ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించనున్న ఏపీ సీఎం జగన్
ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి నల్లపాడు చేరుకుంటారు. అనంతరం.. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. ఏపీలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి.. రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో ఈ క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతోంది.
Dec 26 2023, 10:10