నిజంనిప్పులాంటిది

Jun 10 2023, 09:15

రైల్వే అధికారుల్లారా ఇది నీకు న్యాయమేనా ❓️

వలస కూలీలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, పేదలు ప్రయాణించే జనరల్ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలంటే రైల్వేశాఖకు లెక్కే లేదు. అన్ని రైళ్లల్లో స్లీపర్ బోగీలు తగ్గించి ఏసీ బోగీలు పెంచాలనే లక్ష్యాన్ని రైల్వే నిర్ధేశించుకుంది.

ఏదో ఉంచామంటే ఉంచాం అనే రీతిలో మొక్కుబడిగా ఒకటి లేదంటే రెండు బోగీలనే రైలుకు ఉంచుతోంది. దీనివల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎంతో కష్టనష్టాలకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుంది. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయడమే కానీ తమదగ్గర ఏమీలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని జనరల్‌ బోగీల్లో ప్రయాణం చేయాలంటే ప్రజలకు ప్రత్యక నరకంలా మారింది. రిజర్వేషన్‌ లేకుండా సాధారణ టిక్కెట్‌ తీసుకొని ప్రయాణించాలనుకునే వారంతా ఈ రెండు బోగీల్లోనే సర్దుకోవాల్సి ఉంటుంది.

రద్దీని తట్టుకోలేక బాత్ రూమ్ లో కూడా నిలబడి ప్రయాణిస్తున్నారు.

రైళ్లల్లో గతంలో ఉన్న స్లీపర్ బోగీలను తగ్గించి వాటిస్థానంలో ఏసీ బోగీలను క్రమంగా పెంచుతున్నారు. దీనివల్ల స్లీపర్ లో బెర్త్ దొరకడం గగనంగా మారింది. చివరకు బాత్రూంలు కూడా ప్రయాణికుల కు జనరల్ బోగీల్లా మారాయి...

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 21:22

జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయించిన పరమ నీచులు

నిర్మల్ జిల్లా:జూన్ 09

కేటుగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి.. జింక మాంసమంటూ విక్రయించడం స్థానికంగా కలకలం రేగింది.

మేక మాంసం అయితే గుర్తుపడతారు. గోర్రె మాంసం అయితే తెలిసిపోతుంది. ఇంకేదైనా కొత్త జంతువు అయితే జనాలను బోల్తా కొట్టించవచ్చునని ఇద్దరు మోసగాళ్లు అనుకున్నారు. అప్పుడే వారి కన్ను కుక్కపై పడింది. వీధి కుక్క కంటే పెంపుడు కుక్క అయితే బెటర్ అనుకున్నారు. ఇంకేం పెంపుడు కుక్కను దొంగిలించారు. లక్ష్మణ్‌చందానగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను పొట్టెపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాస్, వరుణ్ దొంగిలించారు. గుట్టుచప్పుడు కాకుండా చంపేశారు. పథకం పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లో జింక మాంసం అని చెప్పి అమ్మారు. చుట్టూ అడవులు ఉండే సరికి నిజంగానే జింక మాంసం అనుకుని చాలా మంది కొనుక్కున్నారు.

అయితే కుక్క యజమాని ఫిర్యాదుతో వారి బాగోతం బయటపడింది. పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు కుక్కను అపహరించినట్లు గుర్తించారు, నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు. మరోవైపు కుక్క మాంసం తిన్నవాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు...

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 20:51

CM KCR: వారందరికీ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ 4వేలకు పెంపు..

మంచిర్యాల : సీఎం కేసీఆర్‌ మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కొత్త కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు..

అనంతరం, సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని వికలాంగులకు శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

కాగా, మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి. తెలంగాణ వచ్చి పదేళ్లు అయ్యింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్ కూడా పెంచబోతున్నాం. ఆసరా పెన్షన్లతో అందరూ బాగున్నారు. వికలాంగులకు ప్రస్తుతం రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నాం. వారికి మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్‌లో పెట్టాను. వచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్ అందుతుంది. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 20:49

కొండ దిగని కోడి

కోడి మాంసంతో భోజనాన్ని లొట్టలేసుకుని ఆరగించే మాంసాహార ప్రియులకు చికెన్‌ ధరలు మింగుడుపడడం లేదు. ప్రస్తుతం కోడి ధర కొండెక్కి కూర్చుంది. ఎండలు మండిపోతుండడంతో చికెన్‌ తినే వారి సంఖ్య తగ్గుతుంది, చికెన్‌కు అంతగా డిమాండ్‌ ఉండదులే అనుకుంటే పొరపాటే. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ ధరలు భగ్గుమంటున్నాయి. కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ.300 పలుకుతుండడంతో కోడి మాంసం ప్రియులు అవాక్కవుతున్నారు. పది రోజుల కిందటి వరకు కిలో చికెన్‌ రూ.220 నుంచి రూ.240 ఉండగా ఇప్పుడు అది స్కిన్‌ లెస్‌ కిలో రూ.300, విత్‌ స్కిన్‌ రూ.280కి చేరింది. దీంతో ఈ వేసవి చికెన్‌ ప్రియులకు షాకిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం లైవ్‌బర్డ్‌ కు కిలో రూ.180కి విక్రయిస్తున్నారు. అంతకు ముందు ఈ ధర రూ.120గా ఉండేది.

ఏప్రిల్‌ 1నకిలో చికెన్‌ ధరరూ. 154గా ఉంది. వారం కిందట మార్కెట్‌లో స్కిన్‌తో కూడిన చికెన్‌ ధర కిలో రూ.213గా, స్కిన్‌లెస్‌ రూ.243గా ఉండేది. ఇప్పుడు ఆధర రూ.300కు చేరింది. మటన్‌ ధరతో పోలిస్తే ఆ ధరలో 25శాతం ధరకే కిలో చికెన్‌ వస్తుండడంతో మాంసాహారులు ఎక్కువగా చికెన్‌ తినేందుకే ఇష్టపడతారు. అయితే చికెన్‌ ధరలు పెరగడంతో కొనేందుకు వెనకాముందు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇంటికి బందువులు వస్తే చికెన్‌ కొనాలంటే రూ.1000దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. వేసవిలో విపరీతమైన ఎండలకు బయటకు వెళ్లాలంటేనే మనుషులు కూడా భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ దాదాపు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కోళ్లు ఎండ వేడికి ప్రాణాలు వదులుతున్నాయి.

సాధారణంగా వేసవి కాలంలో కోళ్లఫారాల్లో చికెన్‌ బ్యాచ్‌లను పెంపకందారులు తగ్గిస్తుంటారు. అదేసమయంలో ఎండలు విపరీతంగా పెరగడంతోపాటు వడగాలులకు కోళ్లు మృత్యువాతపడుతుండడంతో చికెన్‌ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణం గా వేసవిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే బ్రాయిలర్‌ కోళ్లు ఎండవేడిని తట్టుకోలేవు. కోళ్ల షెడ్లపై స్ప్రింకర్లతో రోజుకు 3సార్లు చల్లబరచకపోతే ఎండ వేడికి చనిపోతాయి. ఈ పరిస్థితుల్లో స్ప్రింకర్లతోపాటు కూలర్లు పెట్టిమరీ కోళ్ల ఫామ్‌ నిర్వాహకులు షెడ్లలో చల్లదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అదే సమయంలో కరోనా మొదటి దశ తర్వాత కోళ్ల దాణాధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కోడికి వేసే దాణాలో ప్కరధానంగా సోయ, మొక్కజొన్న ప్రధానమైనది. కరోనాకు ముందు కిలో సోయా రూ.35కు లభించేది. ఇప్పుడు కిలో రూ.105కు చేరింది. ఇక రూ.13కు కిలో లభించే మొక్కజొన్న దాణా ధర ఇప్పుడు రూ.40కి చేరింది. దీంతో కోళ్ల పెంపకంలో ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పెరిగి న దాణా ఖర్చులు, విపరీతమైన ఎండవేడికి కోళ్లు మృత్యువాతపడడం, ఎండవేడి నుంచి కోళ్లను కాపాడేందుకు కూలర్లు, ఏసీలు, స్ప్రింక్లర్లు వంటి ఉపకరణాల వినియోగంతో చికెన్‌ ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయి చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 19:19

తలసరి ఆదాయంలో తెలంగాణే నెంబర్ వన్: సీఎం కేసీఆర్‌

మంచిర్యాల:జూన్ 09

తలసారి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంచిర్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చాలా విషయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొని ప్రగతి సాధించామని గుర్తుచేశారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మంచిర్యాల సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. నస్పూర్‌లో 26.24 ఎకరాల కేటాయించగా 2018 ఫిబ్రవరి 27న కేసీఆర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 50.20 కోట్ల వ్యయంతో మంచిర్యాల కలెక్టట్‌ సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తయింది.

ఏడాది కాలంలో పూర్తి కావాల్సి ఉండగా రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఇందులో కలెక్టర్‌ బంగ్లాతో పాటు రెండు అడిషనల్‌ కలెక్టర్‌, 8 మంది జిల్లా అధికారుల నివాసాలు ఉన్నాయి. కలెక్టర్‌ బంగ్లా పూర్తయి నివాసం ఉంటుండగా మిగిలిన అధికారుల నివాస గృహాలుపూర్తి కావాల్సి ఉంది. విద్యుత్‌ సరఫరాకు సమీపంలో 11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 18:48

YS Bhaskar Reddy: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురు..

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ ను సీబీఐ కోర్టు కొట్టిపారేసింది..

వైఎస్‌ సునీత, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ను నిరాకరించింది.

కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్‌ మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తే జరిగే పరిణామాలను స్పష్టంగా కోర్టుకు వివరించారు. దీంతో సీబీఐ, సునీత వాదనలలో మెరిట్స్‌ ఉండటంతో బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది నాంపల్లి సీబీఐ కోర్టు..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 17:10

బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు!

ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్స్‌ రచిస్తోంది. బీజేపీ హైకమాండ్‌ ఇప్పటికే తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది..

ఇక, తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు హైకమాండ్‌ కీలక బాధ్యతలు అప్పగించింది.

వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ కమిటీ సారధిగా నియమించినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో​ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకత్వాన్ని సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రొజెక్ట్‌ చేయనున్నట్టు సమాచారం. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరోవైపు, ఈటల రాజేందర్‌ ఈరోజు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్‌ మేథోమథనం జరిపింది. రెండు రోజుల పాటు దాదాపు పది గంటలు నేతలు సమాలోచనలు చేశారు. కాగా, అధిష్టానం నిర్ణయంతో తెలంగాణ బీజేపీలో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగినట్టు తెలుస్తోంది..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 17:09

Khammam: దారి కాచిన మృత్యువు... ముగ్గురి మృతి

వైరా: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వైరా మండలం స్టేజీ పినపాక వద్ద లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..

మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బాధితులను సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని కల్లూరు మండలం లాక్యాతండాకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు.

కారును లారీ ఢీ కొన్న తర్వాత కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 17:00

Andhra News: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి

తాడేపల్లి: ఏపీ ఎన్జీవో నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు ఉన్నారు..

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్‌ లేని ఫించను ఇవ్వాలని సీఎంను కోరామని వెల్లడించారు. దీనిపై సీఎం స్పందిస్తూ కాంట్రిబ్యూషన్‌ లేని విధానం భారమవుతుందన్నారని చెప్పారన్నారు.

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణకు మంత్రులు, సీఎస్‌ కృషి చేశారని ఏపీ ఉద్యోగ ఐకాస అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కొనియాడారు. కేబినెట్‌లో 12వ పీఆర్సీ ప్రకటన, ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు, అన్ని జిల్లాల్లో ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నామని బండి శ్రీనివాస్‌ తెలిపారు. జీపీఎస్‌లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని సీఎం తెలిపారన్నారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ తెస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఓపీఎస్‌తో సమానంగా లబ్ధి కలిగించేలా జీపీఎస్‌ను తీసుకొచ్చారన్నారు. ''జీపీఎస్‌తో నష్టం ఉండదని, ఉద్యోగులకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. జీపీఎస్‌.. దేశానికి రోల్‌ మోడల్‌గా ఉంటుందన్నారు. ఉద్యోగులు రిటైర్‌ అయ్యాక భద్రత కల్పించేలా జీపీఎస్‌ తెచ్చామని చెప్పారు. జీపీఎస్‌ తీసుకువచ్చిన సీఎంకు ధన్యావాదాలు తెలిపాం'' అని వెల్లడించారు..

నిజంనిప్పులాంటిది

Jun 09 2023, 16:54

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..

Revanth Reddy: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి..

ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్‌ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే పాదయాత్రలు, బహిరంగసభల పేరుతో జనంలోకి వెళ్తోంది. తాజాగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని రేవంత్​ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ నేతలంతా కష్టపడాలన్నారు..

ధరణి పోర్టల్ గడీల పాలన కోసం తెచ్చారని ఆయన ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది భూమి కోసమేనని.. ఆ భూముల మీద దొరల పెత్తనం ఆగకపోతే నక్సల్ బరి ఉద్యమం వచ్చిందని రేవంత్ చెప్పారు. పట్టణ బాట పట్టిన దొరల కోసం ధరణి కేసీఆర్‌ ధరణి తెచ్చారని రేవంత్ విమర్శలు గుప్పించారు. కొత్త భూస్వాములను తయారుచేసేందుకే.. ధరణి. రూ.వందల కోట్లు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ ప్రభుత్వం చేతుల్లో లేదని ఆయన విమర్శించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ దళారుల చేతుల్లో ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు.

ధరణి ద్వారా హైదరాబాద్‌ చుట్టూ భూములు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దోచుకున్న భూములను బినామీ పేర్లపై ఉంచారని రేవంత్ అన్నారు. దేశాన్ని దోచుకోవడమే డబుల్ ఇంజిన్ పని అంటూ రేవంత్ మండిపడ్డారు. వన్ నేషన్.. వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని విమర్శించారు. సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలంతా కలసికట్టుగా కష్టపడాలని రేవంత్‌ సూచించారు..