తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

వీకెండ్ రానే వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.

నేడు శనివారం 31 కంపార్ట్‌మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న శుక్రవారం 72,650 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి.

4 గంటలకు స్వర్ణ రథంపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.

మైనంపల్లి నేడు ఢిల్లీ పయనం

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తినకు పయనం కానున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి భేటీ కానున్నారని సమాచారం.

శుక్రవారం రాత్రి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరికపై ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరపనున్నారు.

ఈ నెలాఖరులోగా మైనంపల్లి హస్తం గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి. ఈ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలందరూ ఢిల్లీలోనే ఉన్నారు.

దీంతో మైనంపల్లి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అనంతరం కాంగ్రెస్‌లో చేరికపై మైనంపల్లి అధికారికంగా ప్రకటన చేయనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

కూత్బాల్లాపూర్ నుంచి మైనంపల్లికి, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

తండ్రీకొడుకులకు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మైనంపల్లి హస్తం గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది......

నేడు షర్మిల ఢిల్లీ టూర్

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రె్‌సలో వైఎస్సార్టీపీని విలీనం చేయాలని షర్మిల ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా..

ఆమె సేవలను ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై స్పష్టత రావట్లేదు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం.. షర్మిల చేరికను వ్యతిరేకిస్తూ వస్తోంది.

అయితే దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ షర్మిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే షర్మిల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ వారంలోనే కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై స్పష్టత రానున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి....

SB NEWS

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు

రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సందర్భంలో డీఎస్పీల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది.

రానున్న రెండు మూడు రోజుల్లో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఈనెల చివరిలోగా పోలీస్ మరియు రెవెన్యూ శాఖల్లో కొన్ని బదిలీలు జరగనున్నట్లు తెలిసింది......

SB NEWS

SB NEWS

SB NEWS

Sidharth Luthra: సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్‌

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా మరో పోస్ట్‌ పెట్టారు..

'ప్రతి రాత్రి తర్వాత ఉషోదయం ఉంటుంది. అది మన జీవితాల్లోకి కొత్త వెలుగులను మోసుకొస్తుంది' అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

చంద్రబాబు తరఫున హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో లూథ్రా ఈ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రబాబు కేసును వాదిస్తునప్పటి నుంచి లూథ్రా వరుస ట్వీట్లు చేస్తున్నారు.

తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోవద్దన్న స్వామి వివేకానంద వ్యాఖ్యలను ఓ పోస్ట్‌లో ప్రస్తావించారు.

అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైందని, పోరాటమే శరణ్యం అంటూ లూథ్రా చేసిన ట్వీట్‌ కూడా ఆసక్తిని రేకెత్తించింది..

SB NEWS

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నం..

నంద్యాల: తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండు రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేపట్టారు..

నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆమె దీక్షకు దిగారు. ఆమె సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు.

దీంతో పోలీసులు శనివారం వేకువ జామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు.

ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు.

ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు..

SB NEWS

మైనంపల్లి బి ఆర్ ఎస్ కు రాజీనామా

ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు.

అనంతరం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా మైనంపల్లి అలకబూనారు.

తన కొడుకు రోహిత్ రెడ్డికి మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని గుస్సా అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మైనంపల్లి రెండు అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయించింది....

SB NEWS

SB NEWS

. bit.Iy/368vgEt

TS News: నేడు, రేపు విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

పరకాలలో ఫైరింగ్ కలకలం..

హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు..

ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు.

కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్‌లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స‍్పష్టం చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

Rahul Gandhi : రైల్వే కూలీగా రాహుల్ గాంధీ..!

దిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం మాస్‌ లుక్కులో కనిపించారు.

దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌ (Anand Vihar Railway Station)లో కొద్దిసేపు కూలీగా పనిచేశారు..

ఈ సందర్భంగా అక్కడి కూలీలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

రాహుల్‌ తమను కలవాలని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమంలో కోరిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్‌ స్పందించారు.

గురువారం ఆయనే స్వయంగా ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ (Congress) తన అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకొంది.

భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు దీనిని కొనసాగింపుగా అభివర్ణించింది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ రైల్వే కూలీ వలే సామాన్లు మోస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి..