లెంకలపల్లి: ఘనంగా రైతు దినోత్సవం
 
   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, ఈరోజు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో, రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి, ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం  రైతులకు అందిస్తున్న  రైతు సంక్షేమ పథకాల గురించి అధికారులు వివరించారు, మరియు వాటిని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. తదుపరి సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, డిప్యూటీ తహశీల్దార్ తారకరామన్, ఎంపీఓ ఝాన్సీ, ఏఈఓ సుజాత,  గ్రామపంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Jun 17 2023, 16:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.1k