గ్రూప్-1 పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు
నిరాకరించింది. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాదాపు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
గ్రూప్-1, 2, 3, 4 నియామక పరీక్షలకు మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను టీఎస్పీఎస్సీ పాటించలేదని ఆయా అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అయితే.. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ విచారణ నిర్వహించింది. అయితే.. తన కుమార్తె కూడా గ్రూప్ 1 అభ్యర్థి అయినందున తాను విచారించలేనని జస్టిస్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషన్‌ను మధ్యాహ్నం మరో బెంచ్‌కు పంపిస్తానని తెలిపారు.
దీంతో ఈ రోజు మధ్యాహ్నం జస్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈ అంశంపై వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మరో నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది...
May 25 2023, 19:58