మరో ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంకండి'
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కోవిడ్-19 మహమ్మారి కంటే ప్రాణాంతకమైన తదుపరి మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కోవిడ్-19 ముగింపు అంటే ప్రపంచ ఆరోగ్య ముప్పుగా ఉన్న కోవిడ్ 19కి ముగింపు కాదని టెడ్రోస్ చెప్పారు. సోమవారం జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సభ్యకు తన నివేదికను సమర్పించిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ ఈ విషయాన్ని తెలిపారు.
వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ..తొలుత ప్రాణాంతకంగా మారిని తదనంతరం ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కున్న తీవ్రత గల ముప్పుగా పరిణిమించలేదు.
అయినప్పటికీ ఇది అత్యవసర పరిస్థితులను పరిష్కరించి..సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాలు అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు.
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్(ఎస్‌డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కోవిడ్ 19 మహమ్మారి తెలియజెప్పిందన్నారు.
May 24 2023, 17:03