శాసనసభ ఎన్నికలకు సిద్ధం కండి: డీజీపీ

హైదరాబాద్‌: ఎన్నికల నిర్వహణలో ప్రతిసారీ కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని, అందుకే ఈ ప్రక్రియలో పాల్గొనడం ప్రతి అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని డీజీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

మరో అయిదారు నెలల్లో రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల నిర్వహణపై ఎస్పీలు, కమిషనర్లకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం పునశ్చరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికలకు చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి, పాత కేసులు... తదితర అంశాలను డీజీపీ వివరించారు.

జూన్‌, జులైల్లో చేయాల్సిన పనులు, కేంద్ర బలగాలతో సమన్వయం, సిబ్బంది మోహరింపు వంటి అంశాలపై అంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాల ఎస్పీలు, కమిషనర్లలో చాలామందికి గతంలో ఎన్నికలు నిర్వహించిన అనుభవం లేదని,

వారంతా సీనియర్‌ అధికారుల సహకారం తీసుకోవాలని అంజనీకుమార్‌ సూచించారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల నిర్వహణలో పాల్గొని వచ్చిన అదనపు డీజీ సౌమ్యా మిశ్ర, డీసీపీ అభిషేక్‌ మొహంతి తమ అనుభవాలను పంచుకున్నారు.

Cough syrup: దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

దిల్లీ: భారత్‌ (India)లోని కొన్ని కంపెనీలు తయారుచేసిన దగ్గు మందుల (Cough syrup) కారణంగా కొన్ని దేశాల్లో మరణాలు సంభవించడం ఇటీవల తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

ఆ సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఇటీవల హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ (Govt Labs)లలో అనుమతి తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే ఎగుమతులు (Exports) చేసుకోవాలని స్పష్టం చేసింది. జూన్‌ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది..

''దగ్గు మందు (Cough syrup) ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ఏదైనా ప్రభుత్వ లాబొరేటరీలో పరీక్షించి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్‌ సమర్పిస్తేనే తమ దగ్గు మందులను ఎగుమతి చేసేందుకు అనుమతులు లభిస్తాయి.

జూన్‌ 1వ తేదీ నుంచి ఈ నిబంధన తప్పనిసరి'' అని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) ఓ అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌, రీజినల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (RDTL - Chandigarh), సెంట్రల్‌ డ్రగ్స్‌ ల్యాబ్‌ (CDL - Kolkata), సెంట్రల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (CDTL - Chennai Hyderabad, Mumbai), ఆర్‌డీటీఎల్‌ (గువాహటి)తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో దగ్గు మందుకు తనిఖీలు చేయించుకోవాలని కేంద్రం ఎగుమతుదారులకు స్పష్టం చేసింది..

జాతకం చూస్తానని..రూ.2.65 లక్షలతో ఉడయించాడు

•నందిగామ మండలం ఈదులపల్లి లో ఘటన

నేను శ్రీశైలం నుంచి వచ్చిన స్వామీజీని.. మీ జాతకం చూస్తాను అని ఓ కుటుంబాన్ని బురిడీ కొట్టించి రూ.2.65 లక్షలతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు..

నందిగామ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన సునీత(25) ఇంటికి రెండు నెలల క్రితం ఓ వృద్ధుడు వచ్చి తన పేరు రాములు అని మీ జాతకం చూస్తానని మొదట 15000 తీసుకున్నాడు..

సదరు మహిళ డబ్బులు ఇవ్వడంతో అమాయకత్వాన్ని గమనించిన ప్రబుద్ధుడు మరో పథకం వేశాడు. మీ భర్తకు ప్రాణహాని ఉందని, మీ ముగ్గురు ఆడ పిల్లల మంచి కోసం పరిహారం పూజలు చేయాలని నమ్మబలికాడు.

అంతేకాకుండా మీ ఇంట్లో బంగారు నిధులు ఉన్నాయని బయటకు తీసేందుకు 2.50 లక్షల ఖర్చు అవుతుందని చెప్పాడు.. నమ్మిన సునీత మొత్తం రూ.2.65 లక్షలు ఇచ్చింది.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెబితే నీ భర్త ప్రాణాలకు గండం ఉంటుందని నమ్మించాడు.

ఒకే రోజులో తన పని ముగించుకొని.. ఒక నెలలో తిరిగి వచ్చి బంగారు నిధులు తీస్తానని వెళ్లిపోయాడు.. నెల తర్వాత రాకపోవడంతో సునీత వృద్ధుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసింది.. అతను ఇప్పుడు లేడు అని బదులు రావడంతో తాను మోసపోయినట్లు భావించి నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

బ్యాంకు ఖాతాలపై ఐటి కన్ను

ఎవరైనా తప్పు చేస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష

మరోవైపు బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునే యత్నాల్లో బడాబాబులు

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఆ నోట్లు వుంటే సెప్టెంబరు 23వ తేదీలోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అంతవరకు బయట మార్కెట్‌లో కూడా అవి చలామణిలో ఉంటాయి. దుకాణదారులు, వ్యాపారులు తీసుకోబోమని చెప్పడానికి వీల్లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే గతంలో పెద్ద నోట్ల రద్దు అయినప్పుడు చాలామంది వ్యాపారులు, ధనవంతులు వారి బ్లాక్‌మనీని ఎలా వైట్‌ చేసుకున్నారో...ఇప్పుడు కూడా అలాగే చేయడానికి సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..ఎవరైనా సరే సెప్టెంబరు 23వ తేదీ వరకు రోజుకు పది నోట్లు చొప్పున రూ.20 వేలు బ్యాంకులో వేసి, దానికి సరిపడా మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలా చేస్తే నెలకు రూ.6 లక్షల వరకు మార్చుకోవచ్చు. అయితే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా! అని మనవి కాని డబ్బు (ఇంకెవరివో) తీసుకొని మీ ఖాతాల్లో వేస్తే ఇబ్బందులు తప్పవు. సెప్టెంబరు 23 వరకు ప్రతి ఖాతాను ఐటీ విభాగం పరిశీలిస్తుంది.

రెండు లక్షల రూపాయలలోపు రూ.2 వేల నోట్ల లావాదేవీలు ఉంటే...సాధారణ అంశంగానే పరిగణిస్తుంది. అంతకు మించి రూ.2 వేల నోట్లు వేసినట్టయితే వాటిపై సెక్షన్‌ 68 ప్రకారం వివరణ కోరుతుంది. దానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించి, ఆధారాలు చూపాలి. గతంలో ఎన్నడూ చూపని ఆదాయం ఇప్పుడు చూపిస్తే...దానిని తప్పుడు పనిగా భావించి ఆదాయ పన్ను+జరిమానా వసూలు చేస్తుంది. ఇది ట్రాన్సాక్షన్‌ మొత్తంలో 84 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేశారనుకుంటే...దానికి సరిగ్గా లెక్కలు చెప్పకపోతే రూ.8.4 లక్షలు ఐటీ విభాగానికి కట్టాల్సి ఉంటుంది. పొరపాటున ఏ స్నేహితుడికో సాయం చేద్దామనే ఆలోచనతో వారి డబ్బులు మీ ఖాతాలో వేసుకుంటే...ఈ భారం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విచారణలో మనీ లాండరింగ్‌ జరిగిందని ఐటీ శాఖ భావిస్తే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.

కొత్త ఖాతాలు తెరవద్దు

ధనవంతులైన మిత్రులు తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి మన పేరుతో కొత్తగా ఇంకో బ్యాంకులో ఖాతా తెరుస్తామని అంటారు. మీకు ఏమీ భయం అవసరం లేదని, సెప్టెంబరు నెల ముగియగానే ఆ ఖాతా క్లోజ్‌ చేస్తామని, ఏ సమస్య రాదని చెబుతారు. ఇలా కొత్తగా ప్రారంభించే ఖాతాలు, అందులో వేసే మొత్తాలను బ్యాంకులతో పాటు ఐటీ శాఖ కూడా ట్రాక్‌ చేస్తుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ ఉంటుంది కాబట్టి...ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నా ఒక్కరి పేరుపైనే చూపిస్తాయి. ఇది కూడా తప్పే. ఇలాంటి వాటికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

రిటర్న్‌ ఫైల్‌ చేసినా...

కొంతమంది ఇలాంటి డబ్బులను ఐటీ రిటర్న్‌లలోను చూపించడానికి యత్నిస్తున్నారు. పరిధికి మించి బ్యాంకు ఖాతాలో రూ.2 వేల నోట్లను డిపాజిట్‌ చేస్తే సెక్షన్‌ 115-బీబీఈ...ప్రకారం మూడేళ్ల తరువాత కూడా ఆ రిటర్న్‌లను పునః సమీక్ష చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంబంధం లేని వ్యక్తుల రూ.2 వేల నోట్లను తీసుకొని బ్యాంకు ఖాతాల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తే...వారికి ప్రయోజనం... చేసిన వారికి నష్టం, జైలు శిక్షపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిదని విశాఖకు చెందిన ఐటీ అధికారి ఒకరు సూచించారు.

టికెట్లను ప్రకటించేస్తున్న కేటీఆర్ వీరికి మాత్రం టెన్షనే

తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) దూకుడు పెంచింది. తరచుగా పర్యటనలు చేపడుతూ, పార్టీకి ఆదరణ పెంచేందుకు కింది స్థాయి నేతల్లో ఉత్చాహం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారు తరచుగా జిల్లాలు పర్యటనలు చేపడుతూ, కీలకమైన ఎన్నికల హామీలను ఇస్తూ , ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే మంత్రి కేటీఆర్( Minister KTR ) జిల్లాల పర్యటనలో అనేక కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ వారిని గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుగానే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితులు అనుకూలంగా మార్చేందుకు కేటీఆర్ చొరవ తీసుకుంటున్నారు.

బిజెపి, కాంగ్రెస్ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చకు పెడుతున్నారు . వివాదాలు లేని నియోజకవర్గాల్లో ని అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ జిల్లా పర్యటనలు ఎక్కువగా చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పర్యటనలో పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మాజీ ఎంపీ వినోద్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి అని , బండి సంజయ్ ను ఇంటికి పంపి వినోద్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.

వరంగల్ లో వినయ్ భాస్కర్, కామారెడ్డి జిల్లా జక్కల్ లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే విషయంలోనూ కేటీఆర్ ఇదే విధంగా ప్రకటనలు చేశారు. కేటీఆర్ జిల్లా పర్యటనల్లో ఈ విధంగా కొన్ని కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై పార్టీలో చర్చనీయాంశం గా మారింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేటీఆర్ మౌనంగా ఉండడంతో , అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ దక్కడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది.

రామగుండం ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడిన కేటీఆర్ చందర్ మంచి యువకుడు అని ,బాగా కష్టపడతాడని , ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నాడని, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు . కానీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పకపోవడంతో, ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతుంది. ఇక పెద్దపల్లి ఎంపీ బార్లకుంట వెంకటేష్ పేరును కూడా కేటీఆర్ ప్రస్తావించలేదు దీనిపైన చర్చ జరుగుతోంది. అవినీతి వ్యవహారాలు, గ్రూపు రాజకీయాలతో వివాదాల్లో ఉంటున్న వారి విషయంలో సైలెంట్ గా ఉండడంతో వారికి టిక్కెట్ దక్కదు అనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం కేటీఆర్ జిల్లా టూర్లపై ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది.

షర్మిలకు ప్రియాంక గాంధీ ఫోన్

తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బలమైన శక్తిగా మార్చాలని, కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహాలు పన్నుతోంది. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో స్థానికంగా కొన్ని సామాజిక వర్గాల్లో ప్రభావం చూపించగలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

దీనిలో భాగంగానే తెలంగాణలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీతోను పొత్తు పెట్టుకునే దిశగా కాంగ్రెస్ హై కమాండ్ సిద్ధమవుతోంది.

ఈ మేరకు షర్మిలతో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ,అయితే వాటికి తాను సమాధానం చెప్పడం లేదని షర్మిల చెప్పారు.

ఇప్పుడు స్వయంగా ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో సంప్రదింపులు చేయడం, దీనికి డీకే శివకుమార్ మధ్యవర్తత్వం వహించడంతో పొత్తు పెట్టుకునే దిశగానే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.

డీకే శివకుమార్ త్ షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో, ఆయన ద్వారానే షర్మిలను ఒప్పించి కాంగ్రెస్ తో కలిసి నడిచే విధంగా చేసేందుకు కాంగ్రెస్ .ప్రయత్నాలు చేస్తూ ఉండడం, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఏపీ తెలంగాణలో ఆ వర్గం ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ పెరుగుతుందనే అంచనాలతోనే షర్మిల తో ప్రియాంక మంతనాలు చేస్తున్నారట.

షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా , కాంగ్రెస్ కు అదనపు బలం చేకూరుతుందని, తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరగబోతుండడంతో, అక్కడ ప్రభావం చూపిస్తే ఆ తర్వాత షర్మిల ద్వారానే ఏపీలోనూ కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం అండదండలు ఉండే విధంగా చేసుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.అయితే ఈ విషయంలో షర్మిల ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఆమె నిర్ణయంపై ఇప్పుడు అంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది...

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధూ, డీకే

బెంగళూరు:

కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్‌వీ దేశ్‌పాండే చేత గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల‌ చేత అసెంబ్లీ సభ్యులుగా ప్రొటెం స్పీకర్ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం చేయించారు. ఈనెల 24వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగనున్నాయి.

దీనికి ముందు సిద్ధరామయ్య మాట్లాడుతూ, సోమ, మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశలకు నిర్ణయించామని, కొత్త అసెంబ్లీ సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పారు. ఇదే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి స్పీకర్‌ను ఎన్నుకుంటామని తెలిపారు.

16వ అసెంబ్లీకి ఎన్నికైన 224 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా గత శనివారంనాడు సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు.

ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్‌గా డీకే శివకుమార్, మరో 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో పూర్తి ఆధిక్యం సాధించగా, బీజేపీ 66 సీట్లు, జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు గెలుచుకున్నాయి...

వైద్య విద్యలో దేశంలోనే తెలంగాణ రికార్డు

నూతనంగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు శిల్పకళావేదికలో నియామకపత్రాలు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం అందించారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు.

వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు, సిబ్బంది నియామకాలు భారీగా చేస్తున్నామన్నారు. 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లను ఒకే ఒక రోజు నియమించడం జరిగిందని.. ఇది వైద్య విద్యలో దేశంలోనే రికార్డ్ అన్నారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నారు. అందులో భాగంగా ఇవాళ 1061 మంది రిక్రూట్మెంట్ చేయనున్నట్టు తెలిపారు.

హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘గత నెలలో 900 మందికి పైగా ఉద్యోగాలు.. 1331 మంది ఆయుష్ పారా మెడికల్ లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పెర్మినెంట్ చేశాం. తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చాం. మరో 9222 పోస్ట్ లకు ఆరోగ్య శాఖ లో మరో రెండు నెలల్లో నియామకాలు చేపడతాం.

రోగుల ఆరోగ్యాన్ని నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. రోగులను ఆత్మీయంగా పలకరించాలి. ఒకటి రెండు ఘటనలతో ఆరోగ్య శాఖ పెరు చెడిపోకూడదు.

ప్రాణాలు కాపాడే గొప్ప వృత్తి వైద్యులది. గతంలో జబ్బులు వస్తే ఆ కుటుంబమే ఆర్ధికంగా చితికిపోయేది. ఇప్పుడు జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు మంచి వైద్యం అందుతోంది’’ అని పేర్కొన్నారు....

ఎమ్మెల్యే గాదరి కిషోర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

దళిత బంధు విషయంపై మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులను కొడుకులంటూ అవమానపరిచిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తక్షణమే మాదిగలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని సంఘం జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.

సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో స్థానిక జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట నిరసన ధర్నా నిర్వహించి సంఘం జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ... తుంగతుర్తిలో ప్రజలు విశ్వాసం కోల్పోయి అసహనంతో ఉన్న కిషోర్ ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను అవమాన పరుస్తున్నడని అన్నారు.

అహంకారం, బలుపు, అధికార మదం తగ్గించుకొని మాట్లాడకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

అవినీతికి అక్రమాలకు, ఇసుక దందాకు చిల్లర రాజకీయాలకు రాష్ట్రంలో కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడని అన్నారు. ప్రజా ప్రతినిధిగా హుందాగా మాట్లాడాల్సింది పోయి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నాడని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

బిజెపి ప్రధాన కార్యదర్శి పోతపాక సాంబయ్య మాట్లాడుతూ....

తుంగతుర్తి లో అత్యధిక ఓట్లు కలిగిన మాదిగలను అవమానించిన కిషోర్ కి వచ్చే ఎన్నికల్లో మాదిగలే రాజకీయ గోరి కడతారని హెచ్చరించారు.

దళిత బంధు పథకాన్ని అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని పేర్కొన్నారు. దళిత బంధు ద్వారా దళితులకు ఇస్తున్న డబ్బులు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి గాదరి కిషోర్ ఇసుక దందాలో తీసుకున్న కమిషన్ నుండో కావని సత్యం తెలుసుకోవాలని అన్నారు. తరతరాలుగా దోపిడీకి గురైన ప్రజలకు న్యాయబద్ధంగా చెందాల్సిన వాటిని ప్రభుత్వం ఇస్తుంది తప్ప గాదరి కిషోర్ ఇంట్లో నుండి ఇస్తున్నవి కావని అన్నారు.

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిముల్ల శంకర్ మాట్లాడుతూ...

ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి గాదరి కిషోర్ ను భారత రాష్ట్ర సమితి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వొద్దని హెచ్చరించారు.

గాదరి కిషోర్ ఎమ్మార్పీఎస్ నాయకులకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే గాదర్ కిషోర్ ను నియోజకవర్గంలో మాదిగలు అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు బొజ్జ దేవయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, కందుల మోహన్, ముత్యాల శంకర్ రెడ్డి, ఇరుగు లక్ష్మయ్య, దుబ్బ సత్యనారాయణ, మాసారం వెంకన్న, తోరకోప్పుల రాజు, బొజ్జ నాగరాజు, బొజ్జ కృష్ణయ్య, ప్రభాకర్, గురుజ వెంకన్న, కృష్ణయ్య, అర్జున్, బొజ్జ నవీన్, ఏడుకొండలు, కత్తుల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు సీబీఐ బృందం కు లైన్ క్లియర్

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ..

ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి..

ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించలేమని తిరస్కరించిన సుప్రీం కోర్టు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS