వైసిపి పార్టీ కీ ఎంపి బాల శౌరి రాజీనామా?

మ‌చిలీప‌ట్నం వైసిపి ఎంపి బాల‌శౌరి ఆ పార్టీకి శనివారం గుడ్ బై చెప్పారు…

తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. సిఎం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండే బాల శౌరికి ఎంపి సీటు మ‌ళ్లీ ఇచ్చే విష‌యంలో ప్ర‌తిష్టం భ‌న ఏర్ప‌డ‌టంతో ఇప్ప‌టికే ఎంపి అల‌క‌బూనారు..

ఇదే స‌మ‌యంలో ఆయ‌న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటి అయ్యారు.. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఆయ‌న‌తో చ‌ర్చించారు.. భేటి సంద‌ర్భంగానే బాల శౌరిని జ‌న‌సేన‌లోకి రావ‌ల‌సిందిగా ప‌వ‌న్ ఆహ్వానించారు..

ఈ నేప‌థ్యంలోనే బాల శౌరి వైసిపికి టాటా చెప్పేశారు.. త్వ‌ర‌లోనే ఆయ‌న జ‌న‌ సేన‌లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం...

తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మకర సంక్రాంతి శుభాకాం క్షలు తెలిపారు.

పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సూర్యుడి కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృ ద్ధి వెలుగులు విరజిమ్మాల న్నారు.

భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండు గలు.. అందరూ ఆనందంగా జరుపుకోవా లని మనసారా ఆకాంక్షించారు.

తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవా లని అన్నారు.

సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు...

ఏపీ డిప్యూటీ సీఎం పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై శనివారం హైదరాబాద్ లో కేసు నమోదైంది.

కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్‌ పోలీస్ స్టేషన్ లో మల్లురవి ఫిర్యాదు చేశారు. దీంతో 3 సెక్షన్ల కింద నారాయణ స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారని మల్లురవి ఆరోపించారు.

ప్రజాసేవకే నా జీవితం అంకితం ... నన్ను వదిలిపెట్టకండి ...!

- మంత్రి పొన్నం ప్రభాకర్ భావోద్వేగం

ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను క్రిబ్కో ఛైర్మన్ బీరేంద్ర సింగ్, ఢిల్లీ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎండీ అనితా రావత్ సన్మానించారు. ఈ క్రమంలో.. ఆనాటి జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగిందని పొన్నం చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యానని తనను ఒదిలేయొద్దని.. తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెం ఎమోషనల్ అయ్యారు.అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాననని.. ఐదేళ్లు ఛైర్మన్‌గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. క్రిబ్కో ప్రోత్సాహం వల్ల ఎంతో ఎదిగానన్నారు. క్రిబ్కో, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 7 వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు.

నిన్ననే లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చా. అందరి కంటే చిన్న వయసులో కో ఆపరేటివ్‌గా పని చేశా. మీ అందరి ప్రేమను పొందాను. మీ ప్రేమ అభినమనాలు నా జీవితంలో మర్చిపోను. ఈసారి మంత్రి అయ్యాను. ఢిల్లీకి రాజయిన తల్లికి కొడుకే కాబట్టి.. మంత్రినయినా మీకు మాత్రం చిన్నోడినే. మీ ప్రేమ అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్న. మంత్రి అయ్యానని నన్ను ఒదిలేయకండి.. నేను మీ తమ్ముడిని. విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన నా ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది." అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Chandrababu: చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు.. తెదేపా నేతల ఆందోళన

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విజయవాడ కనకదుర్గ వారధిపై భద్రతాలోపాలు కనిపించాయి. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్‌ లైట్ మరమ్మతులు చేపట్టారు..

ఆయన పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. వారధిపై వాహనాన్ని అడ్డంగా పెట్టడంపై తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారధిపై ట్రాఫిక్‌ స్తంభించి చంద్రబాబు జెడ్‌ప్లస్‌ వాహన శ్రేణి దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది.

ఎన్‌ఎస్‌జీ కమాండోలు ట్రాఫిక్ క్లియర్‌ చేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు. వంతెనపై విద్యుత్‌ పరికరాల వాహనం అడ్డుపెట్టడంపై ఎన్‌ఎస్‌జీ సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..

ప్రముఖ క్లాసికల్ సింగర్ కన్నుమూత

ప్రముఖ క్లాసికల్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభా ఆత్రే(91) కన్ను మూశారు.

కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను పూణెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

ప్రభా ఆత్రే పద్మశ్రీ (1990), పద్మ భూషణ్ (2002), పద్మ విభూషణ్ (2022) అవార్డులు అందుకు న్నారు...

మంత్రి పొన్నం ప్రభాకర్ తో విక్రమ్ సింగ్ భేటీ

మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ హైదరాబాద్ లో బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో శని వారం భేటీ అయ్యారు.

సోమాజిగూడలోని మంత్రి నివాసంలో విక్రమ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు విక్రమ్ గౌడ్ వెల్లడించారు.

Nara Lokesh: రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరంచాలి.. నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు..

తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని ఆకాంక్షించారు..

సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని కోరారు. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంకల్పమని స్పష్టం చేశారు. భోగభాగ్యాల భోగి, సకల శుభాల సంక్రాంతి, కన్నుల పండువగా కనుమ పండగలు జరుపుకోవాలని సూచించారు..

మరోవైపు.. తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమేనన్నారు..

AP News: ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ..

నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ గెలుపునకు వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చేసేందుకు ప్రణాళికలు రచించారని సమాచారం.

సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. ఆనం, కోటంరెడ్డి భేటీతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్‌ చోటు చేసుకుంది..

చెత్త కుప్పలో శిశువు

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని తెల‌క‌ప‌ల్లి మండ‌లం తాళ్ల‌ప‌ల్లిలో అమాన‌వీయ ఘ‌ట‌న శనివారం చోటు చేసుకుంది.

అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చెత్త‌కుప్ప‌లో ప‌డేశారు. శిశువు ఏడుపును గ‌మ‌నించిన స్థానికులు.. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు, ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

ప్రాణాల‌తో ఉన్న మ‌గ శిశువును పోలీసులు నాగ‌ర్‌క‌ర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం శిశువు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు.

శిశువు త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.