ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు సీబీఐ బృందం కు లైన్ క్లియర్

సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ..

ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి..

ముందస్తు బెయిల్ పిటిషన్ స్వీకరించలేమని తిరస్కరించిన సుప్రీం కోర్టు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్..

ఢిల్లీ: వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి..

వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేయనున్నారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు అవినాశ్ తన బెయిల్ పిటిషన్ను మెన్షన్ చేయనున్నారు.

గతంలో హైకోర్టు వేకేషన్ బెంచ్ ను తన బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు.

జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని చెప్పిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ను అవినాశ్ ఉంచారు.

ఇక ఆయన పిటిషన్ను వ్యతిరేకించేందుకు వివేకా కూతురు సునీత తరుఫు లాయర్లు సైతం సిద్ధంగా ఉన్నారు..

G20 Meet: శ్రీనగర్‌లో జి 20 సదస్సు... మెరైన్ కమాండోలు, జాతీయ భద్రతా గార్డులతో భారీ భద్రత

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ లో సోమవారం నుంచి జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్‌ జరగనున్న నేపథ్యంలో సాయుధ భద్రతను కట్టుదిట్టం చేశారు.జీ20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు..

ఉగ్రవాదులు జి20 ఈవెంట్‌కు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించవచ్చన్న నివేదికల మధ్య ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి),జమ్మూ కాశ్మీర్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

జి20 ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కదలికపై కూడా ఆంక్షలు విధించారు.లాల్ చౌక్ ఏరియాలోని దుకాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు.

జి-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతం కావడం వల్ల జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకుల రాక, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు..

SB NEWS

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి జిల్లా:

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు సోమవారం స్వామివారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ఆదివారం స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 39,812 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు...

SB NEWS

SB NEWS

SB NEWS

భువనగిరి ఆలేరు నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పు

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో యాదాద్రి జిల్లాలోని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై సొంత పార్టీలో మైండ్​ గేమ్​ మొదలైంది. భూవనగిరి, ఆలేరు అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆలేరులో బూడిద భిక్ష్మయ్య గౌడ్​కు, భువనగిరిలో మరో నేతకు టికెట్​ఇస్తారని సోషల్​మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలతోపాటు క్యాడర్​ అయోమయానికి గురవుతోంది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

మొదట్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని ఆలేరు కు మారుస్తారని, ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతను కాకుండా ఆమె భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందనర్​రెడ్డికి టికెట్ ఇస్తారంటూ మునుగోడు ఉప ఎన్నికకు ముందు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మహేందర్​రెడ్డి ఖండించి సునీతనే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. కానీ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోకి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్​లో చేరడంతో సీన్ మారిపోయింది.

ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు వరుసగా రెండుసార్లు గెలవడంతో వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సమఉజ్జీలు బీఆర్ఎస్​లో లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య తిరిగి బీఆర్ఎస్​లో చేరడం, అనుకున్నట్టుగా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం తో ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సు నీతకు సమఉజ్జీగా నిలబడ్డారు. గౌడ సామా జికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆలేరు టికెట్ బూడిదకు ఇస్తారని ప్రచారం మొదలైంది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని తప్పించి మరోపార్టీకి చెందిన బలమైన క్యాండిడేట్​ను బీఆర్ఎస్​లో తీసుకొని రావడానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేత ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా భువనగిరికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్​రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తారంటూ మరో ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్​

లీడర్ల మైండ్ గేమ్ లో భాగంగానే ఈ ప్రచారానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో కొత్త అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఆలేరుకు బూడిద భిక్షమయ్య గౌడ్, భువనగిరికి చింతల వెంకటేశ్వర్ రెడ్డి లేదంటే జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అభ్యర్థులుగా పేర్కొన్న లిస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య లీడర్లే ఈ ప్రచార ప్రయోగం చేయిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితితో అటు ఎమ్మెల్యేలు.. ఇటు నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

ప్రోగ్రామ్స్​ సంఖ్య పెంచుతున్రు..

బీఆర్​ఎస్​ తరుచూ అంతర్గత సర్వేలు చేస్తుండటం, ఎమ్మెల్యేల పనితీరుపై ఆరా తీసుండటంతో ఇటీవల ఎమ్మెల్యేలు అటెండ్​ అయ్యే ప్రోగామ్స్​సంఖ్య పెరుగుతోంది. నియోజకవర్గాల్లో తమకు సమఉజ్జీలూ లేరని, టికెట్ కచ్చితంగా తమకే వస్తుందని భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు భావిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడే ప్రచారం జోరు పెంచారు. రెగ్యులర్​గా ప్రోగ్రామ్స్​ చేస్తూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు..

Avinash reddy: విశ్వభారతి హాస్పిటల్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు.. ఎస్పీకి కీలక సమాచారం...

కర్నూలు: మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (YS Viveka case) విచారణకు హాజరవకుండా తప్పించుకుంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash reddy) అరెస్టుకు సీబీఐ (CBI) సిద్ధమైంది..

అవినాష్ రెడ్డి నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌ వద్ద ఉంటుండడంతో సీబీఐ అధికారులు, పోలీసులు సోమవారం ఉదయమే అక్కడకు చేరుకున్నారు.

అవినాష్ అరెస్టుపై కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆస్పత్రి గేటు వద్ద వైసీపీ శ్రేణులు మోహరించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను వెనక్కి పంపుతున్నారు. కాగా తల్లి శ్రీలక్ష్మీ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి అవినాష్ రెడ్డి అక్కడే ఉంటున్నారు..

SB NEWS

ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్,,,వాతావరణ శాఖ హెచ్చరిక..

ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు.

ద్రోణి ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇక వడగాల్పులపైనా అధికారులు కీలక సూచనలు చేశారు. మన్యం జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం మండలాల్లో, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, వీరపనాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలాల్లో,

విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఆదివారం.. కడప జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలో ఒక మండలంలో వడగల్పులు వీచాయని వెల్లడించారు.

SB NEWS

థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్

విజయవాడ :

ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్ గా ఎన్టీఆర్ ఫాన్స్ అంతా కలిసి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ చిత్రం సింహాద్రిని రీ రిలీజ్ చేసారు. రీ రిలీజ్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, భారీగా ప్రమోషన్స్ తో సినిమాని నిన్న ఆయన బర్త్ డే రోజున విడుదల చేసారు.

రీ రిలీజ్ చిత్రమైనా ఎన్టీఆర్ ఫాన్స్ హంగామాతో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని 1000 థియేటర్స్ లో విడుదలై రికార్డ్ సృష్టించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. అంతటితో పండగ చేసుకుని సంబరపడకుండా సింహాద్రి విడుదలైన థియేటర్స్ లో బాణా సంచా కాల్చి హంగామా చేసారు.

అలా విజయవాడలోని అప్సర థియేటర్ లో ఎన్టీఆర్ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తూ థియేటర్ లోపలే బాణా సంచా కాల్చడంతో థియేటర్ తగలబడిన ఘటన వైరల్ గా మారింది.

ఫాన్స్ అతి, వారి రచ్చ తో థియేటర్స్ లో పేల్చిన బాణాసంచా వలన థియేటర్ లోకి సీట్స్ కాలిపోయాయి. పోలీస్ లు రంగంలోకి దిగి ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలని అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే థియేటర్ సగం కాలిపోయింది.

ఫాన్స్ ఉత్సాహం కాస్త అత్యుత్సాహంగా మారితే ఇలానే ఉంటుంది. ఎంత రచ్చ చేసినా అదుపుతప్పకూడదు. హద్దు మీరకూడదు.. లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఎన్టీఆర్ ఫాన్స్ ఎంత వైల్డ్ గా లేకపోతే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఫాన్స్ కాస్త అదుపులో ఉంటే అందరికి మంచిది...

ఈ రేంజ్ లో తాగుతున్నారా❓️

రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటుగా బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023 మే 1 నుంచి 21 మధ్య రాష్ట్రంలో 4.23 కోట్ల బీర్ సీసాలు అమ్ముడయ్యాయి.

కేవలం బీర్ల విక్రయం ద్వారా ఫ్రభుత్వం రూ. 582.99 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరో రెండు వారాల్లో బీర్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని.. మే చివరి నాటికి బీర్ల విక్రయం రూ.1000 కోట్లు దాటుతుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ రేంజ్ లో తాగుతున్నారా❓️

ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మే నెల ప్రారంభం నుంచి మే 21 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల ద్వారా 35 లక్షల 25వేల 247 కాటన్‌ల బీర్‌ బాటిళ్లు అమ్ముడయ్యాయి. ఈ 21 రోజుల్లో బీర్ల విక్రయాల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో రూ.48.14 కోట్ల విలువైన 3 లక్షల 364 కాటన్‌ల బీర్ల విక్రయాలు జరిగడం గమనార్హం.

మే నెల ప్రారంభం నుంచి 21 తేదీ వరకు మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో కాటన్​కు 12 బీర్ల చొప్పున సగటున రోజుకు 23,50,164 బీరు సీసాలు ఖాళీ అయ్యాయి. ఈ లెక్కన 21 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను మద్యం ప్రియులు ఖాళీ చేశారు. మరో వైపు లిక్కర్ విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 1,20,334 కాటన్ల లిక్కర్ సేల్ కాగా.. రూ. 78.42 కోట్ల ఆదాయం వచ్చింది. నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. ఓవరాల్ గా ఈ 21 రోజుల్లో లిక్కర్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 904.47 కోట్ల ఆదాయం వచ్చింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 17 వరకు 1,01,54,100 బీర్‌ బాటిళ్లు అమ్ముడయ్యాయి. రోజుకు సగటున 6 లక్షల బీర్ బాటిళ్లను మద్యం ప్రియులు వినియోగిస్తున్నారు. ఈ 17 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 8,46,175 బీర్ కాటన్‌లు అమ్ముడవడం విశేషం

హైదరాబాద్లో జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్:

నగరంలో జోరుగా వర్షం పడుతోంది. జూబ్లీ హీల్స్, మాదాపూర్ ఫిలింనగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగం పల్లి, పటాన్ చెరు, మెహిదీపట్నం కొండాపూర్, కేపీహెచ్ బీ, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తోంది.

ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనాలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

భారీగా వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. ఉదయం నుంచి ఎండవేడిమికి నగరవాసులు అల్లాడిపోయారు. సాయంత్రం ఇలా ఒక్కసారిగా వర్షం కురుస్తుండండతో వారికి కాస్త ఉపశమనం లభించినట్టు అయింది.

ఇక ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షార్పణం అయిపోతుంటే అన్నదాతలు కంట నీరు ఆగడం లేదు.....

SB NEWS