నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 20:50

Bharat Jodo Nyay Yatra: అన్యాయ కాలంలో ఉన్నందునే న్యాయ్ యాత్ర: రాహుల్

దేశంలో అన్యాయ కాలం నడుస్తున్నందునే న్యాయ్ యాత్ర చేపట్టినట్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు..

మణిపూర్‌ (Manipur)లోని ధౌబల్‌లో 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)ను రాహుల్ ఆదివారంనాడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నామని చెప్పారు.

''చాలా మంది న్యాయ్ యాత్ర ఎందుకని అడుగుతున్నారు. అన్యాయ కాలంలో ఉన్నాము కాబట్టే న్యాయ్ యాత్ర చేపడుతున్నాం. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్నివిధాలా అన్యాయాలకు గురవుతున్నారు. న్యాయ్ యాత్రతో ప్రజలందరిని కలిసి నేరుగా కష్టాలను అడిగి తెలుసుకుంటున్నాం'' అని రాహుల్ తెలిపారు.

సిగ్గుచేటు...

మణిపూర్ కొద్దిరోజులుగా హింసతో రగులుతోందని, అయినప్పటికీ ప్రజల కన్నీళ్లు తుడవడానికి దేశ ప్రధాని రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ''2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. దేశంలో పాలన మొత్తం కుప్పకూలిన ఒక ప్రాంతానికి రావడం మాత్రం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్ 29 తర్వాత మణిపూర్ ఎంతమాత్రం మణిపూర్‌లా లేదు. ఎక్కడ చూసినా విద్వేష వ్యాప్తి కనిపించింది. లక్షలాది మంది కగడండ్ల పాలయ్యారు. అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. అయినా ఇంతవరకూ దేశ ప్రధాని వచ్చి ప్రజల కన్నీళ్లను తుడవలేదు. ఇది సిగ్గుచేటు. ప్రధానికి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కు మణిపూర్ భారత్‌లో భాగం కాకపోయి ఉండవచ్చు'' అని రాహుల్ ఆక్షేపించారు..

కోల్పోయిన శాంతిని తిరిగి తెస్తాం..

బీజేపీ రాజకీయాల వల్ల మణిపూర్‌లో కోల్పోయిన శాంతి, సామరస్యాన్ని తిరిగి తీసుకువస్తామని ప్రజలకు రాహుల్ మాట ఇచ్చారు. ప్రజల సాధకబాధకాలు తెలుసుకునేందుకు, శాంతి-సామరస్యాలతో కూడిన న్యూ-విజన్ ఆఫ్ ఇండియాను తెచ్చేందుకు తాము యాత్ర చేపట్టినట్టు చెప్పారు..

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 13:10

బోగీ సంబ‌రాల‌లో జ‌గ‌న్ దంప‌తులు

తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

సాంప్రదాయ దుస్తుల్లో జగన్ దంపతులు భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురా లను మొదలు పెట్టారు.

అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేదపండి తులు సీఎం జగన్‌ దంప తులకు ఆశీర్వాదం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

SB NEWS

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 12:27

వేములవాడ రాజన్నకు కోడె మెక్కు సమర్పించుకున్న మంత్రి పొన్నం

వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ దర్శించు కున్నారు.

ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్నకు కోడె మొక్కు సమర్పించు కున్నారు.

మంత్రి వెంట ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, నాయకులు ఉన్నారు.

SB NEWS

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:49

భోగి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో భోగీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటు న్నారు. ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు తెల్లవారుజామునుంచే భోగీ వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని మందడం గ్రామంలో నిర్వహించిన భోగి సంబరాల్లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్ర ప్రజలకు భోగీ, సంక్రాంతి శుభా కాంక్షలు తెలిపారు

పవన్, చంద్రబాబుతోపాటు టిడిపి, జనసేన నేేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు, పవన్ లు కలిసి భోగి మంటలు అంటించారు.

ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు.. జీవో కాపీ లను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇరు పార్టీల మహిళా నేతలు పాల్గొని ముగ్గులు వేశారు.

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:47

భోగి పండుగ సంబరాల్లో స్టెప్పులతో అదరగొట్టిన అంబటి రాంబాబు



సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నం టాయి. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు.



వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు స్థానికు లతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి హుషారుగా స్టెప్పులు వేశారు.



మంత్రి అంబటి స్టెప్పులు వేసి సందడి చేయడం అక్కడి వారిని అలరించింది. మంత్రి స్టెప్పులకు అక్కడున్న వారంతా పెద్దగా కేరింతలు కొట్టారు.

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:41

నేడు ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ టి20 రెండో సిరీస్

రెండో టి20 సిరీస్ కి భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ 1-0లో నిలిచింది. రెండో టి20లోనూ గెలిచిన సిరీస్‌ను సొంతం చేసుకో వాలనే పట్టుదలతో ఉంది.

మరోవైపు అఫ్గాన్ కూడా విజయమే లక్షంగా పెట్టు కుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం అఫ్గాన్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పాలి.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి చేరికతో భారత్ మరింత బలోపేతంగా మారింది.

సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి ఆడుతున్న తొలి టి20 మ్యాచ్ ఇదే కావడంతో అందరి దృష్టి విరాట్‌పైనే నిలిచింది.ఈ మ్యాచ్‌లో అతను ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

టి20 ప్రపంచకప్‌కు ముందు ఆడుతున్న చివరి టి20 సిరీస్ ఇదే కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత నెలకొంది. రానున్న వరల్డ్‌కప్‌లో కోహ్లి, రోహిత్‌లు ఆడాతారా లేదా అనే సందేహం నెలకొన్న నేపథ్యంలో అనూహ్యంగా ఇద్దరికీ అఫ్గాన్ సిరీస్‌లో చోటు దక్కింది.

ఇది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా తయారైంది. సీనియర్లు రోహిత్, విరాట్‌లు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉంటారనే దానికి వీరి ఎంపికనే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు.

కాగా, తొలి మ్యాచ్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన కెప్టెన్ రోహిత్ ఈసారి మెరుగైన బ్యాటింగ్ కనబరచాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు.

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:38

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భోగీ శుభాకాంక్షలు: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

తెలంగాణ ప్రజలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగీ, సంక్రాంతి, కనుమ ఆనందంగా జరుపుకో వాలని ఆయన ఆకాంక్షిం చారు.

త్వరలోనే తాము ప్రకటిం చిన ఆరు గ్యారంటీ లను వంద శాతం అమలు చేస్తామని తెలిపారు.

ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.

మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు ఆదివారం భోగీ వేడు కలను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాని అన్నారు.,

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:36

సాంప్రదాయ ముసుగులో కోడి పందాలు- జూదం

సంక్రాంతి పండుగ సందడి మొదలైంది.ఈ పండక్కి ప్రతీ యేట సాగే పందాలు మొదలయ్యాయి. ఓ వైపు కోడి పందాలు.. మరోవైపు పేకాట శిబిరాలు వెలిశాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కోడి పందాల్లో పాల్గొని కత్తి కట్టేందుకు ఎంట్రీ ఫీజు సైతం ఏర్పాటు చేయడం హాట్‌ టాఫిక్‌గా మారింది.

భూపాలపల్లి జిల్లా మండలలలో పేరున్న వక్తులు దళారుల అవతార మెత్తారు. అన్నీ తాము చూసుకుంటా మంటూ భరోసా ఇస్తూ అక్రమ దందాకు తెరలేపినట్లు బహిరంగంగా చర్చ సాగుతోంది.

కోడిపందాలతో హోరెత్తుతున్న పల్లెలు

సంక్రాంతి వచ్చిందంటే పట్టణాల్లో నివాసముండే వారంతా పల్లెలకు చేరుకుంటారు. సరదా, టైంపాస్‌ కోసం ఆరాట పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ యేట మాదిరిగానే పేకాట, కోడి పందాలాట సాగుతున్నట్లు తెలుస్తుంది.వీటి నిర్వహణ కోసం ఇప్ప టికే జిల్లాలోని ఆయా గ్రామాల శివారు ప్రాంతాలు, రహస్య ప్రదేశాలను పందెం రాయుళ్లు ఎంచుకొని సిద్ధం చేసుకున్నారు.

పందెంలో పాల్గొనే వారు వేరే వ్యక్తులకు ఆ సమా చారాన్ని ఇవ్వకుండా రహస్యంగా పరుగులు తీస్తున్నట్లు తెలిసింది. గతంలో ఆడే ప్రదేశాలతో పాటు కొత్తగా మరికొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకొని మకాం మార్చి పందాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కోడి పందాల్లో పాల్గొని కత్తి కట్టేందుకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొత్త తరహా పందా లకు కొంత మంది తెర తీసినట్లు ప్రచారం జరుగు తోంది. ఎంట్రీ ఫీజు రూ.200 నుంచి పోటీ అధికంగా ఉండే చోట రూ.500 ఫీజు ఫిక్స్‌ చేసినట్లు తెలిసింది.

ప్రధానంగా కాటారం సబ్‌డివిజన్‌ పరిధిలోని మారుమూల పల్లెల్లో ఈ తతంగం సాగుతున్నట్లు సమాచారం. దళారులుగా రంగంలోకి దిగిన వ్యక్తులు పోలీసులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామనే హామీతో డబ్బులు దండుకుంటున్నట్లు సమాచారం.

అలాగే, పోటీల్లో ఉన్న వారు రూ.1000తో మొదలు పెట్టి రూ.20వేల వరకు కూడా బెట్టింగ్‌ పెట్టేందుకు వెను కాడటం లేనట్లుగా తెలిసింది. మరోవైపు కోడిపందాల సమీప దూరంలోనే పేకాట శిబిరాలను ఏర్పాటు చేసి.. లోన బయట పోటీ జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం.

పేకాట సైతం రూ.10వేలకు పైనే సాగుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఏదైనా ఓ గ్రామంలో పోటీల నిర్వహణ ఉందంటే ఆయా చుట్టు పక్కల గ్రామాల పందెం రాయుళ్లు పోటీ పడి పందెంలో పాల్గొంటున్నట్లు తెలిసింది.

ఇతర సుదూర ప్రాంతాల నుంచి పందెం కోళ్లను రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పెట్టి కొనుగోలు చేసి పోటీలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది....

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:34

నారాయణపేట జిల్లాలో మరో చిరుత మృతి

తెలంగాణలో వరసగా పులులు మరణించడంతో సంచలనం రేపుతుంది. ఇప్పటికే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఫారెస్ట్‌లో రెండు పులులు మృతి చెందగా.. అదృశ్యమైన పులుల్లో ఒకటి శనివారం సాయంత్రం కెమెరా కంటికి చిక్కింది.

అది ప్రాణాలతోనే ఉంది అని ఊపిరి పీల్చుకునే లోపు.. ఇప్పుడు మరో చిరుత ప్రాణాలు వదలటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఈసారి నారాయణపేట జిల్లాలో చిరుత మృతి చెందింది.

దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుత పులులు సంచరించగా.. అందులో ఒకటి మరణించింది. మరో రెండు పారిపోయాయి.

అయితే.. పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతుండ టాన్ని గమనించిన స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జనాల రాకను గమనించిన చిరుత కూనలు రెండు అడవిలోకి పారిపోయాయి.

అనారోగ్యంతో బాధపడు తున్న తల్లి చిరుత మాత్రం నిస్సహాయ స్థితిలో అక్కడ క్కడే తచ్చాడుతూ కనిపించింది. దీంతో.. కొందరు యువకులు పులిని ఫొటోలు, వీడియోలు తీశారు.

పులి అనారోగ్యంగా ఉంది.. ఏమనటం లేదన్న కారణంతో.. మరికొంత మంది యువకులు.. చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

అయితే.. చిరుత ఉన్న ప్రదేశానికి అధికారులు చేరుకునే లోపే చిరుత ప్రాణాలు వదిలింది. చిరుత మృతి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.

చిరుత అనారోగ్యం కారణంగానే మృతి చెందిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా.. చిరుతకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jan 14 2024, 10:31

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర

అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యం లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది.

నిరుద్యోగిత, ధరల పెరుగుదల, సామాజిక న్యా యం వంటి సమస్యలపై ప్రధానం గా దృష్టి సారిస్తూ, లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ యాత్రకు ఉపక్రమించడం పార్టీ యత్నం.

భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాలలో 100 లోక్‌సభ సెగ్మెంట్ల మీదుగా సాగుతుంది. రాహుల్ గాంధీ గతంలో దేశవ్యాప్తంగా సాగించిన యాత్ర మాదిరిగా ఇది ‘పరివర్తన’ యాత్రగా భాసిస్తుందని పార్టీ విశ్వసిస్తున్నది.

పార్లమెంట్‌లో ప్రజల సమస్యల ప్రస్తావనకు ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వనందున భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఉపక్రమి స్తున్నామని కాంగ్రెస్ వివరిం చింది. రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సిద్ధాంతా లను తిరిగి నెలకొల్పడం తమ యాత్ర లక్షమని పార్టీ తెలియ జేసింది.

ఇది ఎన్నికల యాత్ర కాదని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తమ పేలవ ప్రదర్శన దరిమిలా తమ భవిష్యత్తు మెరుగుదలను కోరుతున్నా మని పార్టీ స్పష్టం చేసింది.

ఈ నెల 22 నాటి రామ మందిరం ప్రతిష్ఠాపనపై బిజెపి దృష్టి కేంద్రీకరిస్తుం డడంతో ఈ యాత్ర ద్వారా జీవనోపాధి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది.

మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల అన్యాయ్ కాల్’పై యాత్ర

భారత్ జోడో న్యాయ్ యాత్ర సైద్ధాంతిక యాత్ర అని, ఎన్నికల్లో ఓట్ల సముపార్జన కోసం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

నరేంద్ర మోడీ ప్రభుత్వ పది సంవత్సరాల ‘అన్యాయ్ కాల్’కు వ్యతిరేకంగా యాత్ర చేపడుతున్నామని పార్టీ తెలిపింది.