నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా హరిచందన ఐఏఎస్
నల్లగొండ జిల్లాకు కలెక్టర్ గా దాసరి హరిచందన, ఐఏఎస్ ను ప్రభుత్వం నియమించింది. గతంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్ వి కర్ణన్ ఐఏఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ కు డైరెక్టర్ గా బదిలీ చేసింది. ఈయన స్థానంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, ఐఏఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల జిల్లా ఎస్పీగా చందనా దీప్తి, ఐపీఎస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన దాసరి హరిచందన ను జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. నల్లగొండ జిల్లాకు కలెక్టర్ మరియు ఎస్పీ ఇద్దరూ మహిళలు కావడం విశేషం.



 
						




























Jan 03 2024, 21:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.9k