ఎర్రజెండాలతో చండూరు నడిబొడ్డున నిరసన
నల్లగొండ జిల్లా:
చండూర్: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ఫై వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు. రాజ్యాంగ సంస్థలైన ఈ డి, సి బి సి, ఐడి, ఎన్నికల కమిషన్, పార్లమెంటరీ కోర్టులను తమ జేబు సంస్థలుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని వారు అన్నారు. పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం.. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనే నినాదంతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఏటా కోటి ఉద్యోగాలన్న మోడీ ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ద్వసం చేశారన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రుణ మాఫీ తో సహా వడ్డీ మాఫీ చేయాలని, గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న నిరుపేదలను ఆదుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సైదులు,ఉపాధ్యక్షులు నల్లగంటి లింగ స్వామి, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Sep 08 2023, 13:40