చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఎండ, ఉక్కపోత కారణంగా అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రిలోని బోధనాస్పత్రి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మికి గురువారం సమాచారం ఇచ్చారు.

వైద్యులను పంపాలని లేఖలో కోరారు. వెంటనే స్పందించిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌.సునీతాదేవి సెంట్రల్‌ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు.

పరీక్షల అనంతరం వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తిరిగి జీజీహెచ్‌కు వెళ్లిపోయారు.వైద్య పరీక్షల్లో వెల్లడైన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు సమాచారం.

సెంట్రల్‌ జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అలర్జీ ఉందని చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అవసరమైన మందులు సూచించినట్టు వెల్లడించారు. వైద్యులు చెప్పిన మందులను చంద్రబాబుకు అందజేసినట్టు చెప్పారు.

చంద్రబాబు ఆరోగ్యానికి డోకా లేదు

చంద్రబాబు చర్మ వ్యాధి బారినపడిన నేపథ్యంలో జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బీపీ 140/80 ఎంఎంహెచ్‌జీ, టెంపరేచర్‌ నార్మల్‌గా ఉందన్నారు.

పల్స్‌ రేట్‌ 87 నిమిషానికి ఉందని, ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు..

రేపు పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌

పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య గురువారంసాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నగరంలోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకీతో పాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మేడ్చల్‌, నల్లగొండ, వరంగల్‌లోని పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు, పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో సేవలు పొందొచ్చని చెప్పారు.

www.passport.gov.inలో దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్స్‌ బుక్‌ చేసుకోవాలని చెప్పారు...

వార్డు సమస్యలపై పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
Streetbuzz News Real time News platform

Cm Jagan: పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ మరోసారి వ్యక్తిగత విమర్శలు..

కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ మరోసారి తన స్థాయి మరిచి వ్యక్తిగత విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో ఈ మేరకు ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

''చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 - 4 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఒకసారి లోకల్‌..

ఇంకోసారి నేషనల్‌.. మరోసారి ఇంటర్నేషనల్‌. ఆడవాళ్లన్నా.. పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా.. పవన్‌కు గౌరవం లేదు'' అని జగన్‌ వ్యాఖ్యానించారు..

దారుణం.. కుటుంబ కలహాలతో అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది గుండ్ల సింగారంలో ఓ కానిస్టేబుల్ తన అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకి శబ్ధం విన్న స్థానికులు కానిస్టేబుల్పై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు..

ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..?

ఆర్థిక లావాదేవీలతో తలెత్తిన విభేదాల కారణంగా ఓ కానిస్టేబుల్‌ తన అత్తను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా గుండ్ల సింగారంలో చోటు చేసుకుంది. మంచిర్యాలకు చెందిన ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా భార్యాపిల్లలు పుట్టింటి వద్దే ఉంటుండగా… ఉదయం ప్రసాద్‌ గుండ్లసింగారం వచ్చాడు.

అత్త కమలమ్మతో మాట్లాడుతున్న క్రమంలో ఎవరూ లేనిది చూసి.. సర్వీస్ రివాల్వర్‌తో ఆమె ఛాతిపైపై కాల్పులు జరిపారు. దీంతో కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. తుపాకీ శబ్దం విని అక్కడికి పరుగులు తీసిన స్థానికులు.. ప్రసాద్‌పై రాళ్లతో దాడి చేసి, తరిమికొట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కమలమ్మ మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్త, అల్లుడికి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం నెలకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు..

సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో టీ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయింది. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి జాబితాను ఓ కొలిక్కి తెచ్చింది. అయినా.. కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోని గాంధీభవన్ ముందు ఆందోళనలకు దిగుతున్నారు.

నాగర్ కర్నూల్‌లో నాగం జనార్ధన్ రెడ్డికే టికెట్ కేటాయించాలంటూ మంగళవారం గాంధీ భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు టీపీసీసీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దానికి తోడు టికెట్ల విషయమై సీనియర్ల మధ్య కూడా పొరపచ్చాలు వచ్చినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం

తెలంగాణ అసెంబ్లీ సీట్ల సర్ధుబాటు, అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన నేతృత్వంలో ఫోర్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్ దక్కని ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించే బాధ్యతలను హైకమాండ్ ఈ ఫోర్ మెన్ కమిటీకి అప్పగించింది.

సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టింది. జానారెడ్డితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, దీపా దాస్ మున్షి, మీనాక్షి నటరాజన్‌లతో ఈ కమిటీని నియమించింది.

ఇవాళ గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన సమావేశమై అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై కమిటీ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన తరువాత అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశావహులు, అసంతృప్తి నేతలను బుజ్జగించకుండా సీట్లు ప్రకటిస్తే నేతల్లో అసంతృప్తి పెరిగి ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

దీంతో అభ్యర్థుల ప్రకటన ముందే జానారెడ్డి ద్వారా అసంతృప్తి చల్లార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది...

రేపటి నుంచే దసరా సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్,SA1,నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి.

ఇక ఫలితాలను స్కూల్స్ పునఃప్రారంభం అయిన తరువాత ప్రకటిస్తారు. జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరాలు సెలవు ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారికి ఈ సెలవులు ఉంటాయి.

ఆ తరువాత రోజు నుంచి యధావిధిగా తరగతులు ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది..

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో ఊరట

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు మంగళవారం హైకోర్టులో ఊరట లభించింది.

ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దానిని మంగళవారం కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు..