం చనున్నారు గులాబీ బాస్ కేసీఆర్..

ఇప్పటికే సభకు సంబంధిం చిన ఏర్పాట్లన్నీ శర వేగంగా కొనసాగుతున్నాయి..

తెలంగాణకు మరోసారి మోడీ..5 రోజుల షెడ్యూల్ ఖరారు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.

తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించను న్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు ఆయన రానున్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జగిత్యా ల, నాగర్ కర్నూల్, మల్కా జ్‌గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది..

Amit Shah: నేడు బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం.. హాజరు కానున్న అమిత్ షా

Amit Shah: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు..

మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు..

నేడు కరీంనగర్లో ‘కథనభేరి’.. హాజరుకానున్న కేసీఆర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేడు మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది.

ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను వెల్ల‌డించారు.

ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభి స్తారు..

అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోం దని గంగుల కమలాకర్ తెలిపారు.

అదిలాబాద్ జిల్లాలో డీఎస్సీ,ఎస్జీటీ, అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న డీఎస్సీని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ, ఎస్జీటీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

బీసీ, ఎస్సీ ,ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్య ర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈనెల 14 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు.

ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5.00 లక్షల లోపు ఉండాలని తెలిపారు.

రిజర్వేషన్ ప్రకారం ఎస్‌జీ టీకి సంబంధించి ఇంటర్మీడి యట్, డైట్, టెట్‌లో సాధిం చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

ఈ ఉచిత శిక్షణ 75 రోజులు ఉంటుందని, నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 087322212809949684959 నంబర్లు సంప్రదించాలని కోరారు.