వైద్య విద్యలో దేశంలోనే తెలంగాణ రికార్డు
నూతనంగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు శిల్పకళావేదికలో నియామకపత్రాలు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం అందించారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు.
వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు, సిబ్బంది నియామకాలు భారీగా చేస్తున్నామన్నారు. 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లను ఒకే ఒక రోజు నియమించడం జరిగిందని.. ఇది వైద్య విద్యలో దేశంలోనే రికార్డ్ అన్నారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నారు. అందులో భాగంగా ఇవాళ 1061 మంది రిక్రూట్మెంట్ చేయనున్నట్టు తెలిపారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘గత నెలలో 900 మందికి పైగా ఉద్యోగాలు.. 1331 మంది ఆయుష్ పారా మెడికల్ లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పెర్మినెంట్ చేశాం. తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చాం. మరో 9222 పోస్ట్ లకు ఆరోగ్య శాఖ లో మరో రెండు నెలల్లో నియామకాలు చేపడతాం.
రోగుల ఆరోగ్యాన్ని నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. రోగులను ఆత్మీయంగా పలకరించాలి. ఒకటి రెండు ఘటనలతో ఆరోగ్య శాఖ పెరు చెడిపోకూడదు.
ప్రాణాలు కాపాడే గొప్ప వృత్తి వైద్యులది. గతంలో జబ్బులు వస్తే ఆ కుటుంబమే ఆర్ధికంగా చితికిపోయేది. ఇప్పుడు జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు మంచి వైద్యం అందుతోంది’’ అని పేర్కొన్నారు....
May 22 2023, 18:37