అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి:తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయలక్ష్మి
అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
పి జయలక్ష్మి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచడం ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి కోరారు
మంగళవారం దొడ్డి కొమరయ్య భవన్ ,లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా కమిటీ సమావేశము జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి అధ్యక్షత న జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర ప్రాజెక్టు మీటింగులు సెక్టార్ మీటింగ్లో వలె మండలాల వారిగా జరపడం సరైనది కాదని, గతంలో వలే ప్రాజెక్టు మొత్తం ఒకే రోజు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాజెక్టు మీటింగ్ లకు కనీస వసతులు కల్పించాలని కోరారు. అంగన్వాడీలకు 24 రోజుల సమ్మె కాలం వేతనాలు వెంటనే చెల్లించాలని, రెండో పిఆర్సి , ఐ అర్, అంగన్వాడి ఉద్యోగులకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని, రెండో పిఆర్సి ఫైనల్ చేసేటప్పుడు పేస్కేలు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరారు. రిటర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష ,ఆసరా పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన వారికి విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలన్నారు కనీస వేతనాలు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని తెలిపారు
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపచేయాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరవుతున్న అంగన్వాడీ ఉద్యోగులకు టీఏడీఏలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శ బి పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు అంబటి మణెమ్మ, మణిరూప, ప్రకృతాంబ, సునంద జి రాధాబాయి, రాశిదా ఏ.యాదమ్మ , బి శ్రీదేవి, కే సుదా లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు
నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపు..
హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు.
నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపు.. టూ వీలర్స్‌పై 80 శాతం, త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీ.. కార్లపై 50 శాతం రాయితీ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హెవీ వెహికల్స్‌పై 60 శాతం రాయితీ.. ఈ-చలాన్ ద్వారా చెల్లింపునకు అవకాశం.
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధుల్లో గందరగోళం ...
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు ఈ సారైనా జరుగుతాయో లేదోనని సందిగ్ధంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది. తాజాగా గ్రూప్- 2 పరీక్ష మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీయస్సీ తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్ కు త్వరలో చెక్ పెట్టనున్న కాంగ్రెస్ హై కమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్‌కు చెక్ పెడుతూ స్ట్రాటెజీస్‌కు క్లాప్ కొట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో పవర్ చేజిక్కింది. అంతే వైట్ నాట్ ఏపీ? అంటూ రాహుల్ గాంధీ బెల్ మోగించారు. తెలంగాణ ఎన్నికల టైమ్ నుంచే ఆయన ఇప్పుడు ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్ మాట రీసౌండ్ ఇవ్వడమే కాకుండా ఏపీ కాంగ్రెస్‌లో కదలిక కన్పించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు, బెజవాడలో పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్, ఇలా చాన్నాళ్ల తరువాత ఢిల్లీతో ఫోన్-ఇన్‌ల పర్వం మొదలైంది.
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించనున్న ఏపీ సీఎం జగన్
ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి నల్లపాడు చేరుకుంటారు. అనంతరం.. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. ఏపీలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి.. రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో ఈ క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతోంది.
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ..
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ.. సీఎం హోదాలో తొలిసారి ప్రధానిని కలవనున్న రేవంత్.. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలపై వినతులు.. అలాగే, కాంగ్రెస్ పెద్దలతో భేటీకానున్న రేవంత్, భట్టీ.. నామినేటెడ్ పోస్ట్‌లతో పాటు లోక్‌సభ ఎన్నికలపై చర్చించే అవకాశం.
పార్లమెంట్ ఎన్నికలకు 3 పార్టీల వ్యూహం...
పార్లమెంట్ ఎన్నికలకు 3 పార్టీల వ్యూహం...ఇప్పటికే నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం.. ఈసారి గెలుపు మాదేనంటున్న బీజేపీ.. ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఊపులో కాంగ్రెస్... బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రానివ్వమన్న రాజగోపాల్‌రెడ్డి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని, కేసీఆర్ రిటైర్మెంట్, కేటీఆర్ రిటన్ తప్పదన్న కోమటిరెడ్డి
Dec 26 2023, 17:48