మాలలకు అన్ని రంగాలలో స్థానం దక్కాలి: మాల జేఏసి నాయకులు
నల్లగొండ జిల్లా స్థాయి మాల మహానాడు చైతన్య సదస్సు బుధవారం దేవరకొండ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో, మాలమహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జెఎసి చీఫ్ అడవైజర్ రావుల అంజయ్య, మాల సంఘాల జేఏసీ చైర్మన్ చేరుకు రాoచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, చీఫ్
కోఆర్డినేటర్ మందాల భాస్కర్, లీగల్ సెల్ చెర్మెన్ అడ్వకేట్ వేణుగోపాల్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో 50 లక్షల మాలల జనాభా ఉన్నా.. వారికి జనాభా దామాష ప్రకారం అన్ని రంగాలలో వాటా దక్కడం లేదన్నారు. రాష్ట్రంలోని మాలలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెల్లే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలన్నారు. మాలలకు దక్కాల్సినటువంటి వాటాలు జనాభా ప్రాతిపదికన ఆర్థిక, రాజకీయ, సాంఘిక సంక్షేమ రంగాలలో మాలలకు రావాల్సిందే అని అన్నారు.
దళిత బందులో 50% వాటా మాలలకు మాల ఉప కులాలకు తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వాలని అన్నారు. అదేవిదంగా హైకోర్టు నియామకాల్లో మాలలకు రావాల్సిన పదవులలో కూడా అన్యాయం జరుగుతుందని అన్నారు. కాబట్టి మాలలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రాజకీయ పదవులలో మాలలకు అన్యాయం జరుగుతుందని, మాలలకు 3 ఎమ్మెల్సీ పదవులు దక్కాలన్నారు. రాబోయే కాలంలో మాలలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ గడ్డం సత్యనారయణ, జేఏసీ కో చైర్మన్ బరిగిల వెంకటస్వామి, జేఏసీ వైస్ చైర్మన్ నాను , బహుజన మేధావి, అంభేద్కరిస్టు యేకుల రాజారావు , జిహెచ్ఎంసి చైర్మన్ ఉత్తం సుమన్, చిక్కుడు అండాలు, శీలం స్వరూప, జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, భూతం అర్జున్, ఆకుల రమేష్, గీత, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు యేకుల సురేష్, నియోజకవర్గం అధ్యక్షుడు బోయిని చంద్రమౌళి, న్యాయవాది నూనె సురేష్, డివిజన్ కార్యదర్శి మేడ సైదులు, కోరెక్క చెన్నయ్య, పెరుమల్ల వినోద్, కోరే గిరి, వివిధ మండలాల అధ్యక్షులు బత్తుల దివాకర్, నారిమల్ల మల్లేష్, రెడ్డిమల్ల రవి,జి. ఆంజనేయులు, బిరేల్లి మహేందర్, తుప్పరి మదార్, గోరెటి ఆంజనేయులు, గేంటల ధనమ్మ, యేకుల అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.
Jul 05 2023, 23:07