తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 12:20

గురి చూసి కొట్టారు

ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.

25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఈశా సింగ్లతో కూడిన టీమ్.. ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలుచుకుంది.

1759 పాయింట్లతో ఈ త్రయం తొలి స్థానాన్ని కైవసం చేసుకుని పసిడి పతకాన్ని ముద్దాడింది. అలా భారత్కు ఈ టీమ్ నాలుగో స్వర్ణ పతకాన్ని అందించింది.

అంతకుముందు జరిగిన రాపిడ్-ఫైర్ సిరీస్‌ను మను 98 పాయింట్లతో ముగించి టాప్ పొజిషన్లో నిలిచింది. ఇక ఈ గేమ్లో ఆతిథ్య చైనా జట్టు 1756తో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, సౌత్ కొరియా షూటర్లు1742 స్కోరు సాధించి మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నారు.

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 12:16

పోలీస్ భారీ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనం

వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టించారు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల శోభాయాత్ర జరగనుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25,694 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన జంక్షన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పారామిలిటరీ బలగాలతో భద్రత నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు.

ప్రతి విగ్రహానికి ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వినియోగించుకోవడానికి అంబులెన్స్‌లను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు...

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 12:10

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్య 

సామాజిక మాధ్యమాల్లో వారి ఫొటోలు వైరల్‌ 

ఆగ్రహంతో నిరసనలకు దిగిన విద్యార్థులు 

హత్యకేసు దర్యాప్తు సీబీఐకి అప్పగింత

అయిదు రోజులపాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత 

ఇంఫాల్‌: జూలై నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారని తెలియడంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతులను హిజం లింథోయింగంబి(17), ఫిజమ్‌ హేమ్‌జిత్‌(20)గా గుర్తించారు. వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 12:06

తెలంగాణలో ఎయిర్ అంబులెన్స్‌లు.. ఆపద సమయంలో అత్యవసర సేవలు..

హైదరాబాద్..

తెలంగాణ పేద రోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌లను ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

Sbnews

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 12:03

ల్యాండర్‌, రోవర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడంతో శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు..

అయినా సానుకూల ఫలితాలు రాలేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు.

ఇస్రో మాజీ అధిపతి ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ల్యాండర్‌, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్‌ ఓ అఖండ విజయమని అభివర్ణించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:59

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: అయిదోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది..

అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణంపై చర్చ జరగనుంది.

వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నారు.

ఇటు శాసన మండలిలోనూ స్కిల్ డెవలప్‌మెంట్‌, విద్య రంగంలో, వైద్య రంగంలో సంస్కరణలపై సబ్యులు చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు నేడే చివరిరోజు. ఈ రోజుతో సమావేశాలు ముగియనున్నాయి..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:55

ఎం పీ నామ నాగేశ్వరరావు నివాసంలో బీఆర్ఎస్ నేతల భేటీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగించుకొని ఢిల్లీ నుంచి ఖమ్మం చేరుకున్న బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం రాత్రి ఖమ్మంలోని తన స్వగృహంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు,తో కలసి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ తో ప్రత్యేకించి భేటీ అయ్యారు.

రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక సమాలోచనలు జరిపారు.

రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సీట్లు గెల్చుకునేందుకు అంతా పట్టుదల, దృఢదీక్ష తో పని చేయాలని ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు వారికి దిశా నిర్దేశం చేశారు.

సునాయాసంగా వైరా సీటును కైవశం చేసుకునేందుకు సమైక్యంగా, చైతన్యవంతమైన భూమిక వహించాలని, అందరూ అన్నదమ్ముల్లా పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని ఈ సందర్భంగా ఎంపీ నామ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ను, పార్టీ నేత, అభ్యర్థి మదన్ లాల్ ను కోరినట్లు సమాచారం......

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:47

నేడు సుప్రీంలో బాబు పిటిషన్ పై విచారణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా , జస్టిస్ ఎస్వీఎన్ భట్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్ ను శనివారం న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు.

దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తీర్పులో పేర్కొంది.

అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకి వర్తించదని హైకోర్టు తెలిపింది. మరోవైపు ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

అయితే సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

నేటి విచారణలో ఇదే అంశంపై ప్రధానంగా వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాతో పాటు మరికొందరు సీనియర్ న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది.

బుధవారం నాటి విచారణలో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత రానుంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 27 2023, 11:44

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది.

నేడు బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం తిరుమల శ్రీవారిని 55,747 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

శ్రీవారికి 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 26 2023, 20:13

ఎనిమిది మంది కూలీలపై పడిన పిడుగు

ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో చోటుచేసుకుంది. ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు అదే గ్రామానికి చెందిన మద్ది వీరయ్యకు చెందిన మిర్చి, పత్తి చేనులో చెత్తను తొలగించేందుకు వెళ్లారు. ఉదయం నుంచి పనులను ప్రారంభించారు. అయితే.. ఉన్నట్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

దాంతో.. వర్షం నుంచి తలదాచుకునేందుకు 8 మంది వ్యవసాయ కూలీలంతా వెళ్లి అక్కడే ఉన్న ఒక వేప చెట్టు కింద నిలబడ్డారు. అదే వారు చేసిన తప్పుగా మిగిలిపోయింది. పెద్ద శబ్ధంతో పిడుగు వ్యవసాయకూలీలు నిలబడ్డ చెట్టుపైనే పడిపోయింది.

దాంతో.. చెట్టుకింద ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకి గురయ్యారు.

ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. మిగతావారికి స్వల్పగాయాలు అయ్యాయి.త తీవ్రంగా గాయపడ్డవారిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. తీవ్రగాయాలపాలైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. పిడుగులు పడుతున్న సందర్భంలో చెట్ల కింద కానీ.. బహిరంగ ప్రదేశాల్లో కానీ ఉండొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Sbnews