మాలలకు అన్ని రంగాలలో స్థానం దక్కాలి: మాల జేఏసి నాయకులు
నల్లగొండ జిల్లా స్థాయి మాల మహానాడు చైతన్య సదస్సు బుధవారం దేవరకొండ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో, మాలమహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జెఎసి చీఫ్ అడవైజర్ రావుల అంజయ్య, మాల సంఘాల జేఏసీ చైర్మన్ చేరుకు రాoచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, చీఫ్ కోఆర్డినేటర్ మందాల భాస్కర్, లీగల్ సెల్ చెర్మెన్ అడ్వకేట్ వేణుగోపాల్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో 50 లక్షల మాలల జనాభా ఉన్నా.. వారికి జనాభా దామాష ప్రకారం అన్ని రంగాలలో వాటా దక్కడం లేదన్నారు. రాష్ట్రంలోని మాలలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెల్లే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలన్నారు.  మాలలకు దక్కాల్సినటువంటి వాటాలు జనాభా ప్రాతిపదికన ఆర్థిక, రాజకీయ, సాంఘిక సంక్షేమ రంగాలలో మాలలకు రావాల్సిందే అని అన్నారు. దళిత బందులో 50% వాటా మాలలకు మాల ఉప కులాలకు తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వాలని అన్నారు. అదేవిదంగా హైకోర్టు నియామకాల్లో మాలలకు రావాల్సిన పదవులలో కూడా అన్యాయం జరుగుతుందని అన్నారు. కాబట్టి మాలలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రాజకీయ  పదవులలో మాలలకు అన్యాయం జరుగుతుందని, మాలలకు 3 ఎమ్మెల్సీ పదవులు దక్కాలన్నారు. రాబోయే కాలంలో మాలలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ గడ్డం సత్యనారయణ, జేఏసీ కో చైర్మన్ బరిగిల వెంకటస్వామి, జేఏసీ వైస్ చైర్మన్ నాను , బహుజన మేధావి, అంభేద్కరిస్టు యేకుల రాజారావు , జిహెచ్ఎంసి చైర్మన్ ఉత్తం సుమన్,  చిక్కుడు అండాలు, శీలం స్వరూప, జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, భూతం అర్జున్, ఆకుల రమేష్, గీత, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు యేకుల సురేష్, నియోజకవర్గం అధ్యక్షుడు బోయిని చంద్రమౌళి, న్యాయవాది నూనె సురేష్, డివిజన్ కార్యదర్శి మేడ సైదులు, కోరెక్క చెన్నయ్య, పెరుమల్ల వినోద్, కోరే గిరి, వివిధ మండలాల అధ్యక్షులు బత్తుల దివాకర్, నారిమల్ల మల్లేష్, రెడ్డిమల్ల రవి,జి. ఆంజనేయులు, బిరేల్లి మహేందర్, తుప్పరి మదార్, గోరెటి ఆంజనేయులు, గేంటల ధనమ్మ, యేకుల అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.
జులై 5న నల్లగొండ జిల్లా స్థాయి మాలల ఆత్మీయ చైతన్య సదస్సు
దేవరకొండ: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్రంధాలయంలో, మాలమహానాడు డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్ మరియు నియోజకవర్గ అధ్యక్షులు బోయిని చంద్రమౌళి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యఅతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి పాల్గొని మాట్లాడుతూ.. మొదటి జిల్లాస్థాయి మాల ఆత్మీయ చైతన్య సదస్సు దేవరకొండ పట్టణంలో జులై 5 బుధవారం ఉదయం 10 గంటల కి నిర్వహిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక, రాజకీయ, సామాజిక, సంక్షేమ రంగాలలో మాలలు చైతన్య పరచడమే ఈ సమావేశం ముఖ్యఉద్దేశం అన్నారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కోకన్వీనర్ డాక్టర్ చిక్కుడు గుండాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని మాల సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. కావున నల్గొండ జిల్లాలోని అన్ని డివిజన్, అన్ని నియోజకవర్గ అన్ని మండల, అన్ని గ్రామాల మాలలందరూ తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో ప్రముఖ అంబేద్కరిస్ట్, బహుజనవాది డాక్టర్ యేకుల రాజారావు, నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నాగటి జోసెఫ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, దేవరకొండ డివిజన్ సైదులు డివిజన్ ఉపాధ్యక్షులు కోరెక్క  చేన్నయ్య, చలచిమల పర్వతాలు, బత్తుల వినోద్,  రెడ్డి మల్ల, గోకమల్ల ఆంజనేయులు, భయ్యా తిరుమలేష్, మేకల చెన్నయ్య, యేకుల అంబేద్కర్  తదితరులు పాల్గొన్నారు.
దారి తప్పిన డిండి మండలం వృద్ధురాలు
నల్లగొండ జిల్లా, డిండి  మండలం వెంకటాపూర్, తవక్లాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 80 సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధురాలు దారితప్పి.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం కోనాపూర్ గ్రామానికి వచ్చినట్లు,  కోనాపూర్ గ్రామస్తులు శనివారం తెలిపారు. తనది డిండి  మండలం వెంకటాపూర్, తవక్లాపూర్ గ్రామం అని ఆ వృద్ధురాలు చెబుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మూడు రోజులుగా గ్రామంలో తిరుగుతుందని, ఎవరైనా గుర్తిస్తే కోనాపూర్ కు వచ్చి తీసుకువెళ్లాలని కోనాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.
ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ పాక నగేష్ యాదవ్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: లెంకలపల్లి గ్రామంలో హరితహారం లో భాగంగా, ఈరోజు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, గ్రామస్తులు నూనె నరసింహ, పెంబళ్ళ మల్లమ్మ, పెంబళ్ళ సోమయ్య, యాదయ్య, నాగమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది  నరసింహ, జయమ్మ పాల్గొన్నారు.
లెంకలపల్లి: ఈత వనాన్ని సందర్శించిన పల్లె రవికుమార్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: లెంకలపల్లి గ్రామానికి  తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ఆదివారం విచ్చేసి, గ్రామంలో ఉన్న ఈత చెట్ల వనాన్ని సందర్శించారు. అక్కడ కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో చెరుకు లింగం గౌడ్, అయితగోని వెంకటయ్య, కలిమెర రాములు, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య, లెంకపల్లి గ్రామ కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు అయితగోని పాపయ్య, ఉపాధ్యక్షుడు బోడ అంజయ్య, కార్యదర్శి అయితగోని మల్లయ్య, దాసరి చిన్న నరసింహ, కారింగు నరసింహ, బుర్కల లక్ష్మయ్య, అయితగోని రామచంద్రం, కలిమెర బాలయ్య, కలిమెర అంజయ్య, కలిమెర పెద్ద రాములు, పల్లె వెంకటేశం, అయితగోని తిరుపతయ్య,  అయితగోని యాదయ్య, అయితగోని శ్రీకాంత్, బుర్కల చిన్న రామలింగం, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం క్రింద ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి, నేటికీ అమలు చేయలేదని అన్నారు. అర్హులైన నిరుపేద లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని,  గ్రామీణ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకునే పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు,  పట్టణ ప్రాంతంలో పది లక్షల రూపాయలు ఇవ్వాలని వారన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు  కేటాయించకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ప్రజా సంఘాల నాయకులు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూతల వెంకటయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు కొట్టం యాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నీలకంఠం రాములు, సొప్పరి హనుమంతు, నందిపాటి సుగుణమ్మ, కాసుల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
దేవరకొండలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే
నల్లగొండ జిల్లా, దేవరకొండ: నేడు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాములు నాయక్ ను,  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ ప్రజలకు అందిస్తున్న సేవలు విలువైనవని, అనారోగ్య పరిస్థితులలో పునర్జన్మ ప్రసాదించే దైవంతో డాక్టర్లు సమానమని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి వెంకటయ్య, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న,  మాజీ కౌన్సిలర్ సుగుణయ్య, రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.
అనాధ ఆశ్రమంలో ఘనంగా పగడాల ఫౌండేషన్ చైర్మన్ ముత్తు పుట్టినరోజు వేడుకలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మాల్ పట్టణం లోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు, తన పుట్టినరోజు సందర్భంగా.. ఈరోజు వారి కార్యాలయం ముందు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముత్తు మాట్లాడుతూ.. పేదలకు వైద్య సహాయం అందించి సహాయ పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పలువురు రక్తదానం చేశారు. మండలంలోని గ్రామ భారతి అనాధాశ్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముత్తు, తన పుట్టినరోజు వేడుకలను అనాధ బాలల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలురు లకు తినిపించారు.
అనాధ ఆశ్రమంలో ఘనంగా పగడాల ఫౌండేషన్ చైర్మన్ 'ముత్తు' పుట్టినరోజు వేడుకలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు తన పుట్టినరోజు సందర్భంగా.. ఈరోజు వారి కార్యాలయం ముందు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముత్తు మాట్లాడుతూ.. పేదలకు వైద్య సహాయం అందించి సహాయ పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పలువురు రక్తదానం చేశారు. మండలంలోని గ్రామ భారతి అనాధాశ్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముత్తు, తన పుట్టినరోజు వేడుకలను అనాధ బాలల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాలురు లకు తినిపించారు.
బాల కార్మికులను గుర్తిస్తే 1098 కు సమాచారం అందించండి: ఎస్పీ
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో  జూలై 1 నుండి నెల రోజుల వరకు నిర్వహించే, ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులతో  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురౌవుతున్న బాలబాలికలను  గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని  అన్నారు.  ఈ జూలై 1వ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా  ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో మూడు సబ్ డివిజన్లో  పోలీస్, లేబర్, చైల్డ్ కేర్, రెవెన్యూ, హెల్త్, ఐసిడిఎస్, శిశు సంక్షేమం అధికారులతో సమన్వయంగా కలిసి బృందంగా ఏర్పడి, తప్పి పోయిన బాల బాలికలను గుర్తించుట, పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు  ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే అలాంటి వారిని గుర్తించి సంభందిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అపూర్వరావు హెచ్చరించారు.
      
నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్నచో పోలీసులకు, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరినారు. ఇలాంటి పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందిని అన్నారు. ఎక్కడైనా బాలకార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని  తెలిపారు.
    
ఈ సమావేశంలో డిడబ్ల్యుఓ కృష్ణవేణి,
డిసిపివో గణేష్, సి డబ్ల్యూ సి చైర్మన్ కృష్ణ , నల్గొండ , మిర్యాలగూడ, దేవరకొండ  లేబర్ ఆఫీసర్లు, చైల్డ్ లైన్ ఆంజనేయులు , ఏహెచ్టియు ఎస్ఐ గోపాల్ రావు మరియు మిగతా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.