తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 19:16

తిప్పర్తి మండలం లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జనని ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ జన్మదిన వేడుకలు

తిప్పర్తి లో ఘనంగా సుధీర్ జన్మదిన వేడుకలు

తిప్పర్తి మండల కేంద్రంలోని తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జనని ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ జన్మదిన వేడుకలు తిప్పర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి అనంతరం తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతొ కలిసి కేక్ కట్ చేశారు పాఠశాలలో విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు అనంతరం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు

తిప్పర్తి మండలం కేంద్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు కావడంతో మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చి ఘనంగాజన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి. మండల పార్టీ అధ్యక్షులు.జూకూరి రమేష్ .పాదూరి శ్రీనివాస్ రెడ్డి తిప్పర్తి ఎంపిటిసి 1 పల్లె ఎల్లయ్య. రాజుపేట ఎంపీటీసీ బత్తిని మట్టయ్య గౌడ్.

కిషోర్ యాదవ్ బొల్లెద్దు అంబేద్కర్ పిసిసిసోషల్ మీడియా గండమల్ల మనోహర్. పల్లపు వెంకన్న. ఆదిమూలం ప్రశాంత్. తండు సతీష్ గౌడ్ 

ఏపూరి ఆనంద్. మాతంగి శోభన్. ఎస్.కె అలీ. సంజీవ. వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 18:41

బీసీ డిక్లరేషన్ ప్రకటించాలనీ రేవంత్ రెడ్డి కి వినతి పత్రం

బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్ 

న్యూఢిల్లీ: తెలంగాణ రానన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ఢిల్లీ లో టిపిసిసి అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఏనుముల రేవంత్ రెడ్డి

భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు పల్లు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బి సి డిక్లరేషన్ ప్రకటించాలనీ బిసి విద్యార్థి సంఘం నేత వీరబోయిన లింగయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది

అనంతరం రాజ్య సభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ యాదవ్, బీద మస్తాన్ రావు ,మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారూ హాజరై జంతర్ మంతర్ వద్ద పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలని అదేవిధంగా జనగణలో కులగలన చేయాలి చట్టసభల్లో బీసీలకు 55% రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు ప్రత్యేక మంతుతో శాఖ ఏర్పాటు చేయాలలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాధర్న నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో బారి అశోక్, ఈదుల రమేష్ చంద్ర పల్లగొర్ల రాందేవ్ మోడీ అరవిందు తెలుగు రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 18:36

బీఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి

ఈరోజు 55వ డివిజన్ పరిధిలోని భీమారం గ్రామంలో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్ధనపేట శాసనసభ్యులు అరూరి రమేష్ గారి సమక్షంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో 20 మంది పైగా చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది...

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై బి అర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది అని రాబోయే ఎన్నికల్లో వర్ధన్నపేట లో మూడో సారి బీఆర్ఎస్ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త కష్ట పడాలని కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటు వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలిపారు..

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు 

రెనుకుంట్ల యశోద

పెండ్యాల వీనస్ రాజు

సురేష్ రెనుకుంట్ల

సంగాల రాకేష్ 

రామంచ రాజు

భరత్ 

సంగాల విజయ్

సంగాల సనత్ తదితరులు పార్టీలో చేరడం జరిగింది

ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అటికం రవీందర్

జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సంగాల విక్టరీ బాబు, ఎర్రగట్టు గుట్ట దేవస్థాన చైర్మన్ చింతల లక్ష్మన్, 56వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్రోజు మనింద్రనాథ్, PACs చైర్మన్ మెరుగు రాజేష్,55వ డివిజన్ యూత్ అధ్యక్షులు గుంజే సాయి కుమార్

భీమారం గ్రామ శాఖ అధ్యక్షులు రాయికంటి సురేష్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంగాల చిన్న, రాయికంటి సుధాకర్, SC సెల్ అధ్యక్షులు నమిండ్ల రవీందర్, జిల్లా నాయకులు పోగుల రమేష్, గజాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గజాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 16:45

తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం: ఎర్రబెల్లి దయాకర్ రావు

న‌గ‌రంలో రూ.3 కోట్ల వ్య‌యంతో 1040 చ‌ద‌ర‌పు గ‌జాల‌ విస్తీర్ణంలో నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ప్రణాళిళా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ప్రారంభించారు.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సర్వేనెంబర్ 725 ఓపెన్ ల్యాండ్ లో సెంట్రల్ జైలు ఎదురుగా 1014 చదరపు గజాలలో దేవాదాయ శాఖ కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టారు.

నేడు దేవాదాయ శాఖ సమీకృత భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాలుగు అంతస్తులు తో నిర్మించే ఈ భవనంలో మొదటి అంతస్తులో డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ వరంగల్ జోన్ నాలుగవ అంతస్తులోఈ వో శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతుల కార్యాలయాలు ఉంటాయని మంత్రి అన్నారు.

 

భ‌ద్ర‌కాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అంత‌కుముందు వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వ‌ర స్వామి వారిని, భ‌ద్ర‌కాళి అమ్మ‌వారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

అనంత‌రం మంత్రుల‌ను అర్చ‌కులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. ఆల‌య అర్చ‌కులు, ఈవో పూర్ణ‌కుంభంతో వారికి స్వాగ‌తం ప‌లికారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 16:42

కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రజలు కష్టాలు పడ్డారు: మంత్రి కొప్పుల ఈశ్వర్

దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం అని అడగడం ఆ పార్టీ దివాలాతనానికి నిదర్శనమని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. గురువారం ధర్మపురి నియోజకవర్గంలో ని పెగడపల్లి మండలం దీకొండ, ల్యాగలమర్రి, నంచర్ల గ్రామాల్లో మంత్రి పాదయాత్ర నిర్వహించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. 

నంచర్ల గ్రామానికి చెందిన బీజేపీ ఓసీబీ మోర్చా జిల్లా కార్యదర్శి హరిగోపాల్, కాంగ్రెస్ పార్టీ ఐదవ వార్డు సభ్యురాలు చేపూరి ఉమారాణి, 20 మంది కార్యకర్తలు మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నంచర్ల గ్రామాలో మంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పాలనలో రైతులు కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డది నిజం కాదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాలల్లో అధికారంలో ఉంది. అక్కడ రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ముందు అక్కడ అమలు చేసి తెలంగాణలో మాట్లాడాలని హితవు పలికారు.

ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 21 2023, 16:39

తెలంగాణలో జరిగిన అభివృద్ధి కొంతమంది గజినీలకు అర్థం కావడం లేదు: మంత్రి హరీష్ రావు

గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్‌ తీర్చారని మంత్రి హరీశ్‌రావు చేశారు.

60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయాయని అన్నారు. పేదలందరికీ ఉచితంగా మంచినీటిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని కొల్లూరులో గురువారం రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఇండ్లు కట్టడం అంటే అప్పుల్లో కూరుకుపోవడమే అన్నట్లుగా ఉండేదన్నారు. మహిళల కోసం సీఎం కేసీఆర్‌ చాలా పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్‌ కిట్లు ఇస్తే.. ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు తప్ప ఏమీ జరగలేదని గుర్తు చేశారు.

కొల్లూరు టౌన్ షిప్ లో విద్యా వైద్యం రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

 హైదరాబాద్ అభివృద్ధి గురించి రజనీకాంత్ కు అర్థమైంది, కానీ మన దగ్గర ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 20 2023, 19:44

నల్గొండ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి.

నల్గొండ: జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులోని ఇద్దరు మృతి చెందారు..

బైక్‌పై వెళ్తున్న ప్రసాద్‌, అతని భార్య రమణమ్మ, కుమారుడు అవినాష్‌, కారులో ప్రయాణిస్తన్న మల్లికార్జున్‌, మణిపాల్‌ మృతి చెందారు.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు..

Sbnews

Sbnews

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2023, 19:10

మృత్యు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మృత్యు కుటుంబానికి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు,

ఈరోజు ఉదయం పానగల్ ఉదయ సముద్రం చెరువు కట్ట కింద, మార్నింగ్ వాక్, కు, వెళ్లిన, ఓర్సు విష్ణు, వారి సతీమణి, ఓర్సు స్వప్న, గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి నందున, ఇద్దరు మృతి చెందారు,

భువనగిరిపార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిన,లక్ష రూపాయలు నలగొండ కాంగ్రెస్ పార్టీపట్టణ అధ్యక్షులు, గుమ్మల మోహన్ రెడ్డి అందచేశారు.

వారి మృతదేహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోభీమనపల్లి కిషోర్ యాదవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 19 2023, 12:55

నల్గొండ పట్టణంలోని పలు వార్డుల్లోని గణపతి మండపాలను పర్యటించి పూజ మరియు అన్న దాన కార్యక్రమాలల్లో పాల్గొన్న: బిజేపి నాయకులు డా" నాగం వర్షిత్ రెడ్డ

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 18 2023, 20:38

అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్ముతారా? ప్రధానిపై మండిపడిన మంత్రి కేటీఆర్

పార్లమెంట్ అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తు? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఐటీ మంత్రి కే. తారక రామారావు ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటు పైన పార్లమెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం మానేసి, అదే పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, దేశం అంటే రాష్ట్రాల సమాహారం అని ప్రధాని తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏండ్ల తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడేలా ప్రధానమంత్రి పదేపదే తన అక్కస్సును వెళ్లగక్కుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపైన ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా తన గుడ్డి వ్యతిరేకతను వెళ్లగక్కడం ఇప్పటికే అనేకసార్లు చూశామని తెలిపారు. తెలంగాణ సమాజమంతా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ త్యాగాల పునాదులపైన ఏర్పడిందని, అలాంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబురాలు జరగలేదన్న నరేంద్ర మోడీ, చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు.

స్వార్ధ రాజకీయాల కోసం

కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చారిత్రక అంశాల పట్ల ప్రధానమంత్రి సున్నితంగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంబరాలు జరగలేదు అనడం ప్రధానమంత్రి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ఉద్దేశంతో ప్రధానమంత్రి పదేపదే కోట్లాదిమంది తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతో అడుకోవడం మానుకోవాలని, చారిత్రక అంశాల పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ, అర్థం చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రధానమంత్రి ఇలాంటి హోదాల్లో ఉన్న వ్యక్తులకు అత్యంత అవసరమని సూచించారు.

తెలంగాణ అంటేనే గిట్టనట్టు.. పగబట్టినట్టు రాష్ర్ట పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని ప్రధానిని మంత్రి పశ్నించారు. మా దశాబ్దాల కల నెరవేరిన నాడు… అంబరాన్ని అంటిన తెలంగాణ సంబరాలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఆలంపూర్ దాకా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఉత్సవాలు కనిపించలేదా ? అని ప్రధానిని ప్రశ్నించారు. గాంధేయ మార్గంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందనడం ఆత్మగౌరవ పోరాటాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించడమే అని కేటీఆర్ అన్నారు.

ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా

గతంలో తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తారని ప్రధానిపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వడ్లు కొనండని అడిగితే మీ కేంద్రమంత్రి నూకలు బుక్కమని మా రైతుల్ని కించపర్చారని, ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తదా అని కేటీఆర్ అన్నారు. మీలాగే మీ మంత్రులు కూడా తెలంగాణ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, నిధులు మూటలు ఎట్లాగూ మా రాష్ట్రానికి ఇవ్వని ప్రధాని, కనీసం..మాటల్లోనైనా మర్యాద చూపించాలని మంత్రి సూచించారు.

కోటి ఆశలు.. ఆకాంక్షలతో పురుడుపోసుకొన్న కొత్త రాష్ట్రానికి సహకరించక పోగా..ఆదినుంచి కక్షను పెంచుకొని.. ప్రధాని వివక్షనే చూపిస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఏడు మండలాలు గుంజుకొని ..లోయర్ సీలేరు ప్రాజెక్టును లాక్కొని పురిట్లోనే మీరు చేసిన తొలిద్రోహాన్ని తెలంగాణ మర్చిపొదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. నీతి ఆయోగ్‌ చెప్పినా నీతి లేకుండా మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథలకు నిధులను నిరాకరించిన కేంద్రం వైఖరి తెలంగాణ ప్రజలకు గుర్తుండిపొతుందని మంత్రి అన్నారు.

దశాబ్దాల కల కల్లలు

కృష్ణాలో నీటి వాటాలు తేల్చకుండా పదేండ్లుగా దక్షిణ తెలంగాణ రైతుల్ని దగాచేస్తున్న మీ పగను ఎట్లా అర్థం చేసుకోవాలని కేంద్రాన్ని మంత్రి నిలదేశారు. కాజీపేట కోచ్‌ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని తెలంగాణ క్షమించదని స్పష్టం చేశారు. 157 మెడికల్ కాలేజీల్లో.. ఒక్కటి ఇవ్వకుండా గుండుసున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో తెలుసునని అన్నారు. పైన అప్పర్ భద్ర.. కింద పోలవరం.. ఇంకెక్కడో కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు చూపారో మీ గుడ్డి వ్యతిరేకత చూస్తే అర్ధం అవతుందని కేటీఆర్ చెప్పారు.

బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి..గిరిజన వర్సిటీని పక్కన పెట్టి, సింగరేణి బొగ్గుబావుల్ని వేలం వేసి, ఐటీఐఆర్‌ను రద్దు చేసి, హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ తరలించి అడుగడుగునా తెలంగాణ ప్రగతికి అడ్డంకులు కల్పించారని మంత్రి తెలిపారు. ఒక వైపు నిధులివ్వరు… సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధించిన తీరుని కేటిఅర్ గుర్తు చేశారు. తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే పగతో జుమ్లా.. హమ్లాలు చేసే డబుల్ ఇంజన్‌ సర్కారు మీది అని మంత్రి అన్నారు. ఈడీ.. ఐటీ.. సీబీఐ లాంటి వేటకుక్కలతో ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకున్న ప్రధాని, ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్పడం విచిత్రం అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

తెలంగాణపై వ్యతిరేకత భావంతో ఉన్న మీరు డబుల్ ఇంజన్‌ నినాదంతో ఊదరగొట్టినా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని మంత్రి స్పష్టం చేశారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి, ఇక్కడ పుట్టగతులు ఉండవని తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.