సాక్షర భారత్ కోఆర్డినేటర్లను విధుల్లోకి తీసుకోవాలని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేసిన కోఆర్డినేటర్లు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సాక్షర భారత్ మండల గ్రామ కోఆర్డినేటర్లును విధుల్లోకి తీసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని ,రోడ్డు భవనాల మరియు సినిమా ట్రోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మండల సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షులు బుగ్గ బీరప్ప, గ్రామ కోఆర్డినేటర్లు పోలేపల్లి బాల నరసింహ ,మల్లం ధనమ్మ, రొయ్యల రజిత, ధనలక్ష్మి, మాధవి ,సుజాత ,చైతన్య , స్వరూప , తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల మరణాలపై విచారణ వేగవంతం చేయాలి: కొత్తపల్లి ఆనంద్ యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు


ఇటీవల ఆత్మహత్యలకు గురైన మైనర్ విద్యార్థులు భవ్యశ్రీ , వైష్ణవి మరణాల విచారణ వేగవంతం చేసి, కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని, బాదిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర లకు వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ మాట్లాడుతూ ..ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన కోడి భవ్య శ్రీ , గాదె వైష్ణవి లకు ప్రభుత్వం నుంచి రావలసినటువంటి ఎక్స్గ్రేషియా వెంటనే ఇప్పించాలని , మరణాలపై ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు శెట్టి బాలయ్య యాదవ్ , జిల్లా నాయకులు వేల్పుల యాదమల్లయ్య , వడిచెర్ల కృష్ణ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు ఊదర నరసింహ యాదవ్, కడారి మల్లేష్ యాదవ్, డేగల అంజయ్య యాదవ్, మూటకొండూరు మండల అధ్యక్షులు మాధరబోయిన నరేష్ , జిల్లా ఉపాధ్యక్షులు రాజు, రాసాల లింగస్వామి, బీబీనగర్ మండల అధ్యక్షులు సాయికుమార్ యాదవ్, వలిగొండ మండల అధ్యక్షులు వనగంటి వెంకటేశ్ యాదవ్ ,రాసాల వినోద్ యాదవ్, బీన బోయిన కుమార్ యాదవ్ , మేకల బాలు యాదవ్ , గుండె బోయిన శంకర్ యాదవ్ పాల్గొన్నారు.

కేర్చిపల్లి గ్రామంలో. గావ్ చలో... బస్తీ చలో అభియాన్


యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు "గావ్ ఛలో బస్తీ ఛలో" అభియాన్ (పల్లెకు పోదాం, వార్డ్ కి పోదాం) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ మరియు పనికి ఆహార పథకం లో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం యువత స్వయం సమృద్ధి చెందాలని ముద్రా లోన్ లు, ద్వారా సబ్సిడీలు అందిస్తుందని, దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీతోనే సాధ్యమని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు ఉంగరాల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు దయ్యాల వెంకటేష్, కందాడి బాల్ రెడ్డి, దయ్యాల పాండు, చిన్నం అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

#

ఈనెల 11న వలిగొండలో ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం


ఫ్రెండ్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ FSCA వలిగొండ ఆధ్వర్యంలో నిర్వహించ బోయే  ఉచిత కంటి వైద్య శిబిరంనకు సంబంధించి కరపత్రాన్ని ఈరోజున   శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించడం జరిగింది

తేదీ 11.2.2024 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు గౌ!!శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి శాసన సభ్యులు గారిచే కంటి వైద్య శిబిరం ప్రారంభించడం జరుగుతుందని రోగులకు అవసరమైన కంటి పరీక్షలు

 ఆనంద్ ఐ ఇనిస్టిట్యూట్ హబ్సిగూడ వారిచే ఉచిత కంటిపరీక్షలు మరియు రోగులకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వబడుతాయని, తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని,

ఇట్టి కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా  FSCA అధ్యక్షులు కొండూరు బాలరాజు కోరారు. ఇట్టి కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుంకోజు భాస్కర్ ,ఐటిపాముల ప్రభాకర్, కొండూరు భాస్కర్,కాసుల వెంకన్న,యానాల సత్యనారాయణ రెడ్డి, కీర్తి రమేష్,ఎల్లంకి మురళి,తదితరులు పాల్గోన్నారు

సంగెం గ్రామంలో గావ్ చలో ... ఘర్ చలో అభియాన్ కార్యక్రమం


 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న టువంటి సంక్షేమ పథకాల గురించి గ్రామంలోని ప్రజలకు విద్యావంతులకు యువతకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో అభియాన్ ఇంచార్జ్ కొప్పుల యాదిరెడ్డి, సీనియర్ నాయకులు. మంద నరసింహ, కందుల తానేష్. బూతు అధ్యక్షులు ఉండాడి జంగయ్య, గంగాపురం నరేష్, తాడూరు మహేందర్, చెక్క ఇస్తారి. గంగాపురం భాస్కర్ తదితర నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గోకారం అంగన్వాడి కేంద్రానికి వస్తువులు బహుకరించిన... బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎలే చంద్రశేఖర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామంలోని అంగన్వాడి పాఠశాలకు ఆశా వర్కర్లకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎలే చంద్రశేఖర్ పుట్టిన ఊరు మీద ప్రేమతో మమకారంతో 30 వేల రూపాయల తో ఫ్యాను ,వేయింగ్ మిషన్, పిల్లలకు పలుకలు ,అదేవిధంగా ఆశా వర్కర్లకు నిత్యం ఉపయోగపడే వైద్య పరికరములను ,అందజేయడం జరిగినది. అంగన్వాడిలకు ఆశా వర్కర్లకు కావాల్సిన వస్తువులను, తన సొంత నిధులతో బహుకరించారు. కార్యక్రమంలో తుర్కపల్లి సురేందర్, వీరమల్ల బాషయ్య ,పబ్బు రమేష్ ,చెరుకు ప్రేమ్ ,,బైరు మల్లేష్ ,ఎరువ కృష్ణ ,పబ్బు రాము తదితరులు పాల్గొన్నారు.

వెంకిర్యాల లో మహర్షి మోడల్ స్కూల్ లో జాగృతి పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు


యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలోని మహర్షి  మోడల్ హైస్కూల్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ యాదాద్రి భువనగిరి జోన్ , జాగృతి పోలీస్ కళాబృందం గురువారం మూడు గంటలకి అవగాహన సదస్సు నిర్వహించారు . రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి .సుధీర్ మరియు బీబీనగర్ ఎస్సై యుగంధర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి కళా బృందం ఇన్చార్జి బి .కృష్ణ మాట్లాడుతూ.. నేడు స్త్రీలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, గంజాయి, డ్రగ్స్, దొంగతనాల పై సైబర్ నేరాలు ,ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఎస్సీ ,ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగించారు. వేధింపులకు గురయ్యే స్త్రీలు ,విద్యార్థినిలు ధైర్యంగా 100 నెంబర్ కు కాల్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి మల్లేష్ గౌడ్ అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ విధానాలను ప్రతిఘటిద్దాం :ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్


   

కేంద్రలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశంలో కార్మిక, రైతు, సమాన్య ప్రజలను విస్మరించి బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనం కోసం ఎర్ర తివాచీ వేసి పాలన కొనసాగిస్తుంది అని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆరోపించారు.

    గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముద్రించిన సమ్మెకు సంబందించిన గోడ పత్రికలను ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పరెట్ సంస్థల కోసం మోడీ ప్రభుత్వం 2.14 లక్షల కోట్ల బ్యాంకు అప్పులు మాఫీ చేసిందని, 2019నుండి 2022 వరకు 1 శాతం ఉన్న బడా వర్తకుల ఆదాయం 30 శాతం అభివృద్ధి అయంది కానీ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం స్కీమ్ వర్కరల కు కనీసవేతనం 26 వేలు ఇవ్వాలి అని, ఆటో డ్రైవర్లకు జీవనభృతి నెలకు పదివేలు ఇవ్వాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు నెలకు పదివేల వేతనం ఇవ్వాలని, పి. ఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాడ్యుటి, పెన్షన్, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ల పరం చేస్తున్నదని వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలను అమ్ముతున్నదని అన్నారు. కార్మికులు మధ్యతరగతి ప్రజల్లో అత్యధికలు పాలసీధాలుగా ఉన్న ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు దిగబడిందని అన్నారు, సి పి ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ను నియమించకుండా జాప్యం చేస్తుందని అన్నారు.ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించి ప్రతి వ్యక్తికి 200 రోజుల పని 600 రూపాయలు రోజువారి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో సుమారు కోటు మంది పనిచేస్తున్న కేంద్ర స్కీములకు ప్రభుత్వ నిధుల్లో కోత పెట్టిందని కనీస వేతనాలు చెల్లించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని వీటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని అన్నారు.కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ పాలన లో జరిగిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు వలన జరుతున్న నష్టం పై ఫిబ్రవరి 16 న దేశ వ్యప్తంగా సమ్మె లో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మె లో పాల్గొని జయప్రదం చేశాల అందరూ కృషి చెయ్యాలి అని అన్నారు.

    ఈ కారిక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు ఎడ్ల నరేష్, జిన్న కృష్ణ, పాండు, రమేష్, ఉపేందర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.... రక్తదానం చేసిన చిల్లర స్వామి యాదవ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ...కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ,గోపరాజుపల్లి యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి యాదవ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని ,వారి సేవలు ఈ నియోజకవర్గంలో చాలా అవసరమని అన్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని, వారు ఆయురారోగ్యాలతో, భగవంతుని ఆశీస్సులతో, చల్లగా ఉండాలని .. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేష్ రెడ్డి , గోపరాజుపల్లి గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు పులగూర్ల లింగారెడ్డి ,యూత్ అధ్యక్షులు సంగిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 18న ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లను జయప్రదం చేయండి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు


వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ జయప్రదం కోరుతూ.. కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఈ నెల18వ తేదీన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు .అదే విధంగా అధ్యయనం పోరాటం నినాదాన్ని ముందుకు తీసుకుపోతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెన్ను తట్టి వెలికి తీసే విధంగా ప్రోత్సహిస్తు విద్యార్థుల సమస్యల పరిష్కారం కి అనునిత్యం ఉద్యమిస్తు ...విద్యార్థులు చదువుల్లో సైతం ముందుండాలని ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు అగ్రభాగాన నిలబడాలని ఎస్ఎఫ్ఐ గుర్తుచేస్తూ.... త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు మిమ్మల్ని సిద్ధం చేసేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టు పరీక్షలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వేముల జ్యోతిబాస్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మిర్యల శ్రావణ్ కుమార్,జమీల,రూప ఉపాధ్యాయులు,విద్యార్థలు తదితరులు పాల్గొన్నారు