గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజుకు దాదాపుగా 12 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో కూలీలు ఉపాధి పనుల వైపు మళ్లారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3.40 కోట్ల పనిదినాలు కాగా, ఏప్రిల్‌లో 2.26 కోట్ల పనిదినాలు, ఈ నెలలో 1.14 కోట్ల పనిదినాలు జరిగాయి.
ప్రతి ఏటా ఎండాకాలంలోనే అత్యధికంగా ఉపాధి పనులు చేస్తుంటారు. అయితే, దేశంలోనే తెలంగాణలో ఎక్కువగా వరి, ఇతర పంటల సాగు కాగా, కూలీలకు వ్యవసాయ పనులే పుష్కలంగా లభించాయి.
రాష్ట్రంలో సగటున రోజుకు 12 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఒక్కో కూలీకి సగటున రూ.174 వరకు చెల్లిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో కూలీల కోసం ప్రస్తుతం 4.92 లక్షల పనులను గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేసి ఉంచింది. వీటిలో 4.76లక్షల పనులు కొనసాగుతున్నాయి....
May 24 2023, 09:43