New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఈనెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం (New Parliament Buiding) ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు ప్రకటించాయి..
రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు (Opposition parties) బుధవారంనాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి..
19 పార్టీలు ఇవే...
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి..
SB NEWS
SB NEWS











May 24 2023, 17:00
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
26.9k