నిజంనిప్పులాంటిది

Jun 08 2023, 16:56

Hyderabad: రేపు చేప మందు పంపిణీ... ఏర్పాట్లు పూర్తి..

హైదరాబాద్: మృగశిర కార్తె సందర్బంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన కుటుంబం (Battina Family) అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు..

రేపు (శుక్రవారం) ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణి ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకుల కోసం 9, 10వ తేదీలు (రెండు రోజులు) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు..

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు..

నిజంనిప్పులాంటిది

Jun 08 2023, 16:54

Kottu Satyanarayana: యాగంతోనే ఏపీకి కేంద్రం నిధులు.. మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు..

ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు. రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని.. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు.

శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేసేందుకు సంకల్పించినా ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు.

ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసినా అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేశామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ..

నిజంనిప్పులాంటిది

Jun 08 2023, 16:52

Fraud At Registrar Office: అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు..

అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు మారుతున్నాయి. ఏసీబీ దాడులు చేస్తున్న వదలని అవినీతి కంపు వదలడం లేదు. విజయవాడలోని పటమట, గాంధీనగర్, మాచవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కాసుల వర్షం కురుస్తోంది..

పటమట రిజిస్ట్రార్ పోస్ట్ కోసం కోటి నుంచి కోటిన్నర వరకు బేరాలు సాగుతున్నట్లు సమాచారం. ఆడిట్ ఆఫీస్ లో రిజిస్ట్రార్, డిప్యూటేషన్ విధుల్లో ఉన్న మరో రిజిస్ట్రార్ పోటా పోటీ లాబీయింగ్ చేస్తున్నారని, రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసూళ్ళ కోసం మళ్లీ ప్రైవేట్ సిబ్బంది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది..

ఇటీవల డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని ఏసీబీ అరెస్ట్ చేసినా రిజిస్ట్రార్ల తీరు మారడం లేదు. ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ఆఫీసులో అర్థరాత్రి వరకు రిజిస్ట్రార్, సిబ్బంది ఉండటంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆదాయానికి మించి కోట్లలో ఆస్తులు రిజిస్ట్రార్లు కూడగడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఏసీబీ తనిఖీలు కేవలం లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న కేసులే నమోదు చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెజవాడలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల మధ్య కోల్డ్ వార్ తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో రచ్చకెక్కుతున్నారట. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ రాఘవ రావు అరెస్ట్ రిమాండ్ రిపోర్టు లో దిమ్మదిరిగే విషయాలు నమోదు చేసింది ఏసీబీ. రిజిస్ట్రార్లు అందరూ డబ్బులు వసూలు చేసి ఉన్నతాధికారికి ఇస్తున్నట్టు చెప్పినట్టు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ ఉండటం గమనార్హం..

నిజంనిప్పులాంటిది

Jun 08 2023, 15:42

Monsoon: ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా వర్షాలు..

Monsoon: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. వారం ఆలస్యం కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడించింది..

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ రుతుపవనాలను ప్రభావితం చేస్తాయని, కేరళపై దీని ప్రభాంత తక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పారు.

సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళకు చేరాలి. అయితే ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న కేరళకు చేరుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ.. మొత్తంగా వారం రోజుల ఆలస్యం తరువాత ఇండియా మెయిన్ ల్యాండ్ లోకి ప్రవేశించాయి..

రుతుపవనాల ఎంట్రీతో కేరళ తీరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపువనాలు 48 గంటల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరో వారం-10 రోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉంది..

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 18:18

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్:జూన్ 07

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా సాగునీటి దినోత్సవంలో పాల్గొన్నారు. నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి గొప్పగా చెప్పారు. పదేళ్లలో సాధించిన ప్రగతిని సమీక్ష చేయడం కోసమే తెలంగాణ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

చేసిన అభివృద్ధిని చెప్పే సత్తా కెసిఆర్ కి మాత్రమే ఉందని కవిత వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో, సమైక్య పాలనలో కరువు ఉండేదని నేడు ఎక్కడ చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాయని కవిత పేర్కొన్నారు.

ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కెసిఆర్ అంటే కాలువలు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లు అని పేర్కొన్నారు కవిత...

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 18:16

Prakasham: హనుమాయమ్మ హత్య కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు: డీజీపీ ఆదేశం

టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న హనుమాయమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హతమార్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు..

హనుమాయమ్మ హత్య కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీకి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.

హనుమాయమ్మను స్థానిక వైకాపా నాయకుడు సవలం కొండల్‌రావు ట్రాక్టరుతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'నీ భర్త తెదేపాలో ఉన్నాడు. ఆ పార్టీ ఎమ్మెల్యే వెంట తిరుగుతున్నాడు. నువ్వేమో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నావు.

మీ ఇద్దరిలో ఎవరో ఒకర్ని చంపే వరకు నేను నిద్రపోను'.. అని రెండు రోజుల కిందట వైకాపా నాయకుడు కొండలరావు హెచ్చరించాడని, ఆయనే ఇంటి వద్ద ఉన్న హనుమాయమ్మ (50)ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడని మృతురాలి భర్త సవలం సుధాకర్‌, కుమార్తె మాధురి ఆరోపించారు..

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 18:15

CM Jagan: ముందస్తు ఎన్నికలపై మంత్రులకు క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం జగన్‌ మంత్రులకు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది..

ఇవాళ మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో సీఎం జగన్‌ దాదాపు గంటసేపు చర్చించారు.

ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై మంత్రులతో మాట్లాడారు. షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్‌ తేల్చి చెప్పినట్టు సమాచారం.

ఎన్నికల కోసం ఇంకా 9 నెలల సమయం ఉందన్న ముఖ్యమంత్రి.. ఈ తొమ్మిది నెలల పాటు గట్టిగా పనిచేయాలని సూచించారు..

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 18:13

బల్కంపేట్ ఎల్లమ్మ జాతర ‌డేట్ ఫిక్స్..

బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి జాతరకు సంబంధించి మంత్రి తలసాని కీలక ప్రకటన చేశారు. జాతర తేదీలను మంత్రి ప్రకటించారు.

జూన్ 19న ఎదురోళ్లు, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అంతకు ముందు మంత్రి తలసాని కల్యాణం నిర్వహణ, జాతర ఏర్పాట్లపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

మూడు రోజుల పాటు సాగే ఈ జాతర మహోత్సవాన్ని చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తారు. ప్రతి ఏడాది ఈ జాతరలో ఐదు లక్షల మంది వరకు పాల్గొంటారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:30

త్వరలో పెళ్లి చేసుకుంటా : బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర శాస్త్రి..

ప్రకటనలు మరియు కథనానికి పేరుగాంచిన ధీరేంద్ర శాస్త్రి తన వివాహం గురించి స్పష్టం చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రముఖ కథావాచ్, బాగేశ్వర్ ధామ్ అధినేత ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే తాను ఎవరితో పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఓ ఇంటర్వ్యూలో ధీరేంద్ర శాస్త్రి ఈ విషయాలు చెప్పారు.

ధీరేంద్ర శాస్త్రి పేరు ప్రముఖ కథకురాలు జయ కిషోరితో కూడా ముడిపడి ఉందని దయచేసి తెలియజేయండి. అయితే ఈ విషయమై జయ కిషోరిని ప్రశ్నించగా.. తాను బాగేశ్వర్ బాబాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో, బాగేశ్వర్ ధామ్ అధిపతిని మీరు అమ్మాయిని చూశారా అని అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను ఇంకా అమ్మాయిని చూడలేదన్నారు.

కచ్చితంగా పెళ్లి చేసుకుంటా

బాగేశ్వర్ ధామ్ చీఫ్ సోమవారం ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ సమయంలో, హిందువులను పెంచడం గురించి అతను మాట్లాడుతున్నాడని, అతను తన కుటుంబాన్ని ఎప్పుడు పెంచుకుంటాడు? ఈ ప్రశ్నకు ధీరేంద్ర శాస్త్రి సమాధానమిస్తూ.. త్వరలోనే తాను పెళ్లి చేసుకుని కుటుంబాన్ని పోషిస్తానని చెప్పాడు. ఇంతకు ముందు కూడా వీరి పెళ్లి గురించి చాలా సార్లు చర్చలు జరిగాయి. అయితే ప్రతిసారీ తన పెళ్లి గురించి క్లియర్ గా చెప్పుకొచ్చాడు.. త్వరలో పెళ్లి చేసుకుంటానని.

పదవీ విరమణ చేయలేదు: ధీరేంద్ర శాస్త్రి

ధీరేంద్ర శాస్త్రి తన పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు చాలా నోరు జారాడు. పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తాను సన్యాసం తీసుకోలేదని, అందుకే పెళ్లి చేసుకోవచ్చని శాస్త్రి చెప్పారు. తాను మతానికి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయడం లేదని, ఎందుకంటే తాను ఎవరి దగ్గర జోలి తీసుకోలేదని, అంటే సన్యాసం తీసుకోలేదన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 07 2023, 14:29

Cyclone Biparjoy: బిపోర్‌జాయ్‌ ముప్పు.. రుతుపవనాల రాక మరింత ఆలస్యం..!

దిల్లీ: ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపోర్‌జాయ్‌' తుపాను (Cyclone Biparjoy) మరింత తీవ్ర తుపానుగా మారింది..

దీంతో ఈ ప్రభావం నైరుతి రుతుపవనాల (Southwest Monsoon)పై పడింది. తుపాను కారణంగా రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు..

''నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను (Cyclone Biparjoy) కారణంగా.. ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2 - 3 రోజులు పట్టే అవకాశముంది'' అని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది.

గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. తొలుత జూన్‌ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా.. 7వ తేదీ వచ్చినా రుతుపవనాల ఆచూకీ కన్పించట్లేదు. ఇప్పుడు తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు..