మా మెడికల్ కాలేజీ ...మాకే కావాలి; భువనగిరిలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో


భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక వినాయక చౌరస్తా వద్ద శుక్రవారం మా మెడికల్ కాలేజీ ...మాకే కావాలి అంటూ భారీ రాస్తారోకో నిర్వహించారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్ కు తరలించడానికి నిరసిస్తూ.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తా రోకో తో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జోనల్ ఇన్చార్జి పట్నం కపిల్ బలరాం, బీజేవైఎం రాష్ట్ర జిల్లా నాయకులు భాస్కర్ ,దయ్యాల కుమారస్వామి బూరుగు మణికంఠ ,మునగాల రాజశేఖర్ రెడ్డి ,వాసం నరసింగరావు ,కానుకుంట్ల రమేష్, కిషోర్ ,కుచ్చుల మహేష్ ,ఎరుకల చైతన్య, బోనగిరి సదానందం ,ఫాదరాజు ఉమా శంకర్ రావు ,ఉదయగిరి విజయకుమార్ , శ్యాం సుందర్ రెడ్డి ,వైజయంతి ,మల్లికా ,పట్టం శ్రీనివాస్ ,జనగాం నరసింహ చారి ,ఉడుత భాస్కర్, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం... పోచంపల్లి మండల కమిటీ నియామకం


బహుజన్ సమాజ్ పార్టీ భూదాన్ పోచంపల్లి మండల అధ్యక్షులు మీసాల సైదులు అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించి పోచంపల్లి మండల కమిటీని వేయడం జరిగినది, ఈ సమీక్ష సమావేశానికి

 ముఖ్య అతిథులుగా యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్ , కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు బొల్లెపల్లి అనిల్ కుమార్

విశిష్ట అతిథులుగా:భువనగిరి అసెంబ్లీ ఇన్చార్జి కొమ్ము జగన్ , అసెంబ్లీ ఉపాధ్యక్షులు బర్రె నాగేష్ హాజరైనారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఈనెల 10వ తేదీ భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగు పార్లమెంటరీ సమావేశాలను జయప్రదం చేయాలని అన్నారు.

 భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్ సమక్షంలో

1)పోచంపల్లి మండలం ఉపాధ్యక్షులుగా :

 ఎంజాల ఉపేందర్ (రజక ) గారిని,

2)పోచంపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా :

కోట మల్లేష్ గారిని ,

3)మండల :

మీసాల ప్రశాంత్ గారిని ,

4)మండల కోశాధికారిగా :

 పోలే జగన్ గారిని నియమించడం

 జరిగినది,

పరీక్షల సమయాలలో విద్యార్థులకు వార్డెన్లు, సంక్షేమ అధికారులు అందుబాటులో ఉండాలి:AISF


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహన్నీ సందర్శించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల ల్లో వార్డెన్లు , పరీక్ష సమయాలలో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, వారికి స్పెషల్ క్లాస్లు ఏర్పాటు చేసి చదువుపై శ్రద్ధ పెంచే విధంగా చూసుకోవాలని అన్నారు .

విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి,ఆందోళనకు గురికాకుండా కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యంగా ఉండే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. 

రాత్రి సమయాలలో కచ్చితంగా వాచ్మెన్ ఉండే విధంగా చూడాలని సంక్షేమ అధికారులను విజ్ఞప్తి చేశారు. 

  ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మోత్కూరు మండల నాయకులు కందుకూరు దినేష్, వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సాక్షర భారత్ కోఆర్డినేటర్లను విధుల్లోకి తీసుకోవాలని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేసిన కోఆర్డినేటర్లు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సాక్షర భారత్ మండల గ్రామ కోఆర్డినేటర్లును విధుల్లోకి తీసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని ,రోడ్డు భవనాల మరియు సినిమా ట్రోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మండల సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షులు బుగ్గ బీరప్ప, గ్రామ కోఆర్డినేటర్లు పోలేపల్లి బాల నరసింహ ,మల్లం ధనమ్మ, రొయ్యల రజిత, ధనలక్ష్మి, మాధవి ,సుజాత ,చైతన్య , స్వరూప , తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల మరణాలపై విచారణ వేగవంతం చేయాలి: కొత్తపల్లి ఆనంద్ యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు


ఇటీవల ఆత్మహత్యలకు గురైన మైనర్ విద్యార్థులు భవ్యశ్రీ , వైష్ణవి మరణాల విచారణ వేగవంతం చేసి, కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, బాదిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర లకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ ..ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన కోడి భవ్య శ్రీ , గాదె వైష్ణవి లకు ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ఎక్స్గ్రేషియా వెంటనే ఇప్పించాలని , మరణాలపై ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్ , జిల్లా నాయకులు వేల్పుల యాదమల్లయ్య , వడిచెర్ల కృష్ణ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు ఊదర నరసింహ యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, డేగల అంజయ్య యాదవ్, మూటకొండూరు మండల అధ్యక్షులు మాధరబోయిన నరేష్ , జిల్లా ఉపాధ్యక్షులు రాజు, రాసాల లింగస్వామి, బీబీనగర్ మండల అధ్యక్షులు సాయికుమార్ యాదవ్, వలిగొండ మండల అధ్యక్షులు వనగంటి వెంకటేశ్ యాదవ్ ,రాసాల వినోద్ యాదవ్, బీన బోయిన కుమార్ యాదవ్ , మేకల బాలు యాదవ్ , గుండె బోయిన శంకర్ యాదవ్ పాల్గొన్నారు.

కేర్చిపల్లి గ్రామంలో. గావ్ చలో... బస్తీ చలో అభియాన్


యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు "గావ్ ఛలో బస్తీ ఛలో" అభియాన్ (పల్లెకు పోదాం, వార్డ్ కి పోదాం) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ మరియు పనికి ఆహార పథకం లో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం యువత స్వయం సమృద్ధి చెందాలని ముద్రా లోన్ లు, ద్వారా సబ్సిడీలు అందిస్తుందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీతోనే సాధ్యమని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు ఉంగరాల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు దయ్యాల వెంకటేష్, కందాడి బాల్ రెడ్డి, దయ్యాల పాండు, చిన్నం అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

#

ఈనెల 11న వలిగొండలో ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం


ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ FSCA వలిగొండ ఆధ్వర్యంలో నిర్వహించ బోయే  ఉచిత కంటి వైద్య శిబిరంనకు సంబంధించి కరపత్రాన్ని ఈరోజున   శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించడం జరిగింది

తేదీ 11.2.2024 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు గౌ!!శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి శాసన సభ్యులు గారిచే కంటి వైద్య శిబిరం ప్రారంభించడం జరుగుతుందని రోగులకు అవసరమైన కంటి పరీక్షలు

 ఆనంద్ ఐ ఇనిస్టిట్యూట్ హబ్సిగూడ వారిచే ఉచిత కంటిపరీక్షలు మరియు రోగులకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వబడుతాయని, తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని,

ఇట్టి కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా  FSCA అధ్యక్షులు కొండూరు బాలరాజు కోరారు. ఇట్టి కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుంకోజు భాస్కర్ ,ఐటిపాముల ప్రభాకర్, కొండూరు భాస్కర్,కాసుల వెంకన్న,యానాల సత్యనారాయణ రెడ్డి, కీర్తి రమేష్,ఎల్లంకి మురళి,తదితరులు పాల్గోన్నారు

సంగెం గ్రామంలో గావ్ చలో ... ఘర్ చలో అభియాన్ కార్యక్రమం


 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న టువంటి సంక్షేమ పథకాల గురించి గ్రామంలోని ప్రజలకు విద్యావంతులకు యువతకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో అభియాన్ ఇంచార్జ్ కొప్పుల యాదిరెడ్డి, సీనియర్ నాయకులు. మంద నరసింహ, కందుల తానేష్. బూతు అధ్యక్షులు ఉండాడి జంగయ్య, గంగాపురం నరేష్, తాడూరు మహేందర్, చెక్క ఇస్తారి. గంగాపురం భాస్కర్ తదితర నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గోకారం అంగన్వాడి కేంద్రానికి వస్తువులు బహుకరించిన... బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎలే చంద్రశేఖర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలోని అంగన్వాడి పాఠశాలకు ఆశా వర్కర్లకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎలే చంద్రశేఖర్ పుట్టిన ఊరు మీద ప్రేమతో మమకారంతో 30 వేల రూపాయల తో ఫ్యాను ,వేయింగ్ మిషన్, పిల్లలకు పలుకలు ,అదేవిధంగా ఆశా వర్కర్లకు నిత్యం ఉపయోగపడే వైద్య పరికరములను ,అందజేయడం జరిగినది. అంగన్వాడిలకు ఆశా వర్కర్లకు కావాల్సిన వస్తువులను, తన సొంత నిధులతో బహుకరించారు. కార్యక్రమంలో తుర్కపల్లి సురేందర్, వీరమల్ల బాషయ్య ,పబ్బు రమేష్ ,చెరుకు ప్రేమ్ ,,బైరు మల్లేష్ ,ఎరువ కృష్ణ ,పబ్బు రాము తదితరులు పాల్గొన్నారు.

వెంకిర్యాల లో మహర్షి మోడల్ స్కూల్ లో జాగృతి పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు


యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలోని మహర్షి  మోడల్ హైస్కూల్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ యాదాద్రి భువనగిరి జోన్ , జాగృతి పోలీస్ కళాబృందం గురువారం మూడు గంటలకి అవగాహన సదస్సు నిర్వహించారు . రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి .సుధీర్ మరియు బీబీనగర్ ఎస్సై యుగంధర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి కళా బృందం ఇన్చార్జి బి .కృష్ణ మాట్లాడుతూ.. నేడు స్త్రీలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, గంజాయి, డ్రగ్స్, దొంగతనాల పై సైబర్ నేరాలు ,ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఎస్సీ ,ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగించారు. వేధింపులకు గురయ్యే స్త్రీలు ,విద్యార్థినిలు ధైర్యంగా 100 నెంబర్ కు కాల్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి మల్లేష్ గౌడ్ అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.