ఈ నెల 27న ఛలో ఈ.ఎన్.సి కార్యలయం: పల్లా దేవేందర్ రెడ్డి పిలుపు
నల్లగొండ జిల్లా, పానగల్: మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈ ఎన్ సి కార్యాలయం ముందు జరిగే ధర్నాను, జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్మికులు సుమారు 16 వేల మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికి త్రాగునీరు ఇవ్వాలనే మిషన్ భగీరథ విజయవంతం కావడానికి కార్మికులు తీవ్ర శ్రమ చేస్తున్నప్పటికీ వారి శ్రమకు తగ్గ వేతనాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్లు ఇవ్వకుండా కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని దేవేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక ఆద్వర్యంలో ఈ నెల 27 ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇఎన్‌సి) కార్యాలయం, ఎర్రమంజిల్, హైదరాబాద్ వద్ద తలపెట్టిన ముట్టడి కార్యక్రమం సందర్భంగా, నల్లగొండలోని పానగల్ వాటర్ ప్లాంట్ వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు, మిషన్ భగీరథ పేరుతో పథకాన్ని ప్రారంభించటం జరిగిందని, దీని అమలుకు పెద్ద కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులను ఇవ్వటం జరిగిందని, ఈ కాంట్రాక్టర్లు కార్మికుల శ్రమను దోచుకొంటూ అతి తక్కువ జీతాలు ఇస్తున్నప్పటికీ, కనీస వేతనాలు, కార్మిక హక్కులు అమలు కాకున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శోద్యం చూస్తున్నారని వారు విమర్శించారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం.60 ని విడుదల చేసి స్కిల్డ్ కార్మికులకు రూ.22,750/-, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.19,500/-, అన్ స్కిల్డ్ కార్మికులకు రూ.15,600/-, అమలు చేస్తున్నప్పటికీ మిషన్ భగీరథలో మాత్రం కాంట్రాక్టర్లు కన్‌ష్ట్రక్షన్ పేరుతో కార్మికులకు అన్యాయం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు నిర్వహించినా, లేబర్ అధికారుల వద్ద కాంట్రాక్టర్లు కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి వాటిని అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని వారు అన్నారు.
అధికారులు, కాంట్రాక్టుర్లు, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 27న ఇ.ఎన్.సి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా నుంచి మిషన్ భగీరథ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి.కృష్ణ ,ప్రధాన కార్యదర్శి ఎం డి జానీ,పాక శ్రీను, ఎన్. నరేందర్, సర్దార్, దయాకర్, ఎడ్ల లింగయ్య, ఎం యాదమ్మ , మంగ, శ్రీనివాస్ రెడ్డి, అజీముద్దీన్, నాగరాజు, విజయ్, మహేష్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

   నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ  కళాశాల నందు బుధవారం  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని,  జాతీయ సేవా పథకం మరియు వ్యాయామ విద్యా విభాగం ల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. నిత్య యోగ సాధన ద్వార సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో యోగా ట్రైనర్ ప్రత్యూష.. విద్యార్థులకు అధ్యాపకులకు యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వివిధ రకాల యోగా ఆసనాలను వేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ మునీర్, అకాడమిక్ కోఆర్డినేటర్ వి. శ్రీనివాసులు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు ఈ. యాదగిరి రెడ్డి, ఎం. వెంకట్ రెడ్డి, డాక్టర్ ఎస్. యాదగిరి, డాక్టర్ భాగ్యలక్ష్మి, కే. శివరాణి, ఫిజికల్ డైరెక్టర్ కే. మల్లేష్, లైబ్రేరియన్ డాక్టర్ ఏ. దుర్గాప్రసాద్ మరియు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్సిసి క్యాడెట్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

   తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో సర్పంచ్ పాక నగేష్ అధ్యక్షతన నిర్వహించిన విద్యా దినోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ముఖ్యఅతిథిగా విచ్చేసి, మన ఊరు మనబడి కార్యక్రమం కింద రూ. 32.78 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, మాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జగన్, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, భీమనపల్లి ఎంపీటీసీ విష్ణు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఏపీఎం హరి, హెడ్మాస్టర్ యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చంద్రారెడ్డి- మమత ల  కుమారుడు వై. కౌశిక్ రెడ్డి, జాతీయస్థాయిలో 515 ర్యాంక్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. హైదరాబాదు వనస్థలిపురం నారాయణ కళాశాలలో చదివినట్లు ర్యాంకు సాధించిన విద్యార్థి తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు, భీమనపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు కౌశిక్ రెడ్డి ప్రతిభ పై అభినందన వర్షం కురిపిస్తున్నారు.

 నల్లగొండ జిల్లా: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని ఒకేసారి మాఫీ చేయాలని, వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, మర్రిగూడ మండల కేంద్రంలో మండల తాహశీల్దార్ వెంకటేశ్వర్లు కు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య  మాట్లాడుతూ.. 2023 ఖరీఫ్ సీజన్ మొదలవుతుందని, రుణమాఫీ చేసి వెంటనే రైతులకు రుణాలు ఇవ్వాలని అన్నారు. మర్రిగూడ మండల రైతు సంఘం అధ్యక్షులు కొట్టం యాదయ్య, కార్యదర్శి ఉప్పునూతల వెంకటయ్య, రైతు మేకల రాంరెడ్డి పాల్గొన్నారు.

 నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్లో, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా గురువారం నాడు  'ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు, చేపలతో వండిన ఆహార పదార్థాలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వివిధ వండిన చేపల కర్రీ ప్యాకులు వివిధ రేట్లలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు కళాకారులు తమ కళా ప్రదర్శనలు చేశారు. స్థానిక ప్రజలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 కుటుంబాలని పరామర్శించాలని ఒక ప్రకటన కోరారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా రైల్వే శాఖలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, క్షతగాత్రులకు రూ. 30 లక్షలు అందజేయాలని ధనంజయ్ డిమాండ్ చేశారు.

   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, ఈరోజు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి, ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం  రైతులకు అందిస్తున్న  రైతు సంక్షేమ పథకాల గురించి అధికారులు వివరించారు, మరియు వాటిని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. తదుపరి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, డిప్యూటీ తహశీల్దార్ తారకరామన్, ఎంపీఓ ఝాన్సీ, ఏఈఓ సుజాత,  గ్రామపంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Jun 26 2023, 19:10
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.7k