Arvind Kejriwal: రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం.. కేసీఆర్‌ మద్దతు కోరనున్న కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: రేపు హైదరాబాద్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రానున్నారు. శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ సమావేశం కానున్నారు..

ఢిల్లీలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్‌ల (IPS) బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ మద్దతును కేజ్రీవాల్ కోరనున్నారు..

ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యత్నిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం ఇంటి పునర్ నిర్మాణ పనులపై దృష్టి సారించారు.

(Arvind Kejriwal) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బంగ్లా పునరుద్ధరణపై విజిలెన్స్ నివేదిక(Vigilance Report) ఎల్‌జి సక్సేనాకు అందింది. 2020వ సంవత్సరం మార్చిలో అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి సీఎం ఇంట్లో అదనపు వసతి ఏర్పాట్లను ప్రతిపాదించారు.

(Delhi CM's Bungalow Renovation) డ్రాయింగ్ రూమ్, రెండు మీటింగ్ రూమ్‌లు, 24 మంది కెపాసిటీ ఉన్న డైనింగ్ రూమ్ పునర్నిర్మించడం ద్వారా పై అంతస్తును అదనంగా చేర్చారు..

Congress: మోదీ 9 ఏళ్ల పాలన.. కాంగ్రెస్‌ 9 ప్రశ్నలు

దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా (BJP) పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కీలక అంశాలను లేవనెత్తారని, వాటిని ఆధారంగా చేసుకుని తాము కేంద్రాన్ని 9 ప్రశ్నలు అడుగుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. 'నౌ సాల్‌.. నౌ సవాల్‌' పేరుతో ఓ బుక్‌లెట్‌ కూడా విడుదల చేసినట్లు చెప్పారు..

కాంగ్రెస్‌ అడిగిన 9 ప్రశ్నలు ఇవే..

1. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు ఆకాశాన్నంటుతోంది? సంపన్నులు మరింత ధనవంతులుగా.. పేదలు మరింత నిర్భాగ్యులుగా ఎందుకు మారుతున్నారు? ప్రజల ఆస్తులను ప్రధాని మోదీ తన స్నేహితులకు ఎందుకు విక్రయిస్తున్నారు?

2. సాగు చట్టాలను రద్దు చేసినప్పుడు రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఎందుకు గౌరవించట్లేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఎందుకు ఇవ్వట్లేదు? 9 ఏళ్లయినా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదెందుకు?

3. మీ ఫ్రెండ్‌ అదానీ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని ఎందుకు రిస్క్‌లో పెట్టారు? భాజపా పాలిత రాష్ట్రాల్లో అవినీతిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

4. మీరు క్లీన్‌చిట్ ఇచ్చినా.. చైనా ఎందుకు ఇంకా భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 18 సార్లు చర్చలు జరిగిన ప్రతిష్టంభన ఎందుకు కొనసాగుతోంది?

5. ఎన్నికల లబ్ధి కోసం విద్వేష రాజకీయాలను ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు?

6. మహిళలు, దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సామాజిక న్యాయ పునాదులను ఎందుకు నాశనం చేస్తున్నారు?

7. మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలను ఎందుకు బలహీన పరుస్తున్నారు? ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలను ఎందుకు ప్రయోగిస్తున్నారు?ధనబలంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారు?

8. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి, కఠిన నిబంధనలు తీసుకొచ్చి వాటిని ఎందుకు బలహీనపరుస్తున్నారు?

9. ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ విధించడంతో నష్టపోయిన లక్షలాది వలసకార్మికులకు ఎందుకు సాయం చేయలేదు? కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇవ్వట్లేదు?

ఈ ప్రశ్నలకు ప్రధాని (PM Modi) సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. అంతేగాక.. ఈ తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకు గానూ ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంది. ఈ రోజును కేంద్ర ప్రభుత్వం 'మాఫీ దివస్‌'గా నిర్వహించాలని హస్తం పార్టీ దుయ్యబట్టింది.

తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ..

AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్దిని వైసీపీ ప్రకటించింది. (దువ్వాడ వాణి)ని టెక్కలి అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. అధికార వైసీపీ మొదటి అభ్యర్థి ప్రకటించటంతో ముందస్తు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందేమొనని చర్చ జరుగుతుంది..

SB NEWS

SB NEWS

SB NEWS

పార్లమెంటు ప్రారంభోత్సవం పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

న్యూఢిల్లీ,

పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతుండగానే.. దానిపై సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆ భవనాన్ని ప్రధానికి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సచివాలయానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టు న్యాయవాది జయా సుకిన్‌ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిల్‌ వేశారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ద్వారా.. లోక్‌సభ సెక్రటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషనర్‌ తన పిల్‌లో పేర్కొన్నారు.

ప్రధానిని, ఇతర మంత్రులను నియమించేది రాష్ట్రపతేనని.. కార్యనిర్వహణకు సంబంధించి వారు తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్రపతి పేరు మీదే తీసుకుంటారని గుర్తుచేశారు. అలాంటి రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడమంటే అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కాగా.. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి వచ్చేదే లేదంటూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన విపక్ష నేతలు తమ వాగ్దాడిని కొనసాగించారు.

ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ‘‘మిస్టర్‌ మోదీ.. పార్లమెంటు ప్రజలు నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం. మీ ప్రభుత్వ అహంకారపూరిత ధోరణి పార్లమెంటరీ వ్యవస్థనే నాశనం చేసింది. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కోవడం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్‌ చేశారు.

ఇక.. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం మన దేశ బహుళత్వానికి, భిన్నత్వానికి నిదర్శనమని.. పార్లమెంటరీ సాంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న ఒక నియంతృత్వ ప్రభుత్వ వైఖరికి ప్రతిస్పందన అని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ వ్యాఖ్యానించారు. ‘‘వందేభారత్‌ రైళ్ల నుంచి పార్లమెంటు భవనం దాకా.. అన్నింటినీ ప్రధానే ప్రారంభించాలి. కొవిడ్‌ టీకాల సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫొటోనే వేయాలి. ఏ శాఖ నిర్వహించిన పనికైనా క్రెడిట్‌ ఆయనకే ఇవ్వాలి.

ఈ తరహా మెగెలోమేనియా (తనను తాను అందరికన్నా అధికుడుగా భావించుకునే తత్వం).. అభద్రతాభావంతో కొట్టుమిట్టాడే నియంతల తీరుకు బండగుర్తు’’ అని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలే నిప్పులు చెరిగారు. వారి వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. మే 28న పార్లమెంటు ప్రారంభోత్సవానికి విచ్చేసి విపక్షాలు తమ విశాల హృదయాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ముర్ము అంటే తమకు గౌరవం ఉందని.. రాష్ట్రపతి పదవిని తాము రాజకీయాల్లోకి లాగదల్చుకోలేదని స్పష్టం చేశారు.

గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంట్ కేసు నమోదు

గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంట్ కేసు నమోదయింది. టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో యాక్సిడెంట్ ఘటన శుక్రవారంనాడు చోటు చేసుకుంది.

స్వీఫ్ట్ డిజైర్ కారు (Swift DZire Car TS15EZ0795) ఓ బాలుడిని ఢీ కొట్టింది. కారు నడిపిన సూడాన్ దేశస్తుడు. అనంతరం కారుతో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు కారును పట్టుకున్నారు. కోపాద్రిక్తులైన వారు కారును ధ్వంసం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారు నడిపి బలుడుని ఢీ కొట్టిన సూడాన్ దేశస్తుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది...

SB NEWS

SB NEWS

సెల్లార్ లో పాప మృతి కేసులో ఓ మహిళ ఎస్సై నిర్లక్ష్యం

హైదరాబాద్‌: హయత్‌నగర్‌‌లోని ఓ సెల్లార్‌లో పాప మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారును నిర్లక్ష్యంగా నడుపుతూ పాప మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నిన్న హయత్‌నగర్‌ లెక్చరర్స్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పడుకోబెట్టిన రెండున్నర ఏళ్ల పాప మీది నుంచి కారు వెళ్లగా.. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది.

అయితే.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.

పాప మృతికి కారణమైన కారు వివరాలను పోలీసులు గుర్తించారు. TS07 JR 9441 నెంబరు గల కారు.. లెక్చరర్స్ కాలనీ బాలాజీ ఆర్కేడ్ నాలుగో ఫ్లోర్ రెసిడెన్స్‌ అడ్రస్‌తో.. కేషమోని స్వప్న పేరుతో రిజిస్టర్ అయింది.

అయితే స్వప్న.. ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో పోలీస్ క్యాప్ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే.. కారును నడిపింది మాత్రం ఎస్సై స్వప్న భర్త హరిరామకృష్ణగా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఎక్సైజ్ ఎస్సై స్వప్న భర్త హరిరామకృష్ణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. హరిరామకృష్ణపై కేసు పెట్టకుండా పోలీసులు కేవలం సీఆర్పీసీ 41 నోటీసులిచ్చి పంపించేశారు. అయితే.. హరిరామకృష్ణను అరెస్ట్‌ చేయకుండా కేవలం నోటీసులిచ్చి పంపించటంపై పాప కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరిరామకృష్ణను అరెస్ట్‌ చేయాలంటూ పాప తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

పాపను చూడకుండా హరిరామకృష్ణ నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా తెలుస్తోంది. అయినా కూడా పోలీసులు హరిరామకృష్ణను అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చి పంపించారంటూ పాప తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప హత్యకు కారణం అయిన హరిరామకృష్ణను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Avinashreddy: అవినాష్‌రెడ్డి ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..

హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందోస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది..

ఉదయం 10.30 గంటలకు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ, అవినాష్, సునీత తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు..

SB NEWS

SB NEWS

SB NEWS

మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర

మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర చేసింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటోంది.

రిజర్వేషన్ల విషయంలో రేగిన వివాదం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఆందోళనలకు దారితీసింది. మూడు వారాల నుంచి మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.

ఇతర రాష్ట్రాల నుంచి మణిపూర్‌కు ట్రక్కులు నడిపేందుకు యజమానులు, డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో నిత్యావసర వస్తువులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది.

దీంతో అందుబాటులో ఉన్న సరుకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు.

వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో సిలిండర్‌ ధర రూ.1800లకు పైకి చేరిందని వాపోయారు.

గ్రూప్-1 పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ నిర్వహణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ‌ హైకోర్టు

నిరాక‌రించింది. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాదాపు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

గ్రూప్-1, 2, 3, 4 నియామక పరీక్షలకు మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను టీఎస్పీఎస్సీ పాటించలేదని ఆయా అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అయితే.. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ విచారణ నిర్వహించింది. అయితే.. తన కుమార్తె కూడా గ్రూప్ 1 అభ్యర్థి అయినందున తాను విచారించలేనని జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. పిటిష‌న్‌ను మ‌ధ్యాహ్నం మ‌రో బెంచ్‌కు పంపిస్తాన‌ని తెలిపారు.

దీంతో ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది.

ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్, కార్య‌ద‌ర్శి, హోం శాఖ కార్య‌ద‌ర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మరో నాలుగు వారాల‌కు హైకోర్టు వాయిదా వేసింది...

హయతికి వేధింపులు: డీసీపీపై లాయర్ పాల్ సత్యనారాయణ సంచలన ఆరోపణలు

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై కేసులో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, డింపుల్ తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. డింపుల్ హయతిపై తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. డింపుల్.. డీసీపీ కారు కవర్ తీసేసిందని ఎఫ్ఐఆర్ లో రాశారని, నిజంగా డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ ఉంటే బయటపెట్టండని సవాల్ విసిరారు ఆమె తరుపు న్యాయవాది పాల్ సత్య నారాయణ. ఈ వివాదంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

డీసీపీ అబద్దాలు చెబుతున్నారరన్నారు పాల్ సత్యనారాయణ. తన డ్రైవర్‌ను కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నాడని.. ఇంత జరుగుతున్నా డ్రైవర్ ఎందుకు బయటకు రావడంలేదని ప్రశ్నించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు కావాలనే బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్‌‌లో పెట్టారని.. చేసిన తప్పును కవర్ చేసుకునేందుకే ఇదంతా చేశారని న్యాయవాది పాల్ ఆరోపించారు.

డీసీపీ ప్రవర్తన బాగాలేకనే డింపుల్ గతంలో ఆయనకు వార్నిం కూడా ఇచ్చిందని.. ఆ కోపంతోనే డింపుల్‌పై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు లాయర్ సత్య నారాయణ. ఇక డింపుల్ ఇంట్లోకి కూడా ఎవరెవరో వస్తున్నారని, తెలియని నంబర్స్ నుంచి కాల్స్ చేసి ఆమెను భయపెడుతున్నారని.. భయంతో ఆమె బయటకు కూడా రావడంలేదని చెప్పుకోచ్చారు. దీనిపై డింపుల్ ఫిర్యాదు చేస్తే కూడా తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు.

ఒక ఐపీఎస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమేనన్న పాల్ సత్యనారాయణ.. డీసీపీతో పాటు అతని డ్రైవర్ పైన న్యాయ పరమైన యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. కాగా, ఐపీఎస్‌ అధికారి రాహుల్ హెగ్డే, డింపుల్ హయతికి మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. డీసీపీ డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్‌పై కేసు కూడా నమోదైంది. డింపుల్ హయతి నివాసం ఉంటున్న భవనంలోనే ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. మరోవైపు, డింపుల్ కూడా డీసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.