ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

మార్చి 12 పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లీం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని సీఎం తెలిపారు.

రంజాన్ మాస వేడుకలను సుఖ సంతోషా లతో జరుపుకోవాలని ఆయన తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం లు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్నారు.

రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

17న పల్నాడులో మోడీ టూర్..!

చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగే తొలి భారీ బహిరంగ సభ లో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ఆయనతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,జనసేనాని పవన్ కళ్యాణ్ ఇతర నేతలు పాల్గొననున్నారు.

2014 ఎన్నికల సమయంలో కూడా ఈ ముగ్గురు నేతలు కలిసి రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ లు విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.

అదే రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఈ సారి కూడా పై ముగ్గురు నేతలు రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు సుడిగాలి పర్యటనలు జరిపేందుకు నిర్ణయించారు.

అందులో భాగంగానే బీజేపీ తో పొత్తు కుదిరిన వెంటనే బాబు,పవన్ లు ఏపీ నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు.

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన పల్నాడుకు వస్తున్న ప్రధాన మంత్రుల్లో నరేంద్ర మోడీ 4వ వారు.

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1955 లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంఖు స్థాపన కోసం వచ్చారు.

1980 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మాచర్ల కేసీపీ గ్రౌండ్ లో జరిగిన సభకు హాజరయ్యారు.

1989 లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ పిడుగురాళ్ల లో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో పాల్గొన్నారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 17 న రానున్నారు.

చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న 150 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని టీడీపీ,జనసేన నేతలు ఎంపిక చేశారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,ఇతర నేతలు ఈ ప్రాంతాన్ని పర్యటించి పై ప్రదేశాన్ని ఎంపిక చేశారు.

సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు మేదర మెట్ల లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటున్న సిద్ధం సభకు మించి మోడీ,బాబు,పవన్ పాల్గొనే సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే జిల్లా నేతలందరూ ఈ సభ సక్సెస్ పై దృష్టి పెట్టారు.

ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది.

దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికాయి.

ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్ కూడా సోమవారం రంజాన్ 2024 మొదటి రోజు అని ప్రకటించాయి.

ఇక భారతదేశంలో మార్చి 12 నుండి ఉపవాసాలను పాటిస్తారు.భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కూడా, పవిత్ర రంజాన్ మాసం మార్చి 12, మంగళ వారం నుండి ప్రారంభమవు తుంది. ఈ నెలలో, ముస్లిం లు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవా సం ఉంటారు.

రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.

ఇది నెల ప్రారంభం, ముగిం పును నిర్ణయించడంలో కీల కమైనది. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లిం లు ఈద్-ఉల్-ఫితర్ జరుపు కుంటారు...

నేడు యాదాద్రి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేడు యాద‌గిరిగుట్ట‌, భ‌ద్రా ద్రిలో ప‌ర్య‌టించారు. ముం దుగా ఆయ‌న యాదాద్రిలో నేటి నుంచి ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాల‌లో పాల్గొన్నారు..

ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మినర సింహ స్వామిని దర్శించు కున్నారు. యాదాద్రికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొ న్నారు.ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్శించిన రేవంత్…

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్ సమర్పించారు.

సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బీఎల్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భ‌ద్రాద్రి రామ‌య్య సేవ‌లో..

యాదాద్రి నుంచి నేరుగా హెలికాప్ట‌ర్ లో సిఎం భద్రా చలం చేరుకున్నారు. అనం త‌రం శ్రీ సీతారామచంద్ర స్వామిని రేవంత్ దంప‌తు లు దర్శించుకున్నారు.

రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్య మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క ఉన్నారు...

ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది.

ఈ మేరకు రుణం పొందేం దుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో భాగంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లకు గాను హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని సాంక్షన్ చేయనుంది.

గ్రామాల్లో 57,141 ఇళ్లు పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు ఆ రుణాలను స్టేట్ హౌజింగ్ బోర్డు వినియోగ నించనుంది.

Streetbuzz News

High Temperature: రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది.

రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Streetbuzz News

తెలంగాణలో 45 మంది డిఎస్పీ ల బదిలీలు

రాష్ట్రంలో పనిచేస్తున్న 45 మంది డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు.

ఇటీవల ఐపీఎస్ అధి కారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఈరోజు డీఎస్పీ లను బదిలీ చేశారు.

కాసేపట్లో కేంద్ర కేబినెట్‌ చివరి భేటీ.. మంత్రులకు ప్రధాని వీడ్కోలు పార్టీ

ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ ఆదివారం(మార్చ్‌ 3) భేటీ అవనుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ విడుదలవనుండడంతో ఈ ప్రభుత్వంలో ఇదే చివరి కేబినెట్‌ సమావేశం కానుంది..

ఈ భేటీలో కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ వీడ్కోలు పలకనున్నారు. వారికి ప్రధాని వీడ్కోలు పార్టీ ఇవ్వనున్నారు..

మూడవసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఈ సమావేశంలో ప్రధాని మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లమాటిక్ ఎనక్లేవ్‌లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో తుది కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ నెలలోనే లోక్‌సభ సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) షెడ్యూల్ విడుదల చేయనుంది..

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి.

ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1,924 పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక ఎంపిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో పొందు పరిచారు. జేఎల్‌ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది లింక్‌ల ద్వారా నేరుగా ఫలితాను చెక్‌ చేసుకోవచ్చు.

కాగా గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన ఫలితాలు త్వరలోనే ప్రకటించ నున్నట్లు బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది..

నేడు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా

సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది.

గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేసి జాబితాను రూపొం దించింది.

ఈ జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది.

ఈ మేరకు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీలను కమలనాథులు ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న నేతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు..

జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు న్నారు.