Hyderabad: రేపు చేప మందు పంపిణీ... ఏర్పాట్లు పూర్తి..
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబం (Battina Family) అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..
రేపు (శుక్రవారం) ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణి ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకుల కోసం 9, 10వ తేదీలు (రెండు రోజులు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు..
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు..
Jun 09 2023, 08:41