UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల
న్యూ ఢిల్లీ:
సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది UPSC. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది.
అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది.
జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, OBC కేటగిరీ కింద 263 మందిని, SC కేటగిరీ కింద 154 మందిని, ST వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్‌గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానం దక్కించుకున్నారు.
ఇషితా కిషోర్
సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల విజయభేరి
IAS/IPS వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తోట శరత్ చంద్ర తెలిపారు.
తమ అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి దాదాపు 45 మంది అభ్యర్థులు ఈ ఏడాది ర్యాంకులు సాధించారని ఇందులో చాలామందికి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి మెరుగైన సర్వీసులు వస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా అత్యున్నత సర్వీసులకు ఎంపికవడం పట్ల శరత్ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు...
May 23 2023, 16:59